బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఛావా తెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 11న ఛావా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగు వెర్షన్ మాత్రం ఒక రోజు ఆలస్యంగా శనివారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ, తెలుగు భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఛావా సినిమాను తెరకెక్కించాడు. మోస్తారు అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ట్రేడ్ వర్గాల అంచనాలను పూర్తిగా తలక్రిందులు చేస్తూ 800కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ఈ ఏడాది హిందీలోనే కాకుండా ఇండియా వైడ్‌గా హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఛావా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు వెర్షన్ 15 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. తెలుగులో డబ్ అయినా బాలీవుడ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఛావా మూవీలో శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది ఛావా సినిమాకు గాను విక్కీ కౌశల్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయమంటూ క్రిటిక్స్‌తో పాటు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అతడి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదంటూ ప్రశంసలు కురిపించారు.
ఛావా మూవీలో శంభాజీభార్య యశు బాయిగా రష్మిక మందన్న కనిపించింది. . మొఘలు చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా కనిపించాడు. విక్కీ కౌశల్ యాక్టింగ్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఛావా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని తన సొంతం మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు దండయాత్ర చేస్తాడు. తన కంటే ఎన్నో రెట్లు బలవంతుడైన ఔరంగజేబును ఎదురించి ధైర్యంగా పోరాడుతాడు శంభాజీ. కుట్రలతో శంభాజీని ఓడించి బందీగా చేస్తాడు ఔరంగజేబు. మొఘల్ సైన్యానికి చిక్కిన శంభాజీని ఔరంగజేబు ఎలాంటి చిత్రహింసలకు గురిచేశాడు? శత్రువులుతో చేతులు కలిపి శంభాజీని మోసం చేసింది ఎవరు అన్నదే ఛావా మూవీ కథ.
సంబంధిత కథనం