ఎప్పుడో ఐదేళ్ల కిందట వచ్చిన అల వైకుంఠపురంలో మూవీలోని సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికీ తెలుసు. అందులోని బుట్టబొమ్మ సాంగ్ అయితే మరో లెవెల్. ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన తెలుగు పాట ఇదే. ఐదేళ్లలో ఏకంగా 91 కోట్లకుపైగా వ్యూస్. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.
అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. తమన్ మ్యూజిక్ అందించగా.. రామజోగయ్య శాస్త్రి పాట రాశాడు. ఈ సాంగ్ పై అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటాయి. దీంతో ఈ వీడియో సాంగ్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు పాటగా చరిత్ర సృష్టించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోనిదే రాములో రాములా పాట కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. 73 కోట్లకుపైగా వ్యూస్ తో ఇది రెండో స్థానంలో ఉండటం విశేషం.
ఇంతకన్నా మంచి పోలికేది
నాకు తట్టలేదు గాని అమ్ము
ఈ లవ్వనేది బబుల్గమ్ము..
అంటుకున్నదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్న మాటే గాని
మళ్లీ అంటన్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
ప్రేమనాపలేవు నన్ను నమ్ము
ఎట్టగా అనే ఎదురు చూపుకి
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరే దేవుడా ఇదేందనేంత లోపటె
పిల్లాడ అంట దగ్గరై నన్ను చేరదీస్తివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే
మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగ
మౌనంగున్న గాని అమ్ము
లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మ దిరిగినాదే మైండ్ సిమ్ము
రాజుల కాలం కాదు
రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనే
యుద్ధం చేస్తాంటే..
గాజుల చేతులు జాపి
దెగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి
చక్కరవర్తిని చేసావే
చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వునడిగితే
మూటగా పూల తోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే
వేలి నిండా నన్ను తీసి
బొట్టు పెట్టుకుంటివే
కాలి కింది పువ్వు నేను
నెత్తినెట్టుకుంటివే
ఇంతకన్నా మంచి పోలికేది
నాకు తట్టలేదు గాని అమ్ము
ఈ లవ్వనేది బబుల్గమ్ము..
అంటుకున్నదంటే పోదు నమ్ము..
ముందు నుంచి అందరన్న మాటే గాని
మళ్లీ అంటన్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
ప్రేమనాపలేవు నన్ను నమ్ము
సంబంధిత కథనం