లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ చౌర్య పాఠం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఓవర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే ప్రస్తుతం ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారానే ఇండియన్ ఆడియెన్స్ ముందుకు చౌర్య పాఠం మూవీ రాబోతున్నట్లు సమాచారం.
చౌర్య పాఠం మూవీలో ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో లేడీ విలన్‌గా సుప్రియ ఐసోల అదగొట్టింది. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ క్రైమ్ కామెడీ మూవీకి ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమేని కథను అందించారు. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చౌర్య పాఠం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు.
ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన చౌర్య పాఠం మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కాన్సెప్ట్ బాగున్నా కామెడీ, ట్విస్ట్‌లు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో ఈ మూవీ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి డేవ్‌జాంద్ మ్యూజిక్ అందించాడు.
వేదాంత్‌రామ్(ఇంద్రరామ్) డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. అతడితో సినిమా తీసేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే సొంతంగా ఓ మూవీని తీయాలని అనుకుంటాడు. ధనపాలి ఐదేళ్లుగా ఆదర్శగ్రామంగా అవార్డులు అందుకుంటుంది.
ఆ ఊరిలోని గ్రామీణ బ్యాంకును దోచుకొని ఆ డబ్బులతో సినిమా తీయాలని ప్లాన్ వేస్తాడు వేదాంత్. ఆ బ్యాంకును దోచుకోవడానికి బబ్లూ (మస్త్ అలీ), జాక్‌డాన్‌తో(అంజి) పాటు మరో స్నేహితుడితో కలిసి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్‌గా ధనపాలి ఊళ్లో అడుగుపెడతాడు. వేదాంత్ రాబరీ ప్లాన్‌లోకి అదే బ్యాంకు ఎంప్లాయ్ అంజలి (పాయల్ రాధాకృష్ణ) కూడా చేరుతుంది.
తాము ఉంటున్న ఓ స్కూల్ బిల్డింగ్ నుంచి బ్యాంకు లోపలికి సొరంగం తవ్వాలనే వేదాంత్ రామ్ ప్రయత్నం ఫలించిందా? ఊరి సర్పంచ్ వసుధ గురించి వేదాంత్‌కు తెలిసిన నిజం ఏమిటి? ధనపాళి ప్రజలు వేదాంత్‌తో పాటు అతడి స్నేహితులను చంపాలని ఎందుకు అనుకున్నారు? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత కథనం