Chatrapathi Hindi remake: ఛత్రపతి హిందీ రీమేక్‌ విడుదలపై క్లారిటీ.. ఫైనల్‌గా వచ్చేస్తోంది..!-chatrapathi hindi remake will released in the first week of may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chatrapathi Hindi Remake Will Released In The First Week Of May

Chatrapathi Hindi remake: ఛత్రపతి హిందీ రీమేక్‌ విడుదలపై క్లారిటీ.. ఫైనల్‌గా వచ్చేస్తోంది..!

Maragani Govardhan HT Telugu
Mar 14, 2023 05:50 AM IST

Chatrapathi Hindi remake: అల్లుడు శ్రీను ఫేమ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఛత్రపతి హిందీ రీమేక్. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని మే నెల ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఛత్రపతి హిందీ రీమేక్ లాంచ్‌కు క్లాప్ కొడుతున్న రాజమౌళి
ఛత్రపతి హిందీ రీమేక్ లాంచ్‌కు క్లాప్ కొడుతున్న రాజమౌళి

Chatrapathi Hindi remake: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడంటే బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ అప్పటి వరకు చిన్న హీరోగా ఉన్న ప్రభాస్‌ను స్టార్‌ను చేసిన సినిమా మాత్రం ఛత్రపతినే. రాజమౌళి టెకింగ్, ప్రభాస్ యాక్టింగ్‌కు ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్‍‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే 2021లో పట్టాలెక్కిన ఈ సినిమా గురించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

దీంతో ఛత్రపతి హిందీ రీమేక్‌కు కొన్ని ప్రొడక్షన్ సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినిమా విడుదలపై స్పష్టత కొరవడింది. తాజాగా ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఛత్రపతి హిందీ రీమేక్‌ విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను మే ఫస్ట్ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం రానుంది.

ఈ సినిమాలో హిందీ ఆడియెన్స్‌కు అభిరుచికి తగినట్లుగా వీవీ వినాయక్ కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. ఛత్రపతి హిందీ రీమేక్‌లో బెల్లకొండ శ్రీను సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ నుష్రత్ భరుచూ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ పాత్రలో బెల్లంకొండ కనిపించనున్నాడు. పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడా సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాజమౌళి కెరీర్‌లో అద్భుతంగా గుర్తుండిపోయే ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. 2005లో విడుదలైన ఈ మూవీ మదర్ సెంటిమెంట్‌తో పాటు యాక్షన్‌ రెండూ సమపాళ్లలో ఉంటాయి. శ్రీయ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ రాజమౌళి, ప్రభాస్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

IPL_Entry_Point