Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ ఆరు నెలలు కోమాలో లేడని, అదంతా యామిని ఆడిస్తున్న నాటకం అని డాక్టర్ సతీష్ కావ్య, అప్పులతో నిజం చెప్పేస్తాడు. దాంతో ఎమోషనల్ అయిన కావ్య హాస్పిటల్‌లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్లి నేను అనుకుందే జరిగింది, మా ఆయన్ను కాపాడవ్, ఇంతకుమించి ఏం వద్దని సంతోషపడుతుంది.
ఇంతలో కావ్యకు కాస్తా దూరంగా రాజ్ వస్తాడు. అది చూసి భర్త దగ్గరికి వెళ్దామనుకుని రాజ్ కండిషన్ గుర్తుకు వచ్చి ఆగిపోతుంది కావ్య. అప్పుడే అప్పు వస్తే రాజ్‌ను కావ్య చూపిస్తుంది. అప్పుడు రౌడీ బేబీ తన బావ రాజ్‌ను చూసి ఆశ్చర్యపోతుంది. పద మాట్లాడు అని కావ్యను అంటుండగా.. రాజ్ దగ్గరికి యామిని వచ్చి కౌగిలించుకుంటుంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది. దాంతో కావ్య, అప్పు షాక్ అవుతారు.
నీకు ఇష్టం లేకుండా పెళ్లి వద్దు. కావాలంటే డాడీకి నేను చెప్పుకుంటాను అని యామిని వెళ్తుంటే.. చేయి పట్టుకుని రాజ్ ఆపుతాడు. నా కండిషన్ బాగాలేదు నిజమే. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నాకోసం మీరు ఎంతో చేస్తున్నారు. నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. కూతురి కోసం తండ్రి పడే ఆ ఆవేదనలో అర్థముంది, న్యాయముంది. ఆయనకోసం కాదు నిజంగా నీ మీద ఇష్టంతోనే పెళ్లికి ఒప్పుకున్నాను అని రాజ్ చెబుతాడు.
రాజ్ ఎస్ చెప్పడంతో వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తానని సంతోషంగా వెళ్లిపోతుంది యామిని. అదంతా విన్న కావ్య, అప్పు మరింత అవాక్కవుతారు. అప్పు. తన ప్లాన్ వర్కౌట్ అయిందని, రాజ్ పెళ్లికి ఒప్పుకున్నాడని, ఇక రాజ్ తనవాడే అని, కావ్య వచ్చిన కూడా ఏం చేయలేదని సంబరపడిపోతుంది యామిని. వీలైనంత త్వరగా రాజ్‌తో పెళ్లి జరిపించాలని తల్లికి చెబుతుంది. అలాగే చేద్దామని వైధేహి అంటుంది. మరోవైపు ఇంట్లోకి కావ్య బాధగా వెళ్తుంది. ఎవరు ఏం మాట్లాడిన పట్టించుకోకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది కావ్య.
నిజం తెలిసేలా చేశావు అని సంతోషపడేలోపే వెంటనే ఆ యామినితో ఆ పెళ్లి ఏర్పాట్లు జరిపించాలా అని కావ్య ఏడుస్తూ మొరపెట్టుకుంటుంది. నువ్వే ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేశావ్ కాబట్టి, నువ్వే నాకు సొల్యూషన్ చూపించు అని దేవుడిని డిమాండ్ చేస్తుంది కావ్య. మరోవైపు యామిని తండ్రితో రాజ్ మాట్లాడుతుంటాడు. యామినిలగా నన్ను ఇంకెవరైనా ఇష్టపడటం కానీ, నేను ఎవరినైనా ఇష్టపడటం కానీ.. అలాంటిదేమైనా జరిగిందా అని యామిని తండ్రిని రాజ్ అడుగుతాడు.
అప్పుడే మెట్లు దిగుతూ వచ్చిన యామిని వాళ్ల మాటలు వింటుంది. రాజ్ అడిగిన దానికి ఎందుకు అల్లుడు గారు అలా అడుగుతున్నారు, ఏమైంది అని యామిని తండ్రి అంటాడు. నా లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారేమో అని డౌట్ వచ్చింది. ఎవరైనా గుర్తుకు వచ్చారా. ఒకవేళ ఉంటే చెప్పండి. ప్లీజ్ అంకుల్ చెప్పండి అని రాజ్ ప్రాధేయపడతాడు. దాంతో యామిని చూసి అవాక్కయి షాక్‌లో ఉండి అలాగే చూస్తుంటుంది.
ఏంటీ రాజ్ ఇలా అడుగుతున్నాడు, ఎంత చేసిన మళ్లీ మొదటికి వస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది యామిని. మరోవైపు రాజ్ అలా అడుగుతుంటే నిజం దాచలేక చెప్పలేక సతమతం అవుతాడు యామిని తండ్రి.
రాజ్‌ను మోసం చేస్తున్నావ్, యామినితో పెళ్లి జరిపిస్తే కావ్య పరిస్థితి ఏం కావాలి అనే గిల్టీ ఫీలింగ్‌తో ఉన్న యామిని తండ్రి నిజం చెబుతాడు. ఇంకొకరు ఉన్నారు అని యామిని తండ్రి అంటాడు. ఇంతలో యామిని వచ్చి అడ్డుకుంటుంది. తండ్రిని ఏం మాట్లాడనివ్వకుండా చేస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం