Chaari 111 OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వెన్నెల‌కిషోర్ స్పై కామెడీ మూవీ - చారి 111 స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?-chaari 111 ott release date vennela kishore spy comedy movie arriving on amazon prime ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chaari 111 Ott Release Date Vennela Kishore Spy Comedy Movie Arriving On Amazon Prime Ott From This Date

Chaari 111 OTT: ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వెన్నెల‌కిషోర్ స్పై కామెడీ మూవీ - చారి 111 స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Nelki Naresh Kumar HT Telugu
Mar 13, 2024 11:22 AM IST

Chaari 111 OTT: వెన్నెల‌కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చారి 111 మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ స్పై కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తోంది.

చారి 111 ఓటీటీ రిలీజ్ డేట్
చారి 111 ఓటీటీ రిలీజ్ డేట్

Chaari 111 OTT: టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ వెన్నెల‌కిషోర్ చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్న‌ది. మార్చి 16 నుంచి ఓటీటీలో చారి 111 మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహాలో కూడా చారి 111 మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

జానీ ఇంగ్లీష్ స్ఫూర్తితో...

మిస్ట‌ర్ బీన్ హీరోగా న‌టించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తి తో చారి 111 తెర‌కెక్కింది. ఈ స్పై కామెడీ మూవీకి టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంయుక్త విశ్వ‌నాథ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ముర‌ళీశ‌ర్మ, స‌త్య, తాగుబోతు ర‌మేష్‌ కీల‌క పాత్ర పోషించారు.

చారి 111 క‌థ ఇదే...

రా, ఎన్ఐఏ ల‌కు ధీటుగా రుద్ర‌నేత్ర పేరుతో స్పెష‌ల్ ఎజెన్సీను ఏర్పాటుచేస్తాడు ముఖ్య‌మంత్రి (శుభ‌లేఖ సుధాక‌ర్‌) . రుద్ర‌నేత్ర‌కు ప్ర‌సాద్‌రావు (ముర‌ళీశ‌ర్మ‌)హెడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. హైద‌రాబాద్‌లోని ఓ మాల్‌లో బాంబ్‌బ్లాస్ట్ జ‌రుగుతుంది. సూసైడ్ బాంబ‌ర్ కేసును రుద్ర‌నేత్ర‌కు చెందిన ఏజెంట్ చారి (వెన్నెల‌కిషోర్‌) చేప‌డ‌తాడు.

కెమిక‌ల్ క్యాప్సుల్ వేసుకున్న వారు సూసైడ్ బాంబర్స్‌గా మారుతున్నార‌ని చారి ఇన్వేస్టిగేష‌న్‌లో తేలుతుంది. కెమిక‌ల్ క్యాప్సుల్ త‌యారు చేస్తోన్న రావ‌ణ్ ఎవ‌రు? రావ‌ణ్‌కు ఆర్మీలో ప్ర‌సాద‌రావుకు ప‌రిచ‌య‌మైన మ‌హికి ఉన్న సంబంధం ఏమిటి? చారితో పాటు మ‌రో ఏజెంట్ ఈషా (సంయుక్త విశ్వ‌నాథ‌న్‌) రావ‌ణ్‌ను ప‌ట్టుకున్నారా? సీరియ‌స్ కేసు సాల్వ్ చేసే క్ర‌మంలో చారి ఎలాంటి హంగామా సృష్టించాడు? అన్న‌దే చారి 111 మూవీ క‌థ‌.

కామెడీ బాగున్నా...

చారి 111లో వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంద‌నే కామెంట్స్ వినిపించాయి. కానీ దేశ‌భ‌ద్ర‌త లాంటి సీరియ‌స్ టాపిక్‌ను కామెడీతో క‌న్వీన్సింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. కామెడీ డోస్ త‌గ్గింది. దాంతో చారి 111 ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

డైరెక్ట్‌గా ఓటీటీలోనే...

తొలుత చారి 111 మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. చారి 111 మూవీకి సీక్వెల్ రాబోతున్న‌ట్లు స‌మాచారం. రుద్ర‌నేత్ర ఏజెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో మ‌రిన్ని సినిమాలు తెరకెక్కించనున్నట్లు చారి 111 ప్ర‌మోష‌న్స్‌లో డైరెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.

శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్…

చారి 111 త‌ర్వాత శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో మ‌రో సినిమా చేస్తున్నాడు వెన్నెల‌కిషోర్‌. అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. డిటెక్టివ్ బ్యాక్‌డ్రాప్‌లో కంప్లీట్ శ్రీకాకుళం యాస‌లో శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ స్టార్‌తో పాటు ప‌లు భారీ బ‌డ్జెట్ మూవీస్‌లో వెన్నెల‌కిషోర్ కమెడియన్ గా న‌టిస్తున్నాడు. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ 2 మూవీతో వెన్నెల‌కిషోర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

WhatsApp channel

టాపిక్