Prabhas Anushka: హీరో, హీరోయిన్స్‌లో ఇతర సెలబ్రిటీలకు నచ్చని విషయాలు.. అనుష్క, ప్రభాస్‌లో ఏమున్నాయబ్బా?
Celebrities Dislike Things In Prabhas And Anushka Shetty: హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ వంటి స్టార్ సెలబ్రిటీల్లో కూడా ఇతర సెలబ్రిటీలకు నచ్చని పలు విషయాలు ఉన్నాయి. అందులో అనుష్క, ప్రభాస్ చేసే కొన్ని పనులు ఇష్టపడని వారున్నారు. మరి అవేంటీ, సెలబ్రిటీల్లో ఇతరులకు నచ్చని విషయాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Dislike Things In Prabhas Anushka Shetty And Other Celebrities: ప్రతి మనిషిలో కొన్ని నచ్చే విషయాలు ఉన్నట్లే నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అలాంటివి సాధారణ మనుషుల్లోనే కాకుండా పాపులర్, స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్స్‌లో కూడా ఉంటాయి. ఇలా, ఇతర సెలబ్రిటీలు, హీరో హీరోయిన్స్‌లలో నచ్చిన విషయాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
అనుష్క శెట్టి
కింగ్ నాగార్జున సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క శెట్టి అరుంధతి మూవీతో జేజమ్మగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇక ప్రభాస్‌తో బిల్లా, మిర్చి, బాహుబల్ సిరీస్ సినిమాలతో అగ్ర కథానాయికగా పేరు గడించింది. ఇప్పుడు తెలుగు సినిమాలు తక్కువగా చేస్తున్న అనుష్క శెట్టి గతంలో హీరోలకు సమానమైన రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఫోన్ కాల్స్ ఎత్తదంటూ
అలాంటి అనుష్క శెట్టిలో ఇతర సెలబ్రిటీలకు నచ్చని ఓ విషయం ఉంది. అనుష్క శెట్టి ఎక్కువగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయదు అని చాలా సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అనుష్క ఫోన్ ఎక్కువగా సైలెంట్‌లో ఉంటుందని, అందుకే కాల్స్ ఎత్తదు అని చెప్పుకొచ్చారు.
ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారుండరు. సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న దాదాపుగా రూ. వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టే అంత స్టార్‌డమ్ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్ అని టాలీవుడ్ టాక్. అంతేకాకుండా, తనతో నటించే ప్రతి ఒక్క నటీనటులకు ఇంటి భోజనాన్ని ప్రేమగా వడ్డించి పెడతారు. ఇలాంటి ప్రభాస్‌లో కూడా నచ్చని ఓ విషయం ఉందని సమాచారం.
కావాలని చెబితే చాలు
అయితే, ప్రభాస్ మంచితనమే నచ్చని విషయంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తనతో నటించే యాక్టర్స్ వద్దన హోమ్ ఫుడ్ పెట్టిస్తారు ప్రభాస్. దాంతో తమ డైట్‌ను సరిగ్గా మెయింటేన్ చేయలేం చాలా మంది సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. అలాగే, ప్రభాస్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, ఏదైనా కావాలని సరాదాకి చెప్పిన ఎలాగైనా తీసుకొస్తారని అంటారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించి మరో హిట్ అందుకున్నారు.
అయితే, పక్కా స్క్రిప్ట్, గూస్‌బంప్స్ సీన్స్‌తో కథ రాసుకునే ప్రశాంత్ నీల్‌కు స్టోరీ నెరేషన్ సరిగా రాదని, స్టోరీ చెబితే సరిగా అర్థం కాదని, అదొక్కటే నచ్చని విషయం అని చాలా మంది సెలబ్రిటీలు నవ్వుతూ చెప్పారు. అయితే, ఒక దర్శకుడికి స్టోరీ నెరేషన్ చాలా ముఖ్యమని, అది చెప్పకపోడం ఏంటా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా పలు ఇంటర్వ్యూల్లోని సెలబ్రిటీల మాటలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్