Music Shop Murthy OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన చాందినీ చౌదరి మూవీ.. ఎక్కడ చూడాలంటే?-chandini chowdarys music shop murthy on ott etv win streaming the movie now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Music Shop Murthy Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన చాందినీ చౌదరి మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Music Shop Murthy OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన చాందినీ చౌదరి మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

Music Shop Murthy OTT Streaming: తెలుగు నటి చాందినీ చౌదరి నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం (జులై 16) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన చాందినీ చౌదరి మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Music Shop Murthy OTT Streaming: లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. చాందినీ చౌదరి నటించిన ఈ లో బడ్జెట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో సినిమా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రావడం విశేషం.

మ్యూజిక్ షాప్ మూర్తి ఓటీటీ స్ట్రీమింగ్

మ్యూజిక్ షాప్ మూర్తి డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నాలుగు రోజుల కిందట ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు తమ ప్లాట్‌ఫామ్ పై మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టింది.

"మ్యూజిక్ కి మోత మోగిపోద్ది.. పేరు గుర్తుందిగా.. మూర్తి.. మ్యూజిక్ షాప్ మూర్తి ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. అంతేకాదు మరో పోస్టులో ఈ సినిమా నుంచి ఓ ఫన్నీ క్లిప్ కూడా షేర్ చేసింది. థియేటర్లలో ఫర్వాలేదనిపించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి.

మ్యూజిక్ షాప్ మూర్తి ఎలా ఉందంటే?

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ‌గా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లోనే తెర‌కెక్కుతుంటాయ‌ని, తెలుగులో రావ‌ని చెబుతుంటారు. అలాంటి వారికి ఓ స‌మాధానంగా మ్యూజిక్ షాప్ మూర్తి నిలుస్తుంది. మ్యూజిక్ షాప్ మూర్తి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్రం కాదు. క‌థ పాత‌దే అయినా ట్రీట్‌మెంట్ మాత్రం కొత్త‌గా ఉంటుంది.

అనామ‌క హీరో.. పెద్ద ల‌క్ష్యం కోసం కోసం పాటుప‌డ‌టం, ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని చివ‌ర‌కు విజ‌యాన్ని అందుకోవ‌డం అనే పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అలాంటి రొటీన్ క‌థ‌తోనే సాగుతుంది. క‌థ పాత‌దే కానీ క‌థ‌నంలో ద‌ర్శ‌కుడు మ్యాజిక్ చేశాడు.

యాభై రెండే ఏళ్లు (సినిమాలో చూపించారు) పై బ‌డిన అజ‌య్ ఘోష్‌ను హీరోగా చూపించాల‌నే ద‌ర్శ‌కుడి ఐడియానే కొత్త‌గా ఉంది. మ్యూజిక్ షాప్ బ్యాక్‌డ్రాప్‌.. కాసెట్ల జ‌మానాతో నుంచి డీజే వ‌ర‌కు అల‌నాటి నుంచి నేటి త‌రం వ‌ర‌కు అంద‌రికి క‌నెక్ట్ అయ్యేలా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ ఎమోష‌న్స్‌తో సినిమాను న‌డిపించాడు.

యాభై ఏళ్ల వ‌య‌సులో డీజే కావాల‌ని త‌పించే వ్య‌క్తి పాత్ర‌లో అజ‌య్ ఘోష్ జీవించాడు. మూర్తి త‌ప్ప అజ‌య్ ఘోష్ ఎక్క‌డ క‌నిపించ‌లేదు. చాంద‌ని చౌద‌రి మ‌రోసారి యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో మెరిసింది. ఈ సినిమాలో వింటేజ్ ఆమ‌ని గుర్తొచ్చింది. శుభ‌ల‌గ్నం లాంటి క్యారెక్ట‌ర్‌లో మెప్పించింది. భానుచంద‌ర్‌తో పాటు మిగిలిన వారంతా త‌మ అనుభ‌వంతో మెప్పించారు.

మ్యూజిక్ షాప్ మూర్తి అశ్లీల‌త‌, అస‌భ్య‌త‌కు తావు లేని క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అజ‌య్ ఘోష్‌, చాంద‌ని చౌద‌రి న‌ట‌న‌తో పాటు క‌థ‌లోని సందేశం మెప్పిస్తుంది.