Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, యామిని బయటకు వెళ్తారు. కారులో వెళ్తూ ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రాజ్ చేయి తీసుకుని ముద్దు పెడుతుంది యామిని. దాంతో రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.
నువ్ ఇబ్బందిగా ఫీల్ అయిన సరే ఈమాత్రం సైలెంట్‌గా ఉంటే చాలు నేను అనుకుంది నెరవేర్చుకుంటా అని యామిని అనుకుంటుంది. మరోవైపు కారులో వెళ్తున్న కావ్య రాజ్‌ను చూసేస్తుంది. డ్రైవర్ యాదగిరిని కారు ఆపమని రాజ్ కారు వెనుక పరుగెత్తుతుంది. ఏం తినకపోవడంతో కాసేపటికే అలసిపోతుంది. అయినా కారు వెంట పరుగెత్తుతూనే ఉంటుంది. ఓపిక లేక ఓ చోట మాత్రం కావ్య ఆగిపోతుంది.
అప్పుడే కావ్యకు కొద్దిదూరంలో రాజ్ కారు ఆగుతుంది. డిజైనర్ చీర తెచ్చుకోవాలని యామిని కారు దిగి వెళ్లిపోతుంది. కారు ఆగడం చూసిన కావ్య మెల్లిగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఇంతలో కారు నుంచి రాజ్ బయటకు దిగుతాడు. అది చూసి కావ్య సంతోషిస్తుంది. అలాగే, ఓపిక తెచ్చుకుని రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. రాజ్‌ను తాకి అక్కడే ఏవండి అంటూ రాజ్ కాళ్ల దగ్గర పడిపోతుంది. అది విన్న రాజ్ షాక్ అవుతాడు.
కావ్యను పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరు మీరు అని అడుగుతాడు. ఇంతలో తిండిలేక నీరసంతో స్పృహ కోల్పోతుంది కావ్య. దాంతో కావ్యను కారులోకి ఎక్కించుకుంటాడు. యామిని కోసం చూస్తుంటే రాదు. దాంతో యామినికి ఏమాత్రం చెప్పకుండా కావ్యను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు రాజ్. మరోవైపు యామిని వచ్చి రాజ్ ఏడని చూస్తుంది. ఎక్కడికి వెళ్లిపోయాడు అని ఆలోచిస్తుంది. రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందా ఏంటీ అని భయపడుతుంది.
మరోవైపు హాస్పిటల్‌లో కావ్యను జాయిన్ చేస్తాడు రాజ్. స్ట్రెచర్‌పై కావ్యను రాజ్ తీసుకెళ్తుంటాడు. రాజ్‌ను స్పృహలో ఉండి లేనట్టుగా చూస్తుంది కావ్య. స్పృహ కోల్పోయిందని డాక్టర్స్‌కు చెబుతాడు రాజ్. దాంతో కావ్యకు ట్రీట్‌మెంట్ ఇస్తారు డాక్టర్స్. తను బాగానే ఉందని, చాలా రోజుల నుంచి సరిగ్గా తినకపోవడం వల్లే నీరసంగా ఉందని రాజ్‌కు వైద్యులు చెబుతారు. ఎలాంటి ప్రమాదం లేదని రాజ్ అడుగుతాడు. లేదని వైద్యులు చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్.
తర్వాత బిల్ కట్టమని రాజ్‌కు డాక్టర్స్ చెప్పడంతో అటు వైపు వెళ్తాడు. ఇంతలో బెడ్‌పై నుంచి రాజ్ కోసం చూస్తుంది. కానీ, రాజ్ కనిపించడు. దాంతో పక్కనే ఉన్న నర్స్‌ను మా ఆయన ఎక్కడ అని కావ్య అడుగుతుంది. మిమ్మల్ని అడ్మిట్ చేసిన వాళ్ల గురించి అడుగుతున్నారా అని నర్స్ అంటే.. ఆ అవును.. అవును అని కావ్య సమాధానం ఇస్తుంది. ఎక్కడ వారు అని కావ్య అడుగుతుంది. ఆయన బిల్ కడుతున్నారు అని లేడి డాక్టర్ చెబుతుంది.
దాంతో బెడ్‌పై నుంచి లేస్తుంది కావ్య. డాక్టర్స్ ఎంత చెప్పిన వినకుండా రాజ్ కోసం పరిగెత్తుతుంది. హాస్పిటల్‌లో రాజ్ కోసం చూస్తుంది కావ్య. మరోవైపు రాజ్ బిల్ కట్టేసి వెళ్లిపోతుంటాడు. కౌంటర్ దగ్గర ఇందాక నాకు బిల్ కట్టారు కదా ఆయన ఎక్కడ అని కావ్య అడుగుతుంది. ఇప్పుడే వెళ్లిపోతున్నాడు మేడమ్ అని కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి చెబుతాడు. దాంతో పరుగున బయటకు వచ్చి చూస్తుంది. కానీ, అక్కడ ఎవరుండరు.
రాజ్ వచ్చిన కారు వెళ్లిపోవడం చూస్తుంది కావ్య. దాంతో చాలా నిరాశపడుతుంది. ఆయన దొరికినట్లే దొరికి చేజారిపోయారు అని ఫీల్ అయిన కావ్య బతికి ఉన్నారని సంతోషిస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రాజ్ చనిపోవడం, కావ్య పిచ్చిదైపోతుందని, కంపెనీని, ఇంటిని చూసుకోవాలని బ్రెయిన్ వాష్ చేసేందుకు ట్రై చేస్తుంటుంది రుద్రాణి. ఇప్పటికైనా నమ్మండి, డిసైడ్ చేసుకోవండి. రాజ్ లేడు, రాడు, చనిపోయాడు అని రుద్రాణి అంటుంది.
ఇంతలో వచ్చిన కావ్య బతికే ఉన్నారు అని సంతోషంగా చెబుతుంది. దాంతో అంత షాక్ అవుతారు. నిజమా, ఎక్కడ చూశావ్ అని అపర్ణ, సుభాష్ అడుగుతారు. కానీ, కావ్య మాటలను రుద్రాణి కొట్టిపారేస్తుంది. నీకు పిచ్చి ఎక్కువై, హెల్యూజనేషన్‌తో ఎవరు కనిపించినా రాజ్‌లా అనిపిస్తుందని రుద్రాణి అంటుంది. లేదు తాను చెప్పేది నిజమని, హాస్పిటల్‌లో తనను రాజ్ జాయిన్ చేసినట్లు కావ్య చెబుతుంది.
దానికి ఆధారం ఏంటీ, నువ్వే ఏదో కల్పితంగా కట్టు కథలు చెబుతున్నావ్ అని, అందరూ నిన్ను నమ్మకపోవడంతో కొత్త నాటకం ఆడుతున్నావని రుద్రాణి అంటుంది. లేదు, నేను హాస్పిటల్‌లో జాయిన్ అయిన సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా. అందులో ఆయన ఉంటారు. కావాలంటే చెక్ చేసుకోండి అని కావ్య చెబుతుంది. దాంతో హాస్పిటల్ సీసీ టీవీ ఫుటేజ్‌ను చెక్ చేసేందుకు అప్పు వెళ్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం