Chhaava Box Office: ఓటీటీలోకి వచ్చినా తగ్గని బాక్సాఫీస్ జోరు.. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా రికార్డు-chhaava box office collection surpassed 600 crores in india second movie from bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chhaava Box Office: ఓటీటీలోకి వచ్చినా తగ్గని బాక్సాఫీస్ జోరు.. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా రికార్డు

Chhaava Box Office: ఓటీటీలోకి వచ్చినా తగ్గని బాక్సాఫీస్ జోరు.. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా రికార్డు

Hari Prasad S HT Telugu

Chhaava Box Office: ఓటీటీలోకి అడుగుపెట్టినా ఛావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అటు బాక్సాఫీస్ రికార్డులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

ఓటీటీలోకి వచ్చినా తగ్గని బాక్సాఫీస్ జోరు.. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా రికార్డు

Chhaava Box Office: బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉంది. తాజాగా ఇండియాలో రూ.600 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా హిందీలో మూడో స్థానంలో ఉంది.

ఛావా బాక్సాఫీస్ రికార్డు

ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. ఇందులో లీడ్ రోల్లో విక్కీ కౌశల్ నటించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. అయితే అటు బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ బాగానే వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఇండియాలోనే ఈ మూవీ నెట్ కలెక్షన్లు రూ.600 కోట్లు దాటాయి.

స్త్రీ2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ మూవీ ఇదే. ఇక పుష్ప 2 కూడా ఈ ఘనత సాధించినా.. అది హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమా అన్న విషయం తెలిసిందే. ఓవరాల్ గా హిందీలో ఇండియాలో రూ.600 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన మూడో సినిమా ఛావా.

విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. 600 నాటౌట్ అంటూ ఛావా మూవీ రూ.600 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ దాటినట్లు చెప్పాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఛావా మూవీ రూ.800 కోట్లకుపైనే వసూలు చేసింది. అటు రష్మిక మందన్నా కూడా రూ.600 కోట్ల వసూళ్ల విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఛావా మూవీ స్టోరీ ఏంటంటే?

ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని త‌న సొంతం మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు దండ‌యాత్ర చేస్తాడు. త‌న కంటే ఎన్నో రెట్లు బ‌ల‌వంతుడైన ఔరంగ‌జేబును ఎదురించి ధైర్యంగా పోరాడుతాడు శంభాజీ. కుట్ర‌ల‌తో శంభాజీని ఓడించి బందీగా చేస్తాడు ఔరంగ‌జేబు. మొఘ‌ల్ సైన్యానికి చిక్కిన శంభాజీని ఔరంగ‌జేబు ఎలాంటి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశాడు? శ‌త్రువులుతో చేతులు క‌లిపి శంభాజీని మోసం చేసింది ఎవ‌రు అన్న‌దే ఛావా మూవీ క‌థ‌.

ఛావా మూవీలో శంభాజీ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ ఏడాది ఛావా సినిమాకు గాను విక్కీ కౌశ‌ల్‌కు నేష‌న‌ల్ అవార్డు రావ‌డం ఖాయ‌మంటూ క్రిటిక్స్‌తో పాటు బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అత‌డి కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం