Chandramukhi 2 New Trailer: కంగన, లారెన్స్ మధ్య కత్తి ఫైట్.. ఆసక్తికరంగా చంద్రముఖి 2 నయా ట్రైలర్: చూసేయండి-chandramukhi 2 new trailer sword fight between kangana ranaut and raghava lawrence ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 New Trailer: కంగన, లారెన్స్ మధ్య కత్తి ఫైట్.. ఆసక్తికరంగా చంద్రముఖి 2 నయా ట్రైలర్: చూసేయండి

Chandramukhi 2 New Trailer: కంగన, లారెన్స్ మధ్య కత్తి ఫైట్.. ఆసక్తికరంగా చంద్రముఖి 2 నయా ట్రైలర్: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2023 06:25 PM IST

Chandramukhi 2 New Trailer: చంద్రముఖి 2 సినిమా కొత్త ట్రైలర్ వచ్చేసింది. దీంట్లో చంద్రముఖి పాత్రను ఎక్కువగా రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ నయా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

Chandramukhi 2 New Trailer: కంగన, లారెన్స్ మధ్య కత్తి ఫైట్.. ఆసక్తికరంగా చంద్రముఖి 2 నయా ట్రైలర్
Chandramukhi 2 New Trailer: కంగన, లారెన్స్ మధ్య కత్తి ఫైట్.. ఆసక్తికరంగా చంద్రముఖి 2 నయా ట్రైలర్

Chandramukhi 2 New Trailer: చంద్రముఖి 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చంద్రముఖిగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ నటించగా.. వెటయరాజ పాత్రను పోషించారు రాఘవ లారెన్స్. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో అంటే సెప్టెంబర్ 28వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. తెలుగులోనూ గట్టిగానే ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో చంద్రముఖి 2 కొత్త ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు రిలీజ్ చేసింది. చంద్రముఖి గురించి ఈ ట్రైలర్‌లో ఎక్కువగా ఉంది. ట్రైలర్ ఎలా ఉందంటే..

రజినీకాంత్, జ్యోతిక నటించిన చంద్రముఖి చిత్రాన్ని గుర్తు చేస్తూ.. ఈ చంద్రముఖి 2 కొత్త ట్రైలర్ మొదలైంది. అప్పుడు జ్యోతికలో చంద్రముఖి ఆవహిస్తే.. ఇప్పుడు స్వయంగా చంద్రముఖే వచ్చిందనేలా ట్రైలర్‌లో ఉంది. రాధికా శరత్ కుమార్ కుటుంబం ఓ బంగ్లాలో దిగగా.. అందులో చంద్రముఖి ఉంటుంది. వడివేలు భయపడుతూ.. రాఘవ లారెన్స్ ను ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ భవనంలో చంద్రముఖి సమస్యను పరిష్కరించే బాధ్యతను లారెన్స్ చేపడతారు. ఫ్లాష్‍బ్యాక్‍లో లారెన్స్ వేటయరాజగా ఉంటారు. ఆ సమయంలోనే చంద్రముఖి, వేటయరాజ మధ్య వైరం ఉందనేలా ట్రైలర్‌లో కనిపిస్తోంది. కంగన (చంద్రముఖి), వేటయరాజ (లారెన్స్) మధ్య కత్తి ఫైట్ కూడా ఉంది. 

ఇటీవల చంద్రముఖి 2 నుంచి ఓ ట్రైలర్ రాగా.. అందులో చంద్రముఖి క్యారెక్టర్‌ను పెద్దగా చూపించలేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్‌లో చంద్రముఖి పాత్రను రివీల్ చేసింది చిత్ర యూనిట్. 18ఏళ్ల క్రితం చంద్రముఖి చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసునే.. దానికి సీక్వెల్ అయిన ఈ చంద్రముఖి 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి.. ఈ సినిమాకు సంగీతం అందించారు.

చంద్రముఖి 2 సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తెలుగులో శ్రీలక్ష్మీ మూవీస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 2005లో బంపర్ హిట్ అయిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు చంద్రముఖి 2 వస్తోంది.

చంద్రముఖి 2 సినిమాలో వడివేలు, రాధికా శరత్ కమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఆర్‌డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చేయగా.. ఆంటోనీ ఎడిటింగ్ చేశారు.

IPL_Entry_Point