Brahmastra Advance Bookings: అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే బ్రహ్మాస్త్ర రికార్డులు-brahmastra advance bookings cross 23 crores till wednesday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmastra Advance Bookings Cross 23 Crores Till Wednesday

Brahmastra Advance Bookings: అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే బ్రహ్మాస్త్ర రికార్డులు

Hari Prasad S HT Telugu
Sep 08, 2022 03:15 PM IST

Brahmastra Advance Bookings: అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే బ్రహ్మాస్త్ర రికార్డులు సృష్టిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ నటించిన ఈ మూవీ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత శుక్రవారం (సెప్టెంబర్‌ 9) ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌
బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌

Brahmastra Advance Bookings: బాలీవుడ్‌లో సినిమాల వరుస వైఫల్యాలు, బాయ్‌కాట్‌ పిలుపుల మధ్య ఎన్నో అంచనాలతో రిలీజ్‌ కాబోతోంది బ్రహ్మాస్త్ర మూవీ. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో రణ్‌బీర్‌, ఆలియా జంటగా వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌ భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి ఈ మూవీ కొత్త ఊపిరి ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1 శివగా వస్తున్న ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్‌ 9) రిలీజ్‌ కానుండగా.. ఇప్పటి వరకైతే అంచనాలను అందుకుంటోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఈ మూవీ దూసుకెళ్తోంది. బుధవారం (సెప్టెంబర్‌ 7) రాత్రి వరకూ చూస్తే మొత్తంగా రూ.23 కోట్ల మేర అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరగడం విశేషం. ఇందులో బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన తొలి రోజే సగం జరిగాయి.

గురువారం (సెప్టెంబర్‌ 8) కూడా అడ్వాన్స్‌ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. అయితే బుధవారానికే ఈ మూవీ కరోనా మహమ్మారి తర్వాత అత్యధిక అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పొందిన హిందీ మూవీగా రికార్డు సృష్టించింది. బ్రహ్మాస్త్ర ఐదు భాషల్లో రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. అన్నీ కలిపి తొలి రోజే రూ.11 కోట్ల మేర అడ్వాన్స్‌ బుకింగ్స్ జరిగాయి. ఇందులో ఒక్క హిందీ వెర్షన్‌లోనే రూ.10 కోట్లు వసూలు చేసింది.

ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ రూ.7 కోట్ల రికార్డును కూడా బ్రహ్మాస్త్ర బ్రేక్ చేసింది. అయితే హిందీలో కేజీఎఫ్‌ 2 సాధించిన రూ.40 కోట్ల (మొత్తం రూ.80 కోట్లు) అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డుకు చాలా దూరంలోనే నిలిచిపోయింది. తొలి వీకెండ్‌ కోసం బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూ.22.25 కోట్లు కాగా.. తెలుగులో రూ.98 లక్షలు, తమిళంలో రూ.11.1 లక్షల మేర బుకింగ్స్‌ జరిగాయి.

ఆ లెక్కన చూస్తే బ్రహ్మాస్త్రకు భారీ ఓపెనింగ్స్‌ రావడం ఖాయం. కరోనా మహహ్మారి తర్వాత వచ్చిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్‌ పొందిన సినిమాగా బ్రహ్మాస్త్ర నిలవబోతోంది. మొత్తంగా మూడు భాగాలుగా ఈ మూవీ వస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్‌ వన్‌ : శివ మూవీలో రణ్‌బీర్‌, ఆలియాలతోపాటు అమితాబ్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ నటించారు. రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.

IPL_Entry_Point