బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ హుషారుగా కావ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ అంతా రామ్‌ను రాజ్ అని పిలుస్తుంటారు. దాంతో రామ్ షాక్ అయితే ఏదోటి చెప్పి కవర్ చేస్తారు. అందరూ ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది రాజ్‌కు చాలా నచ్చుతుంది.
ఇక కావ్య ఆఫీస్‌కు వెళ్లేలా రుద్రాణి వేసిన ప్లాన్‌ను అన్నయ్యలు సుభాష్, ప్రకాశం చెడగొడతారు. ఈ విషయం యామినికి చెప్పడంతో కంగారుపడిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు అర్ధాంతరగా ముంచేశావ్ అని బాధపడుతుంది యామిని. కానీ, రుద్రాణి మాత్రం తన ప్లాన్ అడ్డం తిరిగినందుకు మరో కొత్త ప్లాన్ వేసినట్లు చెబుతుంది. అవునా, ఏంటది అని యామిని అడుగుతుంది.
రాజ్ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో కావ్య పెళ్లి ఫొటోలు రాజ్‌కు కనిపించేలా చేస్తాను. కావ్య మెడలో తాళి చూసి రాజ్ షాక్ అవుతాడు, ఇంతకాలం పెళ్లి అయిన అమ్మాయి వెనుకాల పడినందుకు బాధపడుతాడు అని రుద్రాణి ఫోన్ కాల్‌లో అంటుంది. కానీ, పెళ్లి ఫొటోలు చూస్తే కావ్య భర్త ఎవరో తెలిసిపోతుందిగా, అది తానే అని తెలుసుకుంటాడుగా అని యామిని అంటుంది.
కేవలం కావ్య తాళితో ఉన్న ఒక్క ఫొటోను మాత్రమే రాజ్‌కు కనిపించేలా చేస్తాను. కావ్య భర్త గురించి ఇంట్లో ఎవరిని అడిగిన కండిషన్ తెలిసి ఏం చెప్పరు అని కాన్పిడెంట్‌గా చెబుతుంది రుద్రాణి. ఆ మాటలన్నీ స్వప్న వింటుంది. అమ్మా నా అత్త, ఇంత పెద్ద స్కెచ్ వేశావా నీ సంగతి చెబుతా అని వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు రాజ్ అడిగేవాటికి కావ్య చిరాకు పడుతుంటుంది.
నానమ్మ ఏంటీ చిరాకుగా మాట్లాడుతుంది ఏంటీ అని రాజ్ అంటే నీకు నచ్చట్లేదా. అయితే పద్ధతి మార్చుకుంటుంది అని ఇందిరాదేవి అంటుంది. చూశావా అన్నట్లుగా రాజ్ చూస్తాడు. అమ్మమ్మ అప్పుడే పార్టీ మార్చేశారా అని కావ్య అంటే.. ఎప్పుడో మార్చేశానే, మారాల్సింది నువ్వే. ఇకనైన పద్ధతి మార్చుకో అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత తనకోసం ఏం వండారు అని రాజ్ అడిగితే కావ్య కౌంటర్స్ వేస్తుంది.
ఇక మరోవైపు రుద్రాణి కావ్య పెళ్లి ఆల్బమ్ తీసి మంచి ఫొటో కోసం వెతుకుతుంది. అందులో రాజ్, కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఒక ఫొటో బయటకు తీస్తుంది. దాంట్లో రాజ్ లేకుండా కత్తెరతో కట్ చేస్తుంది. కేవలం కావ్య ఫొటో మాత్రమే కట్ చేసి పక్కకు పెడుతుంది. రుద్రాణి తన గదిలోని బెడ్ మీద కావ్య పెళ్లి ఫొటో కనిపించేలా పెడుతుంది రుద్రాణి. ఇవాళ్టీతో రాజ్, కావ్యలు శాశ్వతంగా దూరమవుతారు. కావ్యకు ఇదివరకే పెళ్లి అయిందని తెలిసి కుమిలిపోతాడు ఆ రాజ్ అని రుద్రాణి అనుకుంటుంది.
మరోవైపు కావ్యతో మాట్లాడేందుకు ఎంతో ట్రై చేస్తాడు రాజ్. కానీ, కావ్య దూరం పెడుతూ ఉంటుంది. కావ్య కోసం ప్రయత్నించి అలసిపోతాడు రాజ్. హాల్లోకి వచ్చి సోఫాలో టైడ్‌గా వాలిపోతాడు రాజ్. అప్పుడే మెట్లపై నుంచి రుద్రాణి కిందకు వస్తుంది. రాజ్ బాగా అలసిపోయినట్లున్నాడు. నా గదిలో రెస్ట్ తీసుకోమ్మని చెప్పి పంపించి కావ్య ఫొటో చూసేలా చేయాలి అని రుద్రాణి అనుకుంటుంది.
ఏమైందిరా మనవడా.. నా మనవరాలి కోసం ట్రై చేస్తూ అప్పుడే అలసిపోయావా అని ఇందిరాదేవి అంటుంది. తను జగమొండిలా ఉంది నానమ్మ. ఇంప్రెస్ చేయడం కష్టంగా ఉందని రాజ్ అంటాడు. ఇంతలో రుద్రాణి వచ్చి ఏదేదో అంటుంది. దాంతో మీరు నన్ను బొత్తిగా అర్థం చేసుకోలేదు అని రాజ్ అంటాడు. నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే నా గదిలో నీకోసం ఏసీ పెట్టి గది మొత్తం కూల్‌గా ఉండేలా చేశాను అని రుద్రాణి అంటుంది.
దాంతో అవునా.. నిజమా.. మీరు ఇంత మంచివాళ్లు అని అస్సలు అనుకోలేదు అని రాజ్ అంటాడు. ఇంట్లో అంతా నన్ను అలాగే పొరపాటుపడతారు అని రుద్రాణి అంటుంది. మంచివాళ్లు అని పొరపాటుపడతారా అని రాజ్ అనుమానంగా అడిగితే.. కాదు చెడ్డదాన్నని అని రుద్రాణి అంటుంది. రూమ్ ఏసీతో ఉంచాను ఒక ఐదు నిమిషాలు వెళ్లి రెస్ట్ తీసుకో అని రుద్రాణి చెబుతుంది.
దాంతో సంతోషంగా థ్యాంక్యూ ఆంటీ అని రాజ్ రుద్రాణి గదికి వెళ్తాడు. అక్కడ బెడ్‌పై ఉన్న ఫొటోను చూసి రాజ్ షాక్ అవుతాడు. అది చూసి రుద్రాణి తెగ సంబరపడిపోతుంది. ఆ ఫొటో చూసి రాజ్ కోపంగా ఉంటాడు. ఇక వీళ్లిద్దరు విడిపోయినట్లే అని రుద్రాణి అనుకుంటుంది. అయితే, రాజ్ చూసింది కావ్య ఫొటో కాదని తర్వాత తెలుస్తుంది.
కింద హాల్లో రాజ్‌తో రుద్రాణి మాట్లాడే సమయంలోనే కావ్య పెళ్లి ఫొటోలను స్వప్న మార్చేస్తుంది. ఆ ఫొటోకు బదులు రుద్రాణికి సంబంధించిన ఫొటో పెడుతుంది. అది చూసే రాజ్ కోపంగా ఫీల్ అవుతాడు. అలా రుద్రాణి ప్లాన్ అడ్డం తిరుగుతుంది.
అది తెలిసి షాక్ అయిన రుద్రాణికి దగ్గరికి స్వప్న వస్తుంది. తను తీసిన గోతిలో తానే పడటం అంటే ఏంటో తెలుసా అత్తా.. అది ఇదే అని రుద్రాణి తాను తీసిన గోతిలో తనే పడినట్లు చెబుతుంది స్వప్న. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్