చౌర్య పాఠం రివ్యూ - మ‌నీ హైస్ట్ కాన్సెప్ట్‌తో తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - ధ‌మాకా డైరెక్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే?-chaurya patam movie review and rating trinadha rao nakkina crime comedy movie review plus and minus poins ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  చౌర్య పాఠం రివ్యూ - మ‌నీ హైస్ట్ కాన్సెప్ట్‌తో తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - ధ‌మాకా డైరెక్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే?

చౌర్య పాఠం రివ్యూ - మ‌నీ హైస్ట్ కాన్సెప్ట్‌తో తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - ధ‌మాకా డైరెక్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu

టాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని క‌థా ర‌చ‌యిత‌గా, ధ‌మాకా డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు నిర్మాణంలో రూపొందిన చౌర్య పాఠం మూవీ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

చౌర్య పాఠం రివ్యూ

ఇంద్ర‌రామ్, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించిన చౌర్య పాఠం. ఈగ‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మేని క‌థ‌, అందించ‌డం, ధ‌మాకా డైరెక్ట‌ర్‌ త్రినాథ‌రావు న‌క్కిన నిర్మించ‌డంతో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు నిఖిల్ గొల్ల‌మూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 25న థియేట‌ర్ల‌లో రిలీజైన చౌర్య పాఠం మూవీ ఎలా ఉందంటే?

బ్యాంకు రాబ‌రీ ప్లాన్‌...

వేదాంత్‌రామ్(ఇంద్ర‌రామ్‌) ఓ సినిమా పిచ్చోడు. డైరెక్ట‌ర్‌గా ఎప్ప‌టికైనా సినిమా తీయాల‌న్న‌ది అత‌డి క‌ల. కానీ డ‌బ్బులు ఉండ‌వు. ధ‌న‌పాలి ఐదేళ్లుగా ఆద‌ర్శ‌గ్రామంగా అవార్డులు అందుకుంటుంది. ఆ ఊరిలోని గ్రామీణ బ్యాంకును దోచుకొని ఆ డ‌బ్బుల‌తో సినిమా తీయాల‌ని ప్లాన్ వేస్తాడు వేదాంత్‌. ఆ బ్యాంకును దోచుకోవ‌డానికి బ‌బ్లూ (మ‌స్త్ అలీ), జాక్‌డాన్‌తో(అంజి) పాటు మ‌రో స్నేహితుడితో క‌లిసి ఓ టీమ్ ఏర్పాటుచేస్తాడు.

బ్యాంకు దోచుకోవ‌డానికంటే ముందు ధ‌న‌పాలి ఊరి గురించి తెలుసుకోవాల‌ని వేదాంత్‌రామ్ నిర్ణ‌యించుకుంటాడు. డాక్యుమెంట‌రీ ఫిల్మ్ మేక‌ర్స్‌గా త‌న టీమ్‌తో క‌లిసి ఆ ఊరికి వెళ‌తాడు. అక్క‌డ వారికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? వేదాంత్ రాబ‌రీ ప్లాన్‌లోకి అదే బ్యాంకు ఎంప్లాయ్ అంజ‌లి (పాయ‌ల్ రాధాకృష్ణ‌) ఎలా భాగ‌మైంద?

బ్యాంకు లోప‌లికి సొరంగం త‌వ్వాల‌నే వేదాంత్ రామ్ ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? వేదాంత్ రామ్‌తో పాటు అత‌డి ఫ్రెండ్స్‌ను ఊరి వాళ్లంతా క‌లిసి ఎందుకు చంపాల‌ని చూశారు? వారి బ్యాంకు రాబ‌రీ ప్లాన్ స‌క్సెస్ అయ్యిందా? లేదా? వేదాంత్ డైరెక్ట‌ర్ అయ్యాడా? అన్న‌దే చౌర్య పాఠం మూవీ క‌థ‌.

హాలీవుడ్‌లో ఫేమ‌స్‌...

బ్యాంకు రాబ‌రీ బ్యాక్‌డ్రాప్ హాలీవుడ్‌లో ఫేమ‌స్ జాన‌ర్‌. ఈ బ్యాంకు రాబ‌రీ క‌థాంశాల‌తో మ‌నీ హైస్ట్ లాంటి సిరీస్‌లే కాకుండా ది ఇటాలియ‌న్ జాబ్‌, బేబీ డ్రైవ‌ర్‌, ది టౌన్ లాంటి ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాలొచ్చాయి. ఈ జాన‌ర్‌లో తెలుగులో చాలా త‌క్కువ సినిమాలొచ్చాయి. ఈ రేర్ కాన్సెప్ట్‌తో చౌర్య పాఠం సినిమా రూపొందింది.

ఆద్యంతం న‌వ్విస్తూనే...

సాధార‌ణంగా రాబ‌రీ సినిమాలు రేసీ స్క్రీన్‌ప్లే, ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో థ్రిల్లింగ్‌గా సాగుతాయి. కానీ చౌర్య పాఠం అందుకు భిన్నంగా ఆద్యంతం ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్‌చేస్తుంది. సినిమాలే ప్ర‌పంచంగా బ‌తికే యువ‌కుడిగా వేదాంత్‌రామ్ పాత్ర ప‌రిచ‌యంతో ఈ సినిమా మొద‌ల‌వుతుంది.

డ‌బ్బు కోసం బ్యాంకు రాబ‌రీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాతే క‌థ‌లో వేగం పెరుగుతుంది. బ్యాంకు రాబ‌రీకి వేదాంత్ వేసే ప్లాన్స్ నుంచి చ‌క్క‌టి ఫ‌న్‌ను జ‌న‌రేట్ అయ్యింది. సీరియ‌స్ సిట్యూవేష‌న్స్ లో మ‌స్త్ అలీ, అంజి వేసే పంచ్‌లు, క‌న్ఫ్యూజింగ్ డ్రామా కడుపుబ్బా న‌వ్విస్తాయి. ప్లాన్ అమ‌లు కోసం వేదాంత్ రామ్ అండ్ టీమ్ ఇచ్చే బిల్డ‌ప్‌లు ఆక‌ట్టుకుంటాయి.

ట్విస్ట్‌లు...

మ‌ధ్య‌లో ఊరి గొడ‌వ‌లు, డాక్యుమెంట‌రీ రైట‌ర్స్‌గా ఊళ్లోకి హీరో గ్యాంగ్ ఎంట‌రైన త‌ర్వాతే వ‌చ్చే సీన్స్ కాస్తంత నెమ్మ‌దిగా సాగిన‌ట్లుగా అనిపిస్తాయి. రాబ‌రీ క‌థ‌లోకి ప్రేమ‌క‌థ‌ను జోడించిన తీరు క‌న్వీన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్‌లో ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు.

దొంగ‌త‌నం చేయాల‌నుకున్న వాళ్ల‌కు సర్పంచ్ గురించి తెలిసిన షాకింగ్ నిజంతో సెకండాఫ్‌ను ఉత్కంఠ‌గా న‌డిపించారు. ఆ ఊరిలోని అరుదైన రాయికి సంబంధించిన బిజినెస్, ఆ అక్ర‌మ వ్యాపారానికి అడ్డొచ్చిన వారు హ‌త‌మ‌వ్వ‌డం, ఊరి ప్ర‌జ‌ల‌కు నిజం చెప్పాల‌నుకున్న హీరోకు ఎదుర‌య్యే సర్ ప్రైజ్ లు ఆక‌ట్టుకుంటాయి. హీరో డాక్యుమెంట‌రీకి అవార్డు రావ‌డం, సినిమా ఛాన్స్ వ‌చ్చే సీన్‌తో సినిమాను ఎండ్ చేశారు.

ఆరంభంలో హిలేరియ‌స్‌గా న‌వ్వించిన ఈ సినిమాలో పోనుపోను కామెడీ డోస్ త‌గ్గుతూ వ‌చ్చింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ సాగ‌తీత‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే కూడా కొంత వ‌ర‌కు ప్రెడిక్ట‌బుల్‌గా అనిపిస్తుంది.

కెమిస్ట్రీ హైలైట్‌...

బ్యాంకు రాబ‌రీకి ప్లాన్ చేసిన యువ‌కుడిగా ఇంద్ర‌రామ్ న‌ట‌న నాచుర‌ల్‌గా ఉంది. సినిమా మొత్తం స్టైలిష్ లుక్‌తో క‌నిపించాడు. పాయ‌ల్ రాధ‌కృష్ణ యాక్టింగ్ కంటే గ్లామ‌ర్‌తోనే ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటుంది. ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ కెమిస్ట్రీ బాగుంది. మ‌స్త్ అలీ పంచ్‌లు, డైలాగ్ డెలివ‌రీ డైరెక్ట‌ర్ బాగా వాడుకున్నాడు. అంజి, మ‌స్త్ అలీ కాంబోలో వ‌చ్చే సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

రాజీవ్ క‌న‌కాల రెగ్యుల‌ర్ రోల్స్‌కు భిన్నంగా క‌నిపించాడు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో సుప్రియ న‌ట‌న బాగుంది.లేడీ విల‌న్ గా అద‌ర‌గొట్టింది.

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ సినిమాకు క‌థ అందిస్తూనే సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు. చిన్న సినిమా అనే ఫీల్ ఎక్క‌డ క‌ల‌గ‌కుండా విజువ‌ల్స్ ఉన్నాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాకు త‌గ్గ‌ట్లుగా దావ్‌జాంద్ మ్యూజిక్ కుదిరింది.

న‌వ్విస్తూనే థ్రిల్‌...

చౌర్య పాటం న‌వ్విస్తూనే థ్రిల్‌ను పంచే క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ. రాబ‌రీ కాన్సెప్ట్ కొత్త‌గా ఉంది. అంచాలేవి లేకుండా చూస్తే మాత్రం నిరాశ‌ప‌ర‌చ‌దు.

రేటింగ్‌: 2.75/5

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం