Brahmamudi Today Episode : రాహుల్ చెంపపగలగొట్టిన రాజ్.. స్వప్నతో రాహుల్ పెళ్లి ఫిక్స్-brahmamudi today episode rahul gets caught rahul marriage fix with lover swapna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Today Episode Rahul Gets Caught Rahul Marriage Fix With Lover Swapna

Brahmamudi Today Episode : రాహుల్ చెంపపగలగొట్టిన రాజ్.. స్వప్నతో రాహుల్ పెళ్లి ఫిక్స్

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 07:17 AM IST

Brahmamudi Today Episode : నిశ్చితార్థం వేడుకలో వెన్నెలకు రాహుల్ ప్రపోజ్ చేయడంతో ఈరోజు సీరియల్ మెుదలవుతుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి సీరియల్
బ్రహ్మముడి సీరియల్

రాహుల్-వెన్నెల నిశ్చితార్థం దగ్గరకు స్వప్న వస్తుంది. ఇదే సమయంలో వెన్నెలకు రాహుల్ ప్రపోజ్ చేస్తాడు. రాహుల్ గురించి స్వప్నకు అప్పు చెబుతుంది. వాడు ఎలాంటి వాడో ఇప్పటికైనా అర్థమైందా అంటుంది. నిన్ను ఎంత మోసం చేశాడో తెలిసిందా? కావ్య అక్క ఎంత చెప్పినా నమ్మలేదు కదా అని ప్రశ్నిస్తుంది. దీంతో అక్కడ నుంచి బయటకు వెళ్లి కూర్చుంటుంది స్వప్న. కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పి.. అప్పు కూడా వెళ్తుంది. రాహుల్ చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంటుంది స్వప్న.

కావ్య అక్క, అమ్మానాన్న ఎంత చెప్పినా నమ్మలేదు, నీకు ఇలా జరగాల్సిందేనని అప్పు అంటుంది. ఓవైపు స్వప్న ఏడుస్తూ ఉంటే.. కావ్య వస్తుంది. అక్క అంటూ దగ్గరకు వచ్చేస్తుంది కావ్య. వచ్చావా.. నువ్ కూడా నన్నే అనేందుకు వచ్చావా అని స్వప్న ప్రశ్నిస్తుంది. లేదక్క ఒక నీచుడిని నమ్మి మోస పోతున్నావ్ అని మందలించానని కావ్య అంటుంది. నీ మీద నాకు ఏ కోపం లేదని చెబుతుంది. నీ చెల్లినని, నిన్ను ఎవరో మోసం చేస్తే ఊరుకోను అని అంటుంది. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే.. సుఖంగా ఉండలేవ్ అంటుంది కావ్య. అమ్మానాన్న చూసిన సంబంధం చేసుకోమని చెబుతుంది. పక్కనే ఉన్న అప్పు.. అది కూడా ఆగిపోయిందని చెబుతుంది.

షాక్ తిన్న కావ్య.. ఎందుకు అని అడుగుతుంది. దీనికి కడుపు అయిందని అప్పు చెబుతుంది. ఎందుకే తొందరపడ్డావ్ అని కావ్య అడుగుతుంది. ప్రేమించి మోసపోయావ్ అనుకున్నాను, కానీ నిన్ను నువ్ ఆర్పించుకుని ఇలా చేస్తావ్ అనుకోలేదు.. నిన్ను ఏం అనాలి? అమాయకురాలివి అనాలా? నష్ట జాతకురాలివి అనాలా? అని కావ్య అంటుంది. ఓ వైపు స్వప్న ఏడుస్తుంది. మరోవైపు బరితెగించిందని అప్పు అంటుంది. దీంతో పైకి లేచిన స్వప్న నేను చచ్చిపోతాను అంటుంది.

నీ జీవితాన్ని పాడు చేసిన రాహుల్ ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాడో అని కావ్య అంటుంది. ముగ్గురు కలిసి.. రాహుల్-వెన్నెల నిశ్చితార్థం జరిగే దగ్గరకు వెళ్తారు. ఇదే సమయంలో రాహుల్ మోకాలి మీద కూర్చొని వెన్నెలకు ప్రపోజ్ చేస్తాడు. స్వప్న, కావ్యను చూసిన రాహుల్ షాక్ అవుతాడు. దీంతో అందరూ వారివైపే చూస్తారు.

ఆగావ్ ఏంటి రాహుల్, రింగ్ తొడుగు అని కావ్య అంటుంది. రాహుల్ ఏమైంది, వాళ్లను చూసి నువ్ ఎందుకు ఆగావ్ అని రుద్రాణి చెబుతుంది. కాసేపు ఆగుతారా అని కావ్య అంటుంది. మరోవైపు అపర్ణ లేచి.. మీ అక్కను ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నిస్తుంది. ఇలాంటి వారు మా ఇంటికి రాకూడదు అంటుంది. కావ్యకు కోపం వస్తుంది.. మరి ఇలాంటి వాడు మీ ఇంట్లో ఉండొచ్చా మేడమ్ అని అపర్ణను ప్రశ్నిస్తుంది.

ఏయ్ ఏంటి ఈ పనికిమాలిన న్యూసెన్స్ అంటుంది రుద్రాణి. రాహుల్ నువ్ కానివ్వు అంటుంది. వెంటనే కావ్య.. వెన్నెలకు ఉంగరం తొడుగు రాహుల్.., కానీ ఒక కండీషన్ అంటుంది. స్వప్నను స్జేజి దగ్గరకు తీసుకొస్తుంది. మా అక్క వేలికి తొడిగిన ఉంగరం తీసి పడేసి.. అప్పుడు తొడగమని చెబుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇదంతా.. ఏం జరుగుతుందని రాజ్ ప్రశ్నిస్తాడు.

నేను ఏ తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నమని కావ్య అంటుంది. కల్యాణ మండపంలో ముసుగు వేసుకుని వచ్చి.. నిన్ను పెళ్లి చేసుకున్నాని అంతా అనుకుంటున్నారు కదా.. అది నిజం కాదని ఇప్పుడు తేలుస్తానని కావ్య అంటుంది. అదంతా జరగడానికి, మా అక్క జీవితానికి సంబంధం ఉందని చెబుతుంది. చెప్పు రాహుల్ మా అక్కకు ఈ ఉంగరం ఎప్పుడు తొడిగావో గుర్తుందా అని ప్రశ్నిస్తుంది. నేను గొప్ప ఇంటి సంబంధం చేసుకుంటున్నాని, కావాలనే నాటకం ఆడుతున్నారా అని రాహుల్ అడుగుతాడు. నాటకం.. నా ఎదురుగా జరుగుతుందని కావ్య అంటుంది.

అందరూ ఆవేశం తగ్గించుకోండని ఇంట్లో పెద్దమనిషి అంటుంది. దీంతో రుద్రాణి ఒక్కసారిగా ఫైర్ అవుతుంది. రుద్రాణి ఏం జరిగిందనేది నాకు అవసరం అని అరుంధతీ స్పష్టం చేస్తుంది. నువ్ చెప్పు కావ్య అంటుంది అరుంధతీ. చెప్పాల్సింది నేను కాదు.. మా అక్క అని కావ్య చెబుతుంది. దీంతో అసలు విషయం చెప్పడం మెుదలపెడుతుంది స్వప్న.

ఐయామ్ సారీ రాజ్ అంటుంది స్వప్న. పెళ్లి మండపం నుంచి నేను పారిపోలేదు, ఈ రాహులే లేవదీసుకుపోయాడని చెబుతుంది స్వప్న. అందరూ ఆశ్చర్యపోతారు. ఆ అమ్మయి చెప్పేది నిజమేనా అని వెన్నెల అంటుంది. అబద్ధం అంతా అబద్ధం అని రాహుల్ అంటాడు.. కావ్యకు కోపం వస్తుంది. షటప్ రాహుల్, ఇంకోసారి నా ఫ్యామిలీ గురించి మాట్లాడకు అంటుంది కావ్య.

రాహుల్ ఇటు చూడు.. నేను నిన్ను బతిమిలాడుకున్న.. ఇంట్లో నిజం చెప్పమన్న అని స్వప్న అంటుంది. తెగించి రావాల్సి వచ్చిందంటుంది. ఇప్పుడు కూడా రాకపోతే.. ఇంకో అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తావని వచ్చాను అంటుంది. నువ్ ముందే చెప్పాలి కదా, మా కుటుంబం పరువు పోతుంది కదా అని ఇంట్లో పెద్దమనిషి అంటాడు. మామయ్య గారు ఇప్పటికైనా నిజానిజాలు తెలియనివ్వండి, అవతల నా స్నేహితురాలు నన్ను నమ్మి ఈ సంబంధం చేసుకునేందుకు వచ్చిందని అపర్ణ అంటుంది.

స్వప్నను నిజం చెప్పమని అందరూ అడుగుతారు. రాహుల్ మాయ మాటలు చెప్పి.. నన్ను మోసం చేశాడని స్వప్న కుండ బద్దలు కొడుతుంది. మీ నెంబర్ అడిగితే.. తన నెంబర్ ఇచ్చాడని రాజ్ తో చెబుతుంది. కానీ రాహుల్ తన నెంబర్ ఇచ్చి.. నన్ను పడేశాడని అంటుంది స్వప్న. పీటల మీద నుంచి నన్ను తీసుకెళ్లాడని చెబుతుంది. హోటల్ లో ఉంచి, మీరు వచ్చేలోపు పారిపొమ్మని చెప్పాడని అన్ని విషయాలు చెబుతుంది స్వప్న. పెళ్లి చేసుకోమంటే వాయిదా వేస్తూ వచ్చాడని, ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని వెన్నెలను చేసుకుంటున్నాడని అంటుంది.

రాహుల్ ఒక్కసారి రియాక్ట్ అవుతాడు. మా కుటంబంలోకి కోడలికి వచ్చేందుకు ప్లాన్ వేశావా అని ప్రశ్నిస్తాడు రాహుల్. అసలు ఇంత పెద్ద నింద నా మీద వేస్తుంటే.. అందరూ చూస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఈమె చెప్పింది నిజం అని నిరూపించేందుకు ఒక్క సాక్ష్యం చూపించమని రాహుల్ ప్రశ్నిస్తాడు. చూపించగలను అని కావ్య అంటుంది. తనతో తెచ్చిన సీసీ టీవీ ఫుటేజీని తీసి చూపిస్తుంది. నువ్ ఇలా మాట్లాడుతావని తెలిసే సాక్ష్యం తీసుకుని వచ్చానని కావ్య అంటుంది.

హోటల్ లోకి స్వప్నను రాహుల్ తీసుకెళ్లి వీడియోను రాజ్ చూసి షాక్ అవుతాడు. రుద్రాణి కూడా తీసుకుని చూసి ఆశ్చర్యపోతుంది. రాహుల్ తల కిందకు దించుకుంటాడు. రాహుల్ ఇప్పుడు దొరికిందా సాక్ష్యం అంటుంది కావ్య. ఇక్కడ దాకా వచ్చాకా ఇలాంటి మోసగాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టంలేదని స్వప్నతో కావ్య చెబుతుంది. కానీ ఆ నిజం ఏంటో నువ్వే చెప్పమని అంటుంది. కానీ స్వప్న చెప్పదు. దీంతో మా అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అప్పు అందరికీ చెబుతుంది.

అన్నయ్య ఇప్పటికైనా అర్థం చేసుకో.. కావ్య వదిన తప్పు ఏం లేదు అంటాడు కల్యాణ్. వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెట్ గా పట్టించాలని చాలా ప్రయత్నం చేశామని వివరిస్తాడు. రాజ్ అన్ని విషయాలు గుర్తు చేసుకుంటాడు. వాళ్లిద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకోవడం నేను విన్నానని కల్యామ్ చెబుతుంది. ఇన్నిరోజులు కావ్యను దూరం పెట్టడానికి కారణం నాకు అర్థమైంది, కానీ ఇన్ని సాక్ష్యాలు చూసి కూడా నువ్ నమ్మడం లేదా రాజ్ అని ధాన్యలక్ష్మి ప్రశ్నిస్తుంది. రాజ్ ఆలోచనల్లో పడతాడు. నేను ఏ తప్పు చేయలేదు రాజ్, వీళ్లు ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారని రాహుల్ చెబుతాడు. దీంతో రాహుల్ చెంప మీద రాజ్ కొడతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్ లో రెండు రోజుల్లో స్వప్నకు రాహుల్ కు పెళ్లి చేస్తామని మాట ఇచ్చి వచ్చామని ఇంట్లో పెద్దవాళ్లు నిర్ణయిస్తారు. నేను ఒప్పుకోనని రుద్రాణి అంటుంది. అందరూ సమ్మతించాకనే.. వెళ్లి మాట్లాడమని అంటుంది అపర్ణ. ఒప్పుకోకపోతే చెప్పండి న్యాయ పోరాటం చేస్తానని చెబుతుంది కావ్య. మీ కొడుకును జైలుకు పంపిస్తానని అంటుంది.

IPL_Entry_Point