Brahmastra Box-Office collection Day 2: బ్రహ్మాస్త్రకు బ్రహ్మాండమైన కలెక్షన్స్-brahmastra box office collection day 2 ranbir alia starrer film earns 37 cr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmastra Box-office Collection Day 2 Ranbir-alia Starrer Film Earns 37 Cr

Brahmastra Box-Office collection Day 2: బ్రహ్మాస్త్రకు బ్రహ్మాండమైన కలెక్షన్స్

HT Telugu Desk HT Telugu
Sep 11, 2022 02:16 PM IST

Brahmastra Box-Office collection Day 2: బ్రహ్మాస్త్ర భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

భారీ కలెక్షన్ల దిశగా బ్రహ్మాస్త్ర
భారీ కలెక్షన్ల దిశగా బ్రహ్మాస్త్ర (Amit Sharma)

Brahmastra Box-Office collection Day 2: రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర మూవీ 2 వ రోజున బాక్సాఫీస్ వద్ద రూ. 37 కోట్ల కలెక్షన్లు సాధించింది. కాగా బాక్సాఫీస్ గణాంకాల్లో తేడాలు ఉన్నాయని కొందరు వ్యాఖ్యానించారు.

ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ.75 కోట్లు వసూలు చేసింది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ నటించిన భారీ బడ్జెట్ ఫాంటసీ అడ్వెంచర్ ఎపిక్ మొదటి భాగం శుక్రవారం విడుదలైంది.

400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందించిన "బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ" భారతదేశంలో నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి.

ఈ చిత్రంపై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. ఇది హిందూ పురాణాలను ఫాంటసీ అంశాలతో మిళితం చేసింది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హాలివుడ్ సినిమాల తరహాలో ఆకట్టుకుంటున్నాయి.

బాక్సాఫీస్ కలెక్షన్లు వెలుగులోకి వచ్చాక చిత్ర దర్శకుడు ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని షేర్ చేశారు. ‘కృతజ్ఞతలు.. వినయం.. కృతజ్ఞతతో.. ఇంకా నా ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను! ధన్యవాదాలు..’ అని నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.

‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ప్రదర్శితమవుతోంది. చిత్రంలో మౌని రాయ్, నాగార్జున అక్కినేని కూడా నటించారు.

IPL_Entry_Point