Bro vs Vinodhaya Sitham: బ్రో వర్సెస్ వినోదయ సిత్తం - తెలుగు రీమేక్‌లో చేసిన మార్పులు ఇవే - ఎవరు ఏ పాత్రలు చేశారంటే?
Bro vs Vinodhaya Sitham: పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీ జూలై 28న రిలీజ్ కానుంది. తమిళంలో విజయవంతమైన వినోదయసిత్తం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తమిళం ఒరిజినల్‌తో పోలిస్తే తెలుగు రీమేక్‌లో ఎలాంటి మార్పులు చేశారంటే...
Bro vs Vinodhaya Sitham: మరో పది రోజుల్లో థియేటర్లలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం మొదలుకానుంది. అతడు హీరోగా నటించిన బ్రో మూవీ జూలై 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఫాంటసీ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ మూవీలో మెగా యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్ మరో హీరోగా నటిస్తోన్నాడు. మెగా మామఅల్లుళ్ల కలయికలో ఫస్ట్ టైమ్ రాబోతోన్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్నాడు.
బ్రో మూవీకి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాషణలు సమకూర్చుతోన్నాడు. తమిళంలో విజయవంతమైన వినోదయ సిత్తం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. విమర్శకుల ప్రశంసల్ని అందుకొన్న ఈ సినిమాకు తమిళంలోనూ సముద్రఖని దర్శకత్వం వహించాడు.
తమిళ మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కావడంతో బ్రో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా బడ్జెట్‌తో పాటు థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్ ధరలు టాలీవుడ్‌లో రికార్డులను క్రియేట్ చేస్తోన్నాయి.
వినోదయసిత్తం, బ్రో మూవీ మధ్య ఉన్న ఛేంజేస్ ఏవంటే...
వినోదయ సిత్తం బడ్జెట్ ఐదు కోట్లు కాగా బ్రో మూవీని దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల చొప్పున రెమ్యునరేషన్ స్వీకరించాడు. అతడికే ఈ సినిమా కోసం 45 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టినట్లు సమాచారం.
వినోదయ సిత్తం లో టైమ్ పాత్రలో సముద్రఖని నటించగా...తెలుగులో టైమ్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషించాడు.
తమిళంలో కథను నడిపించే కీలక పాత్రలో కమెడియన్ తంబిరామయ్య నటించగా..ఈ పాత్రను తెలుగులో సాయిధరమ్‌తేజ్ చేశారు.
వినోదయసిత్తం పెళ్లీడుకొచ్చిన ముగ్గురు పిల్లల తండ్రి కథ చుట్టూ సాగనుంది. బ్రో మాత్రం పెళ్లికాని యువకుడి క్యారెక్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు.
వినోదయ సిత్తంలో పాటలు లేవు. కేవలం ఒకే ఒక మాంటేజ్ బిట్ సాంగ్ మాత్రమే ఉంటుంది. బ్రో సినిమాలో మూడు పాటల్ని పెట్టారు. బ్రో మూవీకి తమన్ సంగీతాన్ని అందించాడు.
వినోదయసిత్తంలో సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండదు. . కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా ఈ తమిళ మూవీ రూపొందింది. బ్రోలో మాత్రం పవన్ కళ్యాణ్‌తో పాటు సాయిధరమ్‌తేజ్‌లపై కొన్ని యాక్షన్ సీక్వెన్‌లను పెట్టినట్లు సమాచారం.
వినోదయసిత్తంలో హీరో క్యారెక్టర్‌కు ఎలాంటి లవ్ ట్రాక్‌లు, రొమాంటిక్ డ్యూయెట్‌లు ఉండవు. బ్రో మూవీలో సాయిధరమ్‌తేజ్ పాత్రకు లవ్ స్టోరీతో పాటు ఇద్దరు హీరోయిన్లను పెట్టారు.
వినోదయ సిత్తం రన్‌టైమ్ 99 నిమిషాలే కాగా బ్రో మూవీ రన్‌టైమ్ దాదాపు 135 నిమిషాల వరకు ఉండనున్నట్లు తెలిసింది. మాతృకతో పోలిస్తే పవన్ కళ్యాణ్ పోషిస్తోన్న టైమ్ క్యారెక్టర్ లెంగ్త్ పెరినట్లు సమాచారం.
తమిళంలో ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ సముద్రఖని రాయగా....తెలుగులో మాత్రం సముద్రఖని కేవలం దర్శకత్వ బాధ్యతలకే పరిమితమయ్యారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.
వినోదయసిత్తం మూవీ దాదాపు 10 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. బ్రో మూవీ థియేట్రికల్ బిజినెస్ వంద కోట్ల వరకు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.