Changure Bangaru Raja: అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న రవితేజ.. ‘చాంగురే బంగారురాజా’ రిలీజ్ డేట్ ఫిక్స్
Changure Bangaru Raja: హీరో రవితేజ నిర్మిస్తున్న ‘చాంగురే బంగారురాజా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. పోటీ లేకుండా ఈ చిత్రం వస్తోంది.
Changure Bangaru Raja: మాస్ మహారాజ, స్టార్ హీరో రవితేజ నిర్మిస్తున్న ‘చాంగురే బంగారురాజా’ సినిమా సడన్‍గా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘చాంగురే బంగారురాజా’ చిత్రానికి దర్శకత్వం వహించారు సతీశ్ వర్మ. వచ్చే వారం ఏ తెలుగు చిత్రం రిలీజ్ కాకపోతుండటంతో ‘చాంగురే బంగారురాజా’ను విడుదల చేసేందుకు రవితేజ ప్లాన్ చేశారు. అలాగే, ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్‍ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ వివరాలు ఇవే.
‘చాంగురే బంగారురాజా’ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రామ్ పోతినేని మూవీ ‘స్కంద’ రిలీజ్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఆరోజు మరే తెలుగు చిత్రం రిలీజ్ కావడం లేదు. దీంతో ‘చాంగురే బంగారురాజా’కు మంచి అవకాశం వచ్చింది. ఎలాంటి పోటీ లేకుండా థియేటర్లలోకి వచ్చేందుకు ఛాన్స్ వచ్చింది. వినాయక చవితి ముందు వీకెండ్ కావడం, అందులోనూ పోటీ లేకపోవటంతో ఈ చిత్రానికి కలిసి రానుంది. దీంతో ఈ అవకాశాన్ని నిర్మాత రవితేజ ఉపయోగించుకున్నారు. మంచి ప్లానింగ్‍తో ‘చాంగురే బంగారురాజా’ను విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు రవితేజ ప్రకటించారు.
“ఈ వారం సినిమాలు చూశారా? వచ్చే వారం తెలుగు సినిమా లేదు అనుకుంటున్నారా!! ఈ సెప్టెంబర్ 15వ తేదీన చాంగురే బంగారురాజాతో మన బాయ్స్ వచ్చేస్తున్నారు” అని రవితేజ ట్వీట్ చేశారు. తన ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు రవితేజ. రేపు (సెప్టెంబర్ 10) జరిగే చాంగురే బంగారురాజా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు రవితేజ హాజరుకానున్నారు.
చాంగురే బంగారురాజా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 10) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍లోని హోటల్ తాజ్ డక్కన్‍లో జరగనుంది. ఈ ఈవెంట్‍లోనే ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేయనుంది. గతంలో రిలీజ్ అయిన చాంగురే బంగారురాజా టీజర్ ఆకట్టుకుంది. డిఫరెంట్ స్క్రీన్‍ప్లేతో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
చాంగురే బంగారురాజా చిత్రంలో కార్తీక్ రత్నం హీరోగా కాగా.. గోల్జీ నిస్సీ హీరోయిన్‍గా నటించింది. సత్య, రవిబాబు, ఎస్తేర్ నోరా, నిత్యశ్రీ, అజయ్ కీలకపాత్రలు పోషించారు. గతంలో వచ్చిన టీజర్లో కుక్కకు సునీల్ వాయిస్ ఓవర్ చెప్పారు.
ప్రభాస్ ‘సలార్: సీజ్‍ఫైర్’ చిత్రం వాయిదా పడటంతో స్కంద చిత్రం విడుదలను సెప్టెంబర్ 28వ తేదీకి మార్చింది చిత్ర యూనిట్. దీంతో సెప్టెంబర్ 15న స్ట్రైట్ తెలుగు మూవీగా చాంగురే బంగారురాజా ఒక్కటే వస్తోంది. తమిళ డబ్బింగ్ చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ అదే రోజు తెలుగులోనూ రిలీజ్ కానుంది.