Telugu Serial: ఛత్రపతి యాక్టర్ కొత్త తెలుగు సీరియల్ - టైటిల్ ఇదే - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?
Telugu Serial: ప్రభాస్ ఛత్రపతి మూవీతో ఫేమస్ అయిన నటుడు ఛత్రపతి శేఖర్ కొత్త సీరియల్‌తో త్వరలో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లక్ష్మినివాసం పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతోంది.
Telugu Serial: ఛత్రపతి శేఖర్ తెలుగులో కొత్త సీరియల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. లక్ష్మినివాసం పేరుతో రూపొందిన ఈ సీరియల్ త్వరలో జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతోంది. లక్ష్మినివాసం ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది.
కన్నడ రీమేక్...
ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న లక్ష్మినివాసం సీరియల్‌లో ఛత్రపతి శేఖర్‌తో పాటు శ్రీరంజని కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడం సీరియల్ లక్ష్మినివాసకు రీమేక్‌గా లక్ష్మినివాసం సీరియల్ రూపొందుతోన్నట్లు సమాచారం. లక్ష్మినివాసం సీరియల్‌కు జయంత్ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
త్యాగానికి సాక్ష్యం....
ప్రోమోలో గుడి మెట్లకు పసుకు, కుంకుమ రాస్తూ శ్రీరంజని కనిపించింది. ఈ సంవత్సరం ఇళ్లు కడితే కాలి నడకన నీ కొండకు వస్తాను స్వామి అని ఛత్రపతి శేఖర్ మొక్కుకోవడం కనిపించింది. ముందు పెద్దమ్మాయి పెళ్లి చేయాలి అని శేఖర్‌కు శ్రీ రంజని సమాధానమిచ్చింది. ఇళ్లు నా త్యాగానికి సాక్ష్యం అని శేఖర్ అనగా...పిల్లలు మన ప్రేమకు ప్రతి రూపాలు అనడం ఆకట్టుకుంటుంది.
ఇళ్లు కోసం తాను కట్టిన ముడుపు గుడిలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు శ్రీ రంజని ఇచ్చి ఎమోషనల్ కావడం ప్రోమోలో చూపించారు. అందమైన ఇళ్లు...ఆడపిల్ల పెళ్లి మధ్య అనురాగాలతో అల్లుకున్న బంధం లక్ష్మి నివాసం అంటూ చివరలో వచ్చిన వాయిస్ ఓవర్ వినిపించింది. డిసెంబర్ నెలాఖరు నుంచి జీ తెలుగులో ఈ సీరియల్ టెలికాస్ట్ కానున్నట్లు చెబుతోన్నారు.
రాజమౌళి సినిమాలతో...
రాజమౌళి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు శేఖర్. స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో శేఖర్ నటించాడు. ఛత్రపతి మూవీతోనే అతడి పేరు ఛత్రపతి శేఖర్‌గా మారింది. విక్రమార్కుడు, ఈగ, రంగస్థలంతో పాటు భారీ బడ్జెట్ మూవీస్ ఛత్రఫతి శేఖర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రాధమ్మ కూతురు...
సినిమాలతో పాటు తెలుగులో పలు టీవీ సీరియల్స్‌చేశాడు ఛత్రపతి శేఖర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసంతో పాటు పద్మవ్యూహం, రాధమ్మ కూతురు, మనసిచ్చి చూడు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేశాడు. ప్రస్తుతం రంగులరాట్నం సీరియల్‌లో నటిస్తోన్నాడు.
శ్రీరంజని తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకుపైగా సినిమాలు చేసింది. తెలుగులోనూ ఖలేజా, బ్రహ్మోత్సవం, టచ్ చేసి చూడుతో పాటు మరికొన్ని మూవీస్‌లో నటించింది. జీవన సంధ్య, ఆలుమగలు వంటి సీరియల్స్‌లో నటించింది.