ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకుపోతోంది పౌరాణిక యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహా. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కిన సినిమా ఇది.
క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ ఇండియన్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలైంది మహావతార్ నరసింహా సినిమా.
అయితే, థియేట్రికల్ రిలీజ్ అయినప్పటి నుంచి కేవలం మౌత్ టాక్‌తోనే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది మహావతార్ నరసింహా మూవీ. ఈ సినిమాను సౌత్, నార్త్ ఆడియెన్స్ చూస్తూ తెగ ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా మహావతార్ నరసింహా సినిమాను ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు వీక్షించి రివ్యూ ఇచ్చారు.
నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి చాగంటి కోటేశ్వరరావు మహావతార్ నరసింహా సినిమాను థియేటర్‌లో చూశారు. అనంతరం మహావతార్ నరసింహా మూవీపై తన అభిప్రాయం చెప్పారు. ఈ వీడియోను గీత ఆర్ట్స్ బ్యానర్ అకౌంట్ నుంచి ట్విటర్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పురాణాలకు చాలా దగ్గరిగా మహావతార్ నరసింహా సినిమా ఉందని చాగంటి తెలిపారు. "భక్త ప్రహ్లాద వంటి చిత్రం ప్రజల మదిలో ఇప్పటికీ గుర్తుండిపోయింది. మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమాను తీసినప్పటికీ నిజంగా నరసింహా అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది" అని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.
ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉందని, కుటుంబ సమేతంగా మహావతార్ నరసింహా సినిమాను చూడొచ్చు అని చాగంటి కోటేశ్వరరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాగంటితోపాటు శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి సైతం మహావతార్ నరసింహ మూవీని చూశారు. ఆయన కూడా సినిమాపై రివ్యూ ఇచ్చారు.
చాగంటి కోటేశ్వరరావు, వరప్రసాద్ రెడ్డి ఇద్దరు మహావతార్ నరసింహా సినిమాపై తెలిపిన అభిప్రాయం గల వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఊహించని రీతిలో కలెక్షన్స్ కొల్లగొడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది మహావతార్ నరసింహా మూవీ.
ఇప్పటి వరకు రూ. 230 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది మహావతార్ నరసింహ మూవీ. ఇతర స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికీ కూడా మహావతార్ నరసింహా మూవీ ప్రజల ఆదరణ పొందుతు కలెక్షన్లతో దుమ్ముదులుపోతోంది. కాగా, మహావతార్ నరసింహా మూవీని కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
సంబంధిత కథనం