బ్రహ్మముడి ప్రోమో: ఇంటి వాకిట్లో ఎదురుపడిన తండ్రీకొడుకులు- రాజ్‌ను చూసేసిన సుభాష్- ఊహించని ట్విస్ట్- కావ్యకు చీర-brahmamudi today episode promo subhash saw son raj at home kavya shock star maa serial brahma mudi disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి ప్రోమో: ఇంటి వాకిట్లో ఎదురుపడిన తండ్రీకొడుకులు- రాజ్‌ను చూసేసిన సుభాష్- ఊహించని ట్విస్ట్- కావ్యకు చీర

బ్రహ్మముడి ప్రోమో: ఇంటి వాకిట్లో ఎదురుపడిన తండ్రీకొడుకులు- రాజ్‌ను చూసేసిన సుభాష్- ఊహించని ట్విస్ట్- కావ్యకు చీర

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తన సొంతింటికి రామ్‌గా రాజ్ వస్తాడు. రాజ్‌ను కావ్య తన గదిలోకి తీసుకెళ్తుంది. తర్వాత బయటకు వెళ్తున్న రాజ్‌ను తండ్రి సుభాష్ చూసేస్తాడు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడిలో ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో దుగ్గిరాల ఇంటికి రామ్‌గా ఉన్న రాజ్ వస్తాడు. రాజ్‌కు కొన్నిజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఏదో తెలిసిన ఇల్లులా అనిపిస్తుందని, నేరుగా ఇక్కడికి వచ్చానేంటీ అని అనుకున్న రాజ్ గేట్ తీసి లోపలికి వస్తుంటాడు. అది చూసిన కావ్య అప్పుకు చెబుతుంది. అప్పు ఏం చేయకపోవడంతో అపర్ణకు చెబుతుంది.

రాజ్‌కు స్వాగతం

రాజ్‌ను చూసిన అపర్ణ షాక్ అవుతుంది. అందరిని లోపలిని తీసుకెళ్లమని కావ్య చెప్పడంతో ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవిని ఏమార్చి అపర్ణ తన గదిలోకి తీసుకెళ్తుంది. బావ కేసు విషయం గురించి చెప్పాలని రుద్రాణి, రాహుల్, స్వప్నను అప్పు తీసుకెళ్తుంది. హాల్లో ఉన్న రాజ్ ఫొటోలు అన్ని తీసి పక్కకు పెడుతుంది కావ్య. డోర్ తెరిచి రాజ్‌కు స్వాగతం పలుకుతుంది కావ్య.

ఇక్కడికి ఎలా రాగలిగారు అని కావ్య అడిగితే.. నాకు తెలియకుండానే నా చేతులు ఇటువైపు స్ట్రీరింగ్ తిప్పేలా చేశాయి, దారి ముందే గుర్తు వస్తూ ఉంది. అలా గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి, మీ ఇంటికి ముందు వచ్చి ఆగాను అని, ఈ ఇంటితో ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని, మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు ఉందని, ఈ ఇంటిని చూశాకా నాకు మళ్లీ అదే సేమ్ ఫీలింగ్ వచ్చింది అని రాజ్ అంటాడు.

ఇంటికి వారసుడు మీరు

ఈ ఇల్లు మీదేనండి. ఈ ఇంటికి మీరు వారసుడు. మీకు త్వరలోనే అన్ని గుర్తుకు వచ్చి ఇంటికి అసలైన వారసుడిగా వచ్చేస్తారు. దానికి ఇంకా తక్కువ సమయమే ఉంది అని కావ్య ఎమోషనల్‌గా మనసులో అనుకుంటుంది. బయటే నిలబెట్టి మాట్లాడేస్తారా అని రాజ్ అనగానే ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కావ్య. ఇల్లు చూసి చాలా బాగుందని మెచ్చుకుంటాడు రాజ్.

హాల్లో ఉంటే ఎవరైనా వచ్చే ప్రమాదం ఉందని గ్రహించినా కావ్య రాజ్‌ను తన గదిలోకి తీసుకెళ్తుంది. మీ గదిలోకి రావడం బాగుండదేమో అని రాజ్ అంటే.. అయ్యో మొగుడా అది మన బెడ్‌రూమ్ అని మనసులో అనుకుంటుంది. నచ్చినవాళ్లను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అని నచ్చజెబుతుంది కావ్య. దానికంటే ముందుక బెడ్ రూమ్‌లో రాజ్‌తో ఉన్న ఫొటోలను తీసి పక్కన పెడుతుంది కావ్య.

కావ్యకు రాజ్ గిఫ్ట్

బెడ్ రూమ్‌లో కావ్య, రాజ్ మాట్లాడుకుంటారు. కావ్యకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తాడు రాజ్. తనతో పాటు తీసుకొచ్చిన గిఫ్ట్‌ను కావ్యకు ఇస్తాడు. అది తీసుకుని చాలా సంతోషిస్తుంది కావ్య. నేను ఇచ్చిన బహుమతి ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి అని కావ్యను రాజ్ అడుగుతాడు. దాంతో గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది కావ్య. అందులో కనకాంబరం రంగులో చీర ఉంటుంది.

అది చూసి చాలా మురిసిపోతుంది కావ్య. నచ్చిందా అని రాజ్ అడిగితే.. చాలా బాగా నచ్చిందండి. అసలు ఇదే తీసుకోవాలని ఎందుకు అనిపించిందని కావ్య అంటుంది. మీకు ఈ కలర్ బాగా సూట్ అవుతుందనిపించిందండి. అందుకే తీసుకున్నా. కానీ, మీకు నచ్చుతుందో నచ్చదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని రాజ్ చెబుతాడు. తర్వాత రాజ్‌ను బయటకు పంపిస్తుంటుంది కావ్య.

కావ్యకు మరో షాక్

ఇంటి గుమ్మం దగ్గర రాజ్ కావ్య ఉంటారు. బై అని రాజ్ చెబుతాడు. కావ్య కూడా బై అని చెబుతుంది. రాజ్ ఇటు తిరిగి వెళ్తుండగానే.. అటు అపర్ణ గదిలో నుంచి ఇందిరాదేవి, పైనుంచి రుద్రాణి ఇద్దరు వస్తుంటారు. ఆ ఇద్దరిని చూసి కంగుతిన్న కావ్య డోర్ క్లోజ్ చేస్తుంది. అలా రాజ్‌ను వాళ్లిద్దరు చూడకుండా డోర్ మూసేస్తుంది. హమ్మయ్య వాళ్లెవరు ఆయన్ను చూడలేదు అని వెనక్కి తిరిగే సరికి కావ్యకు మరో షాక్ తగులుతుంది.

అప్పుడే బయటి నుంచి ఇంటికి సుభాష్ వస్తుంటాడు. రాజ్ బయటకు వెళ్తుంటాడు. దాంతో దుగ్గిరాల ఇంటి వాకిట్లో తండ్రికొడుకులు అయిన సుభాష్, రాజ్ ఎదురుపడతారు. ఒకరినొకరు చూసుకుంటారు. రాజ్‌ను చూసేసిన సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది చూసిన కావ్య కంగారుపడిపోతుంటుంది. సుభాష్‌ను రాజ్ కొత్తగా చూస్తుంటాడు.అయితే, ఇది కావ్య ఏమాత్రం ఊహించని ట్విస్ట్.

అడ్డుపడిన కావ్య

రాజ్‌ను చూసి షాక్ అయిన సుభాష్ తేరుకుని తన కొడుకు బతికే ఉన్నాడని తెలిసి సంతోషిస్తాడు. రాజ్‌తో మాట్లాడేందుకు సుభాష్ ట్రై చేస్తుంటే కావ్య వచ్చి అడ్డుపడుతుంది. ఈయన మా అంకుల్ సుభాష్ అని రాజ్‌కు పరిచయం చేస్తుంది. ఓ హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు రాజ్. అదంతా అర్థం కాని సుభాష్ అయోమయంగా చూస్తుంటాడు. సరే వెళ్తానని రాజ్ వెళ్లిపోతుంటాడు. సుభాష్‌ను పక్కకు తీసుకెళ్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం