Movies in Theaters This Week: ఈ వారం థియేటర్లలో బ్రో హంగామా - పవన్ కళ్యాణ్ మూవీతో పోటీపడుతోన్న సినిమాలు ఏవంటే?
Movies in Theaters This Week: ఈ వారం థియేటర్లలో పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రిలీజ్ కానుంది. ఈ మెగా మల్టీస్టారర్‌తో పాటు ఫ్రైడే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఏవంటే...
Movies in Theaters This Week: ఈ శుక్రవారం బ్రో మూవీతో థియేటర్లలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సందడి చేయబోతున్నాడు. మెగా మామాఅల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ కాంబోలో ఫస్ట్ టైమ్ రాబోతున్న ఈ మూవీ జూలై 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఫాంటసీ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న బ్రో మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతోనే దర్శకుడిగా అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
బ్రో మూవీకి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించాడు. చనిపోయిన ఓ యువకుడికి టైమ్ రూపంలో ఉన్న దేవుడు మళ్లీ బతికే ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన వినోదయ సిత్తం ఆధారంగా బ్రో మూవీ రూపొందింది. తమిళ మాతృకతో పోలిస్తే చాలా మార్పులు చేస్తూ తెలుగు వెర్షన్‌ను తెరకెక్కిస్తున్నారు.
బ్రో మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ బ్రో మూవీని నిర్మిస్తోన్నాడు. సోమవారం లేదా మంగళవారం నుంచి ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. భీమ్లానాయక్ సక్సెస్ తర్వాత పవన్ నటిస్తోన్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ డే పవన్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్‌ను బ్రో మూవీ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
పవన్‌తో ధోనీ పోటీ...
బ్రో మూవీతో పాటు ఈ ఫ్రైడే టీమ్ ఇండియా లెజెండరీ క్రికెటర్ ధోనీ (Dhoni) తొలిసారి నిర్మించిన ఎల్‌జీఎమ్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ తమిళ డబ్బింగ్ మూవీలో హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీకి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించాడు. తెలుగులో జీరో ప్రమోషన్స్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. పవన్ ప్రభంజనాన్ని తట్టుకొని ధోనీ మూవీ ఏ మేరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నిలబడగలుగుతుందన్నది ఈ శుక్రవారం తేలనుంది.
స్లమ్ డాగ్ హజ్బెండ్
జూలై 29న శనివారం బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావ్ హీరోగా నటిస్తోన్న స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి పూరి జగన్నాథ్ శిష్యుడు ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటిస్తోంది.