Bro Movie Tickets: గుడ్‌న్యూస్.. బ్రో మూవీ టికెట్ల ధరలు పెరగడం లేదు
Bro Movie Tickets: గుడ్‌న్యూస్.. బ్రో మూవీ టికెట్ల ధరలు పెరగడం లేదు. ఈ విషయాన్ని సినిమా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాదే బుధవారం (జులై 19) మీడియాకు వెల్లడించాడు.
Bro Movie Tickets: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో మూవీపై విపరీతమైన హైప్ నెలకొంది. ఈ మెగా మామా అల్లుళ్లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమా జులై 28న రిలీజ్ కానుండగా.. ఫ్యాన్స్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో బ్రో మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.
బ్రో మూవీ టికెట్ల ధర పెంచడం లేదని స్పష్టం చేశాడు. బుధవారం (జులై 19) మీడియాతో మాట్లాడిన అతడు.. సినిమాను పరిమిత బడ్జెట్ లోనే తీసినట్లు తెలిపాడు. అందుకే ఈ సినిమా టికెట్ల ధరను పెంచకూడదని నిర్ణయించినట్లు చెప్పాడు. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైనా టికెట్ల ధరను భారీగా పెంచేస్తున్నారు.
కనీసం తొలి వారం రోజుల పాటు పెరిగిన టికెట్ల ధరలు అమల్లో ఉంటున్నాయి. బ్రో మూవీ మేకర్స్ మాత్రం అలా చేయొద్దని నిర్ణయించడం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సినిమాకు ఎలాంటి అదనపు షోలు కూడా ఉండబోవని కూడా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తెలిపాడు. మరోవైపు బ్రో మూవీ ట్రైలర్ జులై 21న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. తమిళంలో వచ్చిన వినోదాయ సిద్ధం మూవీకి ఈ బ్రో తెలుగు రీమేక్. తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనే తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించాడు. అయితే అసలు స్టోరీలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అర్ధాంతరంగా కన్నుమూసిన ఓ వ్యక్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందనే కథాంశంతో బ్రో మూవీ తెరకెక్కుతోంది. ఇందులో టైమ్ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. మార్కాండేయులు అలియాస్ మార్క్ అనే క్యారెక్టర్‌లో సాయిధరమ్‌తేజ్ కనిపించబోతున్నాడు. ఈ మామ అల్లుళ్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.
సంబంధిత కథనం