బ్రహ్మముడి ప్రోమో: సిద్ధార్థ్‌కు కావ్య ప్లాన్ లీక్ చేసిన యామిని- రాజ్ గతంపై మాట్లాడమని సలహా- రెండు వైపుల కావ్యకే నష్టం!-brahmamudi today episode promo yamini advice to siddharth about kavya plan to star maa serial brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి ప్రోమో: సిద్ధార్థ్‌కు కావ్య ప్లాన్ లీక్ చేసిన యామిని- రాజ్ గతంపై మాట్లాడమని సలహా- రెండు వైపుల కావ్యకే నష్టం!

బ్రహ్మముడి ప్రోమో: సిద్ధార్థ్‌కు కావ్య ప్లాన్ లీక్ చేసిన యామిని- రాజ్ గతంపై మాట్లాడమని సలహా- రెండు వైపుల కావ్యకే నష్టం!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఆఫీస్‌లో స్టాఫ్ అందరిని రాజ్ గడగడలాడిస్తుంటాడు. మరోవైపు సిద్ధార్థ్‌కు కావ్య ప్లాన్ లీక్ చేస్తుంది యామిని. రాజ్ బోర్డ్ మీటింగ్‌కు వస్తాడని, అక్కడ రాజ్ గతం గురించి మాట్లాడమని సలహా ఇస్తుంది యామిని. దాంతో రెండు వైపుల కావ్యకే నష్టం జరిగేలా యామిని స్కెచ్ వేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో కంపెనీలో రాజ్ స్టాఫ్ అందరిని పిలిచి అల్లాడిస్తుంటాడు. ఒక్కొక్కరు రాజ్ మాటలకు భయపడిపోతుంటారు. కంపెనీ కోసం ఇలాగేనా పని చేయడం, శాలరీ తీసుకుంటూ ఇంతే చేస్తారా అంటూ ఏవోవో మాటలు మాట్లాడుతాడు రాజ్.

ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి

కావ్యకు కాల్ చేసి రాజ్ చేసేది శ్రుతి చెబుతుంది. కావ్య దారిలో కారులో వస్తున్నాని చెబుతుంది. అదంతా విన్న రాజ్ వెంటనే శ్రుతిని తిట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమంటాడు. దాంతో శ్రుతి అలాగే చేస్తుంది. ఈయనేమో ఇలా ఇక్కడ రచ్చ చేస్తున్నాడు, ఆవిడ ఇంకా దారిలోనే ఉంది. ఏం జరుగుతుందో అని శ్రుతి భయపడిపోతుంది.

మరోవైపు రాహుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా గర్ల్‌ఫ్రెండ్‌తో పట్టుకుంటుంది స్వప్న. రాహుల్‌ను చీపురు కట్ట తిరగేసి మరి కొడుతుంది. తప్పించుకుందామని ప్రయత్నించిన రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఏడు వారాల నగలు కలెక్ట్ చేసుకుంటుంది అప్పు. దాంతో స్వప్న ఏడు వారాల నగలు సేఫ్ అవుతాయి.

నీ గురించి బాగా నీతులు చెబుతుంది కదా మీ అమ్మ. తనముందే తేల్చుకుందాం పదా అని రాహుల్‌ను ఇంటికి తీసుకెళ్తుంది స్వప్న. దుగ్గిరాల ఇంట్లో రుద్రాణితో స్వప్న పంచాయితీ పెడుతుంది. నీ కొడుకు గోప్పొడు, తప్పులే చేయడు అని బాగా వెనుకేసుకొస్తావుగా. ఇప్పుడేం చేశాడో చూశావా అని స్వప్న అంటుంది.

లాకర్‌లో గిల్ట్ నగలు

అనవసరంగా నా కొడుకును అనకు అని రుద్రాణి కవర్ చేస్తుంది. దాంతో తన లవర్‌ను సొంతం చేసుకోడానికి ఇల్లు దారపోస్తున్నాడని, తాతయ్య ఇచ్చిన ఏడు వారాల నగలు దానికిచ్చి నా లాకర్‌లో గిల్ట్ నగలు పెట్టాడని స్వప్న చెబుతుంది. దాంతో ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు.

అంతేకాకుండా ఆరోజు లాకర్ దగ్గర దొరికింది ఒరిజినల్ ప్లేసులో గిల్ట్ నగలు పెడుతూనే అని స్వప్న చెబుతుంది. దాంతో అంతా రాహుల్‌ను తిడతారు. ఇదే కాకుండా తాతయ్య రాసిచ్చిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌ను కూడా నకిలీగా చేసి తన లవర్‌కు ఇచ్చి దాన్ని పిచ్చిదాన్ని చేసి సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడని రాహుల్ చేసిందంతా చెబుతుంది స్వప్న.

ఇంపార్టెంట్ విషయం

అదంతా విన్న కుటుంబ సభ్యులంతా రాహుల్‌కు చివాట్లు పెడతారు. రుద్రాణి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. మరోవైపు రాజ్ ఆఫీస్‌కు సిద్ధార్థ్ కారులో వెళ్తుంటాడు. సిద్ధార్థ్‌కు యామిని కాల్ చేస్తుంది. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను అని యామిని అంటుంది.

ఏంటీ మేడమ్ చెప్పండి అని సిద్ధార్థ్ అంటుంది. బోర్డ్ మీటింగ్ రాజ్ వస్తున్నాడు అని యామిని చెప్పడంతో సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు. మరి ఇప్పుడెలా. రాజ్ వస్తే మన ఆటలు సాగవుగా మేడమ్ అని సిద్ధార్థ్ అంటాడు. పూర్తిగా చెప్పేది విను. రాజ్‌కు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత రాజ్ గతం మర్చిపోయాడని యామిని చెబుతుంది.

రాజ్‌కు గతం గుర్తు లేదని ఆ కంపెనీని చూసుకోవడం వాడికి చేతకాదని నువ్వు అందరిముందు ప్రూవ్ చేస్తే చాలు ఆ కంపెనీ నీ సొంతం అవుతుంది అని సిద్ధార్థ్‌కు యామిని సలహా ఇస్తుంది. అలా రాజ్‌ను ఎండీలా కూర్చోబెడుతున్న కావ్య ప్లాన్‌ను సిద్ధార్థ్‌కు యామిని లీక్ చేసేస్తుంది.

ఎటు చూసిన కావ్యకే

అయితే, బోర్డ్ మీటింగ్‌లో రాజ్ గతం మర్చిపోయాడని సిద్ధార్థ్ చెబితే రాజ్‌కు డౌట్ వచ్చి ఇబ్బంది అవుతుంది. అలా జరిగితే కావ్య భర్త ప్రాణాలకు ప్రమాదం. సిద్ధార్థ్‌ను రాజ్ గతం చెప్పకుండా ఆపితే కావ్య కంపెనీని కోల్పోవాల్సి వస్తుంది.

అటు భర్త, ఇటు కంపెనీ రెండు వైపులా కావ్య చిక్కుల్లో పడుతుంది. ఎటు చూసిన కావ్యకే నష్టం జరుగుతుంది. అక్కడితో లేటెస్ట్ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం