Chhaava Twitter Review: ఛావా ట్విట్టర్ రివ్యూ - రష్మిక మందన్న బాలీవుడ్ మూవీకి హిట్టు టాక్ - మాస్టర్ పీస్ అంటూ…
Chhaava Twitter Review: పుష్ప 2 తర్వాత రష్మిక మందన్న బాలీవుడ్ మూవీ ఛావాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో విక్కీ కౌశల్ హీరోగా నటించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ హిందీ మూవీ ఎలా ఉందంటే?

Chhaava Twitter Review: విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ ఛావా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. హిస్టారికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ఒకటిగా రిలీజైన ఛావా టాక్ ఎలా ఉందంటే?
శంభాజీ జీవితం ఆధారంగా...
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా హిస్టారికల్ యాక్షన్ మూవీగా ఛావా తెరకెక్కింది. ఛావా మూవీ ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతమంటూ నెటిజన్లు చెబుతోన్నారు. మాస్టర్ పీస్ మూవీ ఇదని అంటున్నారు.
ఆద్యంతం ఊపిరి బిగపట్టి చూసేలా గ్రిప్పింగ్‌గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఛావా మూవీని తెరకెక్కించాడని ట్వీట్స్ చేస్తోన్నారు. దేశభక్తి, చరిత్రను మిక్స్ చేస్తూ శంభాజీ జీవితాన్ని స్ఫూర్తి దాయకంగా డైరెక్టర్ ఛావా మూవీలో చూపించాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. యుద్ధ సన్నివేశాలు గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని ట్వీట్ చేశాడు.
నెక్స్ట్ లెవెల్...
చివరి ఇరవై నిమిషాలు ఛావా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చెబుతోన్నారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అసమాన నటనను కనబరిచాడని ట్వీట్స్ చేస్తోన్నారు. చారిత్రక యోధుడి పాత్రకు ప్రాణం పోశాడని అంటున్నారు. అతడి కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా శంభాజీ పాత్ర నిలిచిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది కానీ...
రష్మిక మందన్న గత సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ రోల్‌లో కనిపించినట్లు పేర్కొంటున్నారు. నేషనల్ క్రష్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని కామెంట్స్ చేస్తోన్నారు. అయితే రష్మిక యాక్టింగ్ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగా లేదని, యేసుబాయి పాత్రకు అంతగా రష్మిక సూట్ కాలేదని చెబుతోన్నారు. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షర్ కుమార్ కూడా తేలిపోయాడని ట్వీట్స్ చేస్తోన్నారు.
చరిత్రను వక్రీకరించకుండా…
అలనాటి మరాఠా సామ్రాజ్య వైభవాన్ని చూపించిన తీరు బాగుందని, విజువల్స్, క్యాస్ట్యూమ్స్ రియలిస్టిక్‌గా ఉన్నాయని నెటిజన్లు వ్యక్తం చేస్తోన్నారు. చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా వాస్తవాలను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు ఛావా మూవీలో చూపించాడని చెబుతోన్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం పీరియాడిక్ ఫీల్‌గా కలిగించలేకపోయిందని, రన్‌టైమ్ ఎక్కువ కావడం కూడా ఓ మైనస్ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఛావా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయమని చెబుతోన్నారు.
సంబంధిత కథనం