Breakup Kahani OTT: ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఆంథాలజీ బ్రేకప్ కహానీ.. విడిపోవడానికి ఎన్ని కథలు చెబుతారో?-breakup kahani ott release date sun nxt ott to stream this anthology from wednesday 5th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Breakup Kahani Ott: ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఆంథాలజీ బ్రేకప్ కహానీ.. విడిపోవడానికి ఎన్ని కథలు చెబుతారో?

Breakup Kahani OTT: ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఆంథాలజీ బ్రేకప్ కహానీ.. విడిపోవడానికి ఎన్ని కథలు చెబుతారో?

Hari Prasad S HT Telugu
Feb 04, 2025 05:47 PM IST

Breakup Kahani OTT: బ్రేకప్ కహానీ అనే ఓ ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ కాలం జంటలు బ్రేకప్ చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కూడా ఎలా కారణమవుతున్నాయో కళ్లకు కట్టే ఓ డిఫరెంట్ కథల సమాహారం ఇది.

ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఆంథాలజీ బ్రేకప్ కహానీ.. విడిపోవడానికి ఎన్ని కథలు చెబుతారో?
ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఆంథాలజీ బ్రేకప్ కహానీ.. విడిపోవడానికి ఎన్ని కథలు చెబుతారో?

Breakup Kahani OTT: ఓటీటీలోకి యూత్ ను అలరించే మరో ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ రాబోతోంది. ఈ సరికొత్త ఆంథాలజీ సిరీస్ ను సన్ నెక్ట్స్ లో చూడొచ్చు. ఈ విషయాన్ని మంగళవారం (ఫిబ్రవరి 4) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ ఆంథాలజీ పేరు బ్రేకప్ కహానీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఓ టీజర్ ను కూడా సన్ నెక్ట్స్ రిలీజ్ చేసింది.

yearly horoscope entry point

బ్రేకప్ కహానీ ఓటీటీ రిలీజ్ డేట్

బ్రేకప్ కహానీ ఓ ఆంథాలజీ. అంటే కొన్ని వేర్వేరు కథల సమాహారం. జీవితాంతం కలిసి ఉండాల్సిన రిలేషన్షిప్ ను ఈకాలం జంటలు మధ్యలోనే ఎలా బ్రేకప్ చెప్పేస్తున్నారో, అలా బ్రేకప్ చెప్పడానికి చిన్న చిన్న విషయాలు కూడా ఎలా కారణమవుతున్నాయో ఈ ఆంథాలజీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకప్ కహానీ బుధవారం (ఫిబ్రవరి 5) నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

"రొమాన్స్, రిలేషన్షిప్స్ తమదైన దారిలో వెళ్లే కథలను చూడండి. ఆసక్తికర కథల సమాహారం బ్రేకప్ కహానీ సన్ నెక్ట్స్ లో రేపటి నుంచి చూడండి" అనే క్యాప్షన్ తో మంగళవారం (ఫిబ్రవరి 4) సన్ నెక్ట్స్ తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేసింది. లవ్, డ్రామాతో కూడిన ఆంథాలజీ ఇది అని ఒక రోజు ముందు ట్వీట్ చేసిన ఆ ఓటీటీ.. ఇవాళ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.

బ్రేకప్ కహానీ టీజర్ ఎలా ఉందంటే?

బ్రేకప్ కహానీ ఆంథాలజీ సిరీస్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ టీజర్ ను సన్ నెక్ట్స్ రిలీజ్ చేసింది. సుమారు నిమిషం ఉన్న ఈ టీజర్లో పలు జంటలు వివిధ కారణాలతో బ్రేకప్ చెప్పుకోవడం చూడొచ్చు.

మనం కలిసి ఉండటం కష్టం.. అది జరగడం జరగని పని.. లెట్స్ బ్రేకప్.. విడిపోదాం అంటూ ఆ జంటలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అసలు ఈ ఆంథాలజీ ఏంటి? వాళ్లు బ్రేకప్ చెప్పుకోడానికి కారణమేంటన్నది ఈ బ్రేకప్ కహానీలో చూడొచ్చు. సన్ నెక్ట్స్ ఓటీటీలో బుధవారం నుంచి ఈ సరికొత్త ఆంథాలజీ స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం