Chhaava Box Office Collection: వాలెంటైన్స్ డే కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసిన రష్మిక మందన్నా మూవీ.. తొలి రోజే భారీగా..
Chhaava Box Office Collection: వాలెంటైన్స్ డే రోజే రిలీజైన పీరియడ్ డ్రామా ఛావా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది.

Chhaava Box Office Collection: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజే రికార్డు కలెక్షన్లు వచ్చాయి. మూవీకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినా బాక్సాఫీస్ విషయంలో మాత్రం సక్సెసైంది. 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం.
ఛావా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు
లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఛావా మూవీ తొలి రోజు ఇండియాలో ఏకంగా రూ.31 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో వాలెంటైన్స్ డేనాడు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో గల్లీ బాయ్స్ పేరు మీద ఈ రికార్డు ఉంది. విక్కీ కౌశల్ కెరీర్లోనూ అతిపెద్ద ఓపెనింగ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో అతడు అదరగొట్టాడు. అతని భార్య యేసుబాయిగా రష్మిక నటించింది.
గతంలో విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ మూవీ తొలి రోజు రూ.8.2 కోట్లు సాధించగా.. ఇప్పుడు ఛావా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక 2025లో అత్యధిక తొలి రోజు కలెక్షన్లు సాధించిన మూవీ కూడా ఇదే. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ పేరిట రూ.15.3 కోట్లుగా ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
ఛావా మూవీ గురించి..
ఛావా మూవీని ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇదే పేరుతో గతంలో వచ్చిన నవలే సినిమాకు ఆధారం. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో శంభాజీగా విక్కీ కౌశల్ నటించాడు. యేసుబాయిగా రష్మిక, మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించారు.
ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. మరాఠా సింహమైన శివాజీ కన్నుమూసినా.. ఆయన తనయుడు శంభాజీ శత్రువుల పాలిట సింహస్వప్నంగా ఉన్నాడన్న ఉద్దేశంలో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారు. ఈ ఛావా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమాకు తొలి రోజు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. మూవీ అద్భుతంగా ఉందని కొందరు, మరింత మెరుగ్గా చేయాల్సిందని మరికొందరు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. అయితే విక్కీ కౌశల్, రష్మిక నటనకు మాత్రం అందరూ వందకు వంద మార్కులు వేశారు.
సంబంధిత కథనం
టాపిక్