Chatrapathi Hindi Trailer: అక్కడ శ్రీలంక.. ఇక్కడ పాకిస్థాన్.. మిగతాదంతా సేమ్ టు సేమ్.. ఛత్రపతి హిందీ ట్రైలర్-chatrapathi hindi trailer released with full of action sequences ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chatrapathi Hindi Trailer Released With Full Of Action Sequences

Chatrapathi Hindi Trailer: అక్కడ శ్రీలంక.. ఇక్కడ పాకిస్థాన్.. మిగతాదంతా సేమ్ టు సేమ్.. ఛత్రపతి హిందీ ట్రైలర్

Hari Prasad S HT Telugu
May 02, 2023 04:01 PM IST

Chatrapathi Hindi Trailer: అక్కడ శ్రీలంక.. ఇక్కడ పాకిస్థాన్.. మిగతాదంతా సేమ్ టు సేమ్.. ఛత్రపతి హిందీ ట్రైలర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో మంగళవారం (మే 2) రిలీజైంది. బెల్లంకొండ శ్రీనివాస్ తన సిక్స్ ప్యాక్, ఫైట్స్ తో అదరగొట్టాడు.

ఛత్రపతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ, బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ బరూచా స్టెప్పులు
ఛత్రపతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ, బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ బరూచా స్టెప్పులు

Chatrapathi Hindi Trailer: హిందీ మాస్ ఆడియెన్స్ కు పండగలాంటి సినిమా తీసుకొస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్, వీవీ వినాయక్. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఛత్రపతి మూవీని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసిన విషయం తెలుసు కదా. తాజాగా మంగళవారం (మే 2) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను పూర్తిగా యాక్షన్ సీన్స్ తో నింపేశారు.

ఒరిజినల్ ఛత్రపతి మూవీలో హీరో ఫ్యామిలీ శ్రీలంక నుంచి ఇండియాకు కాందిశీకులుగా వచ్చినట్లుగా చూపించగా.. హిందీ రీమేక్ లో మాత్రం పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చూపించారు. ఇది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు. తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో ఛత్రపతిని ఎంత గంభీరంగా చూపించారో.. హిందీలోనూ అలాగే కనిపిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ తన సిక్స్ ప్యాక్ బాడీ, ఫైట్స్ తో అదరగొట్టాడు. తెలుగులో శ్రియ ఫిమేల్ లీడ్ గా కనిపించగా.. హిందీలో నుష్రత్ బరూచా నటించింది. ఇక తెలుగు ఛత్రపతిలో ప్రభాస్ తల్లిగా భానుప్రియ నటించగా.. హిందీలో ఆ రోల్ భాగ్యశ్రీ పోషించింది. ఒరిజినల్ నుంచి దూరం వెళ్లకుండా వీవీ వినాయక్ ఈ రీమేక్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

ఇంతకుముందు తీసుకొచ్చిన టీజర్ కూడా అలాగే ఉంది. ఈ హిందీ ఛత్రపతి మూవీని పెన్ స్టూడియోస్ తెరకెక్కించగా.. ఈ మూవీ మే 12న రిలీజ్ కాబోతోంది. మంగళవారం (మే 2) ముంబైలో ఈ ట్రైలర్ లాంఛ్ ఘనంగా జరిగింది. దీనికి మూవీ యూనిట్ మొత్తం హాజరైంది. తెలుగు ఛత్రపతికి మ్యూజిక్ పెద్ద ప్లస్ అయింది. అయితే హిందీలో ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే అదే కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.

ఒరిజినల్ ఛత్రపతికి కథ అందించిన విజయేంద్ర ప్రసాదే.. ఈ రీమేక్ కు కూడా అందించారు. బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్ బరూచా, భాగ్యశ్రీతోపాటు సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివమ్ పాటిల్, ఆశిష్ సింగ్ లాంటి వాళ్లు నటించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం