Ban on OTTs: ఇక ఈ 18 ఓటీటీలు కనిపించవు.. అలాంటి కంటెంట్ చూపించినందుకు నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం-central government bans 18 otts for showing vulgar content ban on otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ban On Otts: ఇక ఈ 18 ఓటీటీలు కనిపించవు.. అలాంటి కంటెంట్ చూపించినందుకు నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

Ban on OTTs: ఇక ఈ 18 ఓటీటీలు కనిపించవు.. అలాంటి కంటెంట్ చూపించినందుకు నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

Hari Prasad S HT Telugu
Mar 14, 2024 04:16 PM IST

Ban on OTTs: అశ్లీలమైన, పోర్నోగ్రఫిక్ కంటెంట్ చూపిస్తున్నాయన్న కారణంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ 18 ఓటీటీలపై నిషేధం విధించింది. ఆ ఓటీటీల పూర్తి జాబితా ఇక్కడ చూడండి.

ఇక ఈ 18 ఓటీటీలు కనిపించవు.. అలాంటి కంటెంట్ చూపించినందుకు నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
ఇక ఈ 18 ఓటీటీలు కనిపించవు.. అలాంటి కంటెంట్ చూపించినందుకు నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

Ban on OTTs: ఓటీటీలు వచ్చిన తర్వాత సెన్సార్‌షిప్ కరువై అశ్లీలమైన కంటెంట్ నట్టింట్లోకి వచ్చేసింది. అయితే మొత్తంగా అలాంటి అశ్లీలమైన కంటెంట్ తోనే నడుస్తున్న ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏకంగా 18 ఓటీటీలపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ ఓటీటీలతోపాటు వాటికి సంబంధించిన 19 వెబ్ సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కూడా నిషేధించింది.

ఆ 18 ఓటీటీలు ఇవే

అశ్లీల కంటెంట్ ఉన్న ఓటీటీలపై నిషేధం విధిస్తున్న విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం (మార్చి 14) వెల్లడించారు. ఇలా 18 ఓటీటీలపై నిషేధం విధించగా ఇందులో ఒక ఓటీటీకి ఇప్పటికే కోటికిపైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో రెండు ఓటీటీలు 50 లక్షలకుపైగా డౌన్ లోడ్స్ తో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇక ఈ ఓటీటీల సోషల్ మీడియా హ్యాండిల్స్ కు మొత్తంగా 32 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ 18 ఓటీటీలూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అశ్లీల ట్రైలర్లు, సీన్ల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు సమాచార శాఖ వెల్లడించింది.

ప్రభుత్వం నిషేధించిన యాప్స్ లో.. డ్రీమ్ ఫిల్మ్స్, వూవి, ఎస్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుజి, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే ఓటీటీలు ఉన్నాయి.

సమాచార శాఖ ప్రకటన ఇదే..

ఓటీటీలు, యాప్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం విధించిన తర్వాత సమాచార శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. వీటిలోని కంటెంట్ చాలా వరకూ అశ్లీలమైనదే అని ఈ సందర్భంగా వెల్లడించింది.

"ఈ ప్లాట్‌ఫామ్స్ పై ఉన్న కంటెంట్ లో చాలా వరకూ అశ్లీలమైనదే. మహిళలను కించపరిచే విధంగా ఇవి ఉన్నాయి. ఈ కంటెంట్ లైంగిక చర్యలను చాలా తప్పుడు విధానంలో చూపించాయి. టీచర్లు, స్టూడెంట్స్ మధ్య లైంగిక సంబంధాలు, కుటుంబాల్లో అక్రమ సంబంధాలు వంటివి ఇందులో ఉన్నట్లు గుర్తించాం. అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నాం" అని సమాచార శాఖ తెలిపింది.