Indian Idol Telugu: ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ వన్ విజేత ఎవరో తెలుసా...
ఇండియన్ ఐడల్ తెలుగు ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. పదిహేను వారాల పాటు ఉత్కంఠగా ఈ సింగింగ్ పోటీలు జరిగాయి. శుక్రవారం గ్రాండ్ ఫినాలేను నిర్వహించారు. ఇందులో ఎవరు విజేతగా నిలిచారంటే...

పదిహేను వారాల పాటు సంగీతాభిమానులను అలరించిన ఇండియన్ ఐడల్ తెలుగు ఫస్ట్ సీజన్ ముగిసింది. శుక్రవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో బీవీకే వాగ్దేవి విన్నర్ గా నిలిచింది. ఫైనల్స్ లో వాగ్దేవితో పాటు వైష్ణవి, ప్రణతి, శ్రీనివాస్, జయంత్ ల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. అందరూ అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకోవడంతో ఎవరు విజేతగా నిలుస్తారో అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.
చివరకు వాగ్గేవిని టైటిల్ వరించింది. వాగ్దేవి విన్నర్ కానున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ఆమె గెలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ ఇండియన్ ఐడల్ తెలుగు ట్రోపీని వాగ్దేవి అందుకున్నది. విజేతగా నిలిచిన ఆమెకు పది లక్షల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్స్ గా నిలిచిన శ్రీనివాస్ మూడు లక్షలు, వైష్ణవి రెండు లక్షలు సొంతం చేసుకున్నారు.
తనదైన ప్రత్యేక స్వరంతో తొలి రౌండ్ నుంచి జడ్జిలను ఆకట్టుకుంటూ వచ్చింది వాగ్దేవి. ఫైనల్‌కు చేరుకోవడానికి ముందే ఆమెకు పలు సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కినట్లు సమాచారం. కాగా గ్రాండ్ ఫినాలేలో వైష్ణవి స్వరానికి ముగ్దుడైన చిరంజీవి తన గాడ్ ఫాదర్ సినిమాలో ఆమెకు సింగర్‌గా అవకాశం ఇస్తున్నట్లు వేదికపైనే ప్రకటించారు.
ఇండియన్ ఐడల్ విజేతగా నిలవడం ఆనందంగా ఉందని వాగ్దేవి చెప్పింది. ఆహా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో ప్రసారమైన ఈ సింగింగ్ రియాలిటీ షోకు తమన్, నిత్యామీనన్, కార్తిక్ జడ్జిలుగా వ్యవహరించారు. శ్రీరామచంద్ర హోస్ట్‌గా కనిపించారు. ఈ ఫైనల్స్ కు చిరంజీవితో పాటు రానా, సాయిపల్లవి గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి, రానా మధ్య జరిగిన సంభాషణలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్