Brahma anandam Glimpse: కొడుకుతో బ్రహ్మానందం కామెడీ మూవీ -బ్రహ్మా ఆనందం గ్లింప్స్ రిలీజ్
Brahma anandam Glimpse: టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న బ్రహ్మా ఆనందం గ్లింప్స్ సోమవారం రిలీజైంది. ఈ కామెడీ మూవీలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతమనవళ్లుగా నటించబోతున్నారు.
Brahma anandam Glimpse: టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం బ్రహ్మా ఆనందం. తాతామనవళ్ల అనుబంధానికి కామెడీ, ఎమోషన్స్ జోడించి తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో వెన్నెలకిషోర్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోండగా....ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోల్లక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గ్లింప్స్ రిలీజ్...
రక్షా బంధన్‌ను పురస్కరించుకొని బ్రహ్మా ఆనందం గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంచ్, ఫన్ డైలాగ్స్‌తో ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. లాస్ట్ ఈయర్ నాకు రాఖీ కట్టి గిఫ్ట్ అడిగితే ఏమిచ్చాను అని ఓ అమ్మాయిని రాజా గౌతమ్ అడిగాడు. రాఖీ తిరిగిచ్చావు అని ఆ అమ్మాయి సమాధానం చెప్పింది.
అది పొజిషన్ అని రాజా గౌతమ్ సమాధానం చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. డబ్బుల లేక ప్రస్టేషన్‌కు గురయ్యే యువకుడిగా రాజా గౌతమ్, తన తికమకతో అతడి ప్రస్టేషన్‌ను మరింత పెంచే స్నేహితుడిగా వెన్నెలకిషోర్ ఈ గ్లింప్స్‌లో కనిపిస్తోన్నాడు. గ్లింప్స్ చివరలో పంచెకట్టులో కళ్లాద్ధాలు పెట్టుకొని బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చినట్లుగా ఈ గ్లింప్స్‌లో చూపించారు.
తాతామనవళ్లుగా...
రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో మాత్రం తాతామనవళ్లుగా కనిపించబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.విలేజ్, ఆర్బన్ మిక్స్‌డ్ బ్యాక్‌డ్రాప్‌లో బ్రహ్మా ఆనందం మూవీ సాగనున్నట్లు సమాచారం. బ్రహ్మానందం క్యారెక్టర్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తుందని మేకర్స్ చెబుతోన్నారు.
మళ్లీరావా...మసూద...
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద, మళ్లీరావా వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా బ్రహ్మా ఆనందం సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. బ్రహ్మానందం మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభమైంది. ఈ కామెడీ డ్రామా మూవీని 2024 డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు శాండిల్య పీసపాటి మ్యూజిక్ అందిస్తోన్నారు.
స్పీడు తగ్గించిన బ్రహ్మి...
గత కొన్నాళ్లుగా సినిమాల స్పీడు తగ్గించారు బ్రహ్మానందం. బ్రో, భోళాశంకర్‌తోపాటు గత ఏడాది పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కల్కిలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. మరోవైపు
2004లో వచ్చిన పల్లకిలో పెళ్లికూతురు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజా గౌతమ్.ఆ తర్వాత వారెవా, బసంతి, మను సినిమాల్లో నటించినా విజయాల్ని మాత్రం దక్కించుకోలేకపోయాయి. ఫెయిల్యూర్స్ కారణంగా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాజా గౌతమ్.. ఇటీవల నాగచైతన్య దూత వెబ్‌సిరీస్‌లో ఓ కీలక పాత్రలో కనిపించాడు.
టాపిక్