Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్య ఆఫీస్‌కు తమకు రూ. రెండు కోట్ల బకాయిలు ఇవ్వాలని ఇద్దరు వస్తారు. దాంతో మేనేజర్‌ని పిలిచి వీళ్ల బిల్స్ ఇంకా ఎందుకు పెండింగ్ పెట్టారు అని కావ్య అడుగుతుంది. నవ్య జ్యూలెరీ వాళ్లు పేమెంట్ క్లియర్ చేయలేదు, ఇంకా వేరే క్లైంట్స్ నుంచి కూడా రావాల్సిన బిల్స్ ఉన్నాయి అని మేనేజర్ చెబుతాడు.
దాంతో ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ ఏర్పడింది. అందుకే చెక్స్ అన్ని హోల్డ్ చేశామని మేనేజర్ అంటాడు. ఆ విషయం నాకు చెప్పాలి కదా. బిల్స్ పెండింగ్‌లో ఉండటం ఇష్టంలేదని తెలుసుకదా. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకండని మేనేజర్‌ను తిడుతుంది కావ్య. తర్వాత వచ్చిన క్లైంట్స్‌కు 24 గంటల్లో బిల్స్ క్లియర్ చేస్తామని హామీ ఇస్తుంది. ఇక మరోవైపు అపర్ణ పుట్టినరోజు గురించి అంతా మాట్లాడుకుంటే రుద్రాణి వద్దంటుంది.
అపర్ణ కూడా తన కొడుకే లేనప్పుడు తనకు ఆ పుట్టినరోజు వేడుకలు ఎందుకు, రాజ్ చేయాలనుకునే అన్నదాన కార్యక్రమాలు ఎందుకు అని బాధపడుతుంది. ఆ మాటలు విన్న అప్పు అక్కకు ఎలాగైనా ఈ విషయం చెప్పాలని, ఆంటీ చాలా బాధపడుతున్నారని, నిజం చెప్పించాలని అనుకుంటుంది. ఇంతలో కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. కావ్యతో అప్పు మాట్లాడుతుంది. అక్కా ఏంటిది, ఎన్నోరోజులు ఇలా అని అడుగుతుంది.
దేనిగురించి అడుగుతున్నావ్ అని కావ్య అంటుంది. బావ గురించి.. బావను ఎప్పటికైనా నువ్ తిరిగి తీసుకొస్తాను అనే నమ్మకంతో నువ్వుంటే నిజం తెలియని అత్తయ్యగారు మాత్రం రోజు రోజుకీ మరింత కృంగిపోతున్నారు అని పుట్టినరోజు గురించి జరిగిన డిస్కషన్‌ను చెబుతుంది అప్పు. దాంతో ఆలోచనలో పడుతుంది కావ్య. దేవుడా ఏంటిది.. ఆయనేమో నన్ను చూసినట్లు మాట్లాడుతున్నారు, కానీ, గతం గుర్తుకు రావట్లేదు. ఇక్కడ అత్తయ్య కొడుకు లేడని బాధపడిపోతున్నారు ఏం చేయను అని బాధపడుతుంది.
వెళ్లి అపర్ణతో మాట్లాడుతుంది. అత్తయ్య మీరెందుకు బాధపడుతున్నారు. ఆయన బతికే ఉన్నారు. నేను చూస్తున్నాను. నేను చెబుతున్నాను. నన్ను నమ్మండి అని కావ్య చెబుతుంది. నీది ప్రేమో, భ్రమో నాకు అర్థం కావట్లేదు కావ్య. నిజంగా వాడి బతికి ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు. ఎందుకు ఇంటికి రావడం లేదు అని ఏడుస్తూ నిలదీస్తుంది అపర్ణ. దాంతో అపర్ణకు సమాధానం చెప్పలకే ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అని నిజం చెప్పేస్తుంది కావ్య.
దాంతో అపర్ణ షాక్ అవుతుంది. అయ్యో ఇలా నిజం చెప్పేసానేంటీ అని కావ్య షాక్ అవుతుంది. ఏంటీ రాజ్ గతం మర్చిపోయాడా. అంటే, ఎక్కడ ఉన్నాడు నా కొడుకు. వాడి దగ్గరికి నన్నెందుకు తీసుకురావట్లేదు అని అపర్ణ అడుగుతుంది. దాంతో యామిని గురించి చెప్పేస్తుంది కావ్య. ఆయన దగ్గరికి తీసుకెళ్లలేను కానీ, రేపే మీకు ఆయన్ను చూపిస్తాను అని కావ్య చెబుతుంది. దాంతో అపర్ణ సంబరపడిపోతుంది.
మరుసటి రోజు ఉదయం అపర్ణ పుట్టినరోజు. ఇంట్లో అందరూ అపర్ణకు బర్తే డే విషెస్ చెబుతారు. మరోవైపు రాజ్‌కు కాల్ చేసి గుడికి రమ్మని అడుగుతుంది కావ్య. ఎందుకు, దేనికి అడిగిన రాజ్‌కు ఏదోటి చెప్పి వచ్చేలా చేస్తుంది. అదే గుడికి అపర్ణను తీసుకెళ్తుంది కావ్య. అక్కడ వస్తున్న రాజ్‌ను అపర్ణకు చూపిస్తుంది కావ్య. తన కొడుకుని చూసి, నిజంగానే బతికి ఉన్నాడని తెలిసి అపర్ణ సంతోషపడుతుంది.
ఆ తర్వాత గుడిలో అపర్ణ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపిస్తారు. రాజ్‌ను కలిసిన కావ్య ఆ అన్నదానంలో పాల్గొనేలా చేస్తుంది. రాజ్ చేతుల మీదుగా నలుగురికి వడ్డించేలా చేస్తుంది. అలా తన కొడుకు రాజ్ చేతులమీదుగానే అపర్ణ పుట్టినరోజు వేడుకలు చేయిస్తుంది కావ్య. అనంతరం రాజ్‌ను చూసినందుకు అపర్ణ సంతోషిస్తుంది. కావ్యను ఇన్నాళ్లు తప్పుపట్టినందుకు ఫీల్ అవుతంది.
రాజ్‌ను చూపించి తన పుట్టినరోజు నాడే తనకు మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చావని కావ్యతో అంటుంది అపర్ణ. ఇప్పుడు మీ మనసు కుదుటపడిందిగా అని కావ్య అడిగితే.. అవును అన్నట్లుగా అపర్ణ తల ఊపుతుంది. అక్కడితో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం