Brahmamudi Promo: ఇంట్లో వాళ్లకు నిజం చెప్పని కావ్య.. రుద్రాణి నెల రోజుల టార్గెట్.. యామిని దొంగ సాక్ష్యాలు.. కళావతి శపథం-brahmamudi today episode promo kavya holds raj truth take one month time star maa serial brahma mudi disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: ఇంట్లో వాళ్లకు నిజం చెప్పని కావ్య.. రుద్రాణి నెల రోజుల టార్గెట్.. యామిని దొంగ సాక్ష్యాలు.. కళావతి శపథం

Brahmamudi Promo: ఇంట్లో వాళ్లకు నిజం చెప్పని కావ్య.. రుద్రాణి నెల రోజుల టార్గెట్.. యామిని దొంగ సాక్ష్యాలు.. కళావతి శపథం

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో రాజ్ చుట్టు కట్టు కథలు అల్లిన యామిని దొంగ సాక్ష్యాలు సృష్టిస్తుంది. మరోవైపు రాజ్ గురించి రుద్రాణి నిలదీస్తే నెల గడువు అడుగుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్‌ను రామ్‌గా గతం మార్చి చూపించేందుకు ఓ స్కూల్‌కు తీసుకెళ్తుంది యామిని. అక్కడ ప్రిన్సిపల్‌ను ఇద్దరు కలుస్తారు. వారిని ఫాలో అవుతూ వచ్చిన కావ్యను వాచ్‌మెన్ అడ్డుకుంటాడు. అతనికి పెళ్లి చూపులు చూస్తున్నారనే కారణాన్ని ఆసరాగా చేసుకుని అప్పును ఎరగా వేసి లోపలికి వెళ్తుంది కావ్య.

గుర్తు లేనట్లుగా రాజ్

యామిని, రాజ్‌లతో ప్రిన్సిపల్ మాట్లాడేది కిటికీ పక్కన నిలబడి వింటుంది కావ్య. రాజ్ గురించి గొప్పగా, బాగా తెలిసినట్లుగా చెబుతుంది ప్రిన్సిపాల్. రామ్ చాలా బాగా చదివేవాడని, ఇంటలిజెంట్ అని, యామిని అల్లరి పిల్ల అని, తనను ఎప్పుడు కంట్రోల్ చేసందుకు రామ్ సతమతం అయ్యేవాడని ప్రిన్సిపల్ చెబుతుంది. అవన్ని విన్న రాజ్ ఏం గుర్తులేనట్లుగా బిహేవ్ చేస్తాడు.

యామిని దొరకడం అదృష్టం

ఆ మాటలన్నీ విన్న కావ్య ఆయన చుట్టూ ఎన్నో కథలు అల్లుతున్నారు, ఎందుకు అని డౌట్ పడుతుంది. బావ చిన్ననాటి జ్ఞాపకాలు చూపిస్తే గతం గుర్తుకు వస్తుందని చిన్ని ప్రయత్నంగా ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా యామిని అంటుంది. దాంతో నీకు ఇలా జరిగిందని యామిని చాలా బాధపడిందని, తనకు చిన్నప్పటినుంచు నువ్వంటే చాలా ఇష్టం, చాలా కేరింగ్, ఇప్పుడు కూడా నీకోసం ఎంత ట్రై చేస్తుందో, నిజంగా తనలాంటి మరదలు దొరకడం నీ అదృష్టం అని చెప్పిన ప్రిన్సిపల్ వెళ్లి ఒక ఫొటో తీసుకొచ్చింది రాజ్‌కు ఇస్తుంది.

గొప్ప స్థాయిలో ఉండాలని

రామ్ వీళ్లంతా నీకు గుర్తు ఉన్నారా అని ఫొటో ఇస్తుంది. కానీ, ఆ ఫొటో చూసి వాళ్లను ఎవరిని గుర్తు పట్టలేకపోతాడు రామ్. రాజ్ ఒత్తిడికి గురయ్యేసరికి ఇట్స్ ఓకే అని ఇద్దరు చెబుతారు. తర్వాత కాలేజ్ గ్రౌండ్‌లోకి రాజ్‌ను తీసుకెళ్తుంది యామిని. అక్కడ కొంతమందిని పరిచయం చేస్తుంది. వాళ్లు రాజ్ అంటే బాగా తెలిసినట్లు, రాజ్ గొప్ప స్టూడెంట్ అని, తనలాగే తాము చదువుకుని గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతారు.

రాజ్‌తో సెల్ఫీలు

అంతేకాకుండా రాజ్‌తో సెల్ఫీలు కూడా తీసుకుంటారు. అలాగే, రాజ్, యామిని ప్రేమకథ గురించి కూడా గొప్పగా చెబుతారు. మీరిద్దరి గొప్ప ప్రేమికులు అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పిస్తుంది యామిని. మొత్తం స్కూల్‌లో యామిని దొంగ సాక్ష్యాలు సృష్టించి రాజ్‌ను రామ్ అనుకునేలా చేస్తుంది. కానీ, రాజ్‌కు మాత్రం అంతా అయోమయంగా ఉంటుంది. అదంతా చూసిన కావ్య ఎలాగైనా ఆయన్ను కాపాడుకోవాలని, అసలు ఈమె ఎవరు, ఎందుకు ఇన్ని కట్టు కథలు అల్లుతుందని అనుమానంతో ఆలోచనలో పడుతుంది.

డాక్టర్ హడావిడి

మరోవైపు దుగ్గిరాల ఇంట్లోకి ఓ డాక్టర్, ఓ నర్స్, ఓ కాంపౌండర్‌తో ఎంట్రీ ఇస్తాడు. పేషంట్ ఎక్కడ, ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందన్నారు అని హడావిడి చేస్తాడు డాక్టర్. దాంతో ఇంట్లో వాళ్లకు ఏం అర్థం కాదు. ఎవరు మీరు, దేనికి వచ్చారు అని సుభాష్ అడుగుతాడు. ఇక్కడ పేషంట్ ఉన్నారని, లేనివాళ్లను ఉన్నట్లు ఊహించుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని కాల్ వచ్చిందని డాక్టర్ చెబుతాడు. దాంతో మీకు కాల్ చేసింది ఎవరు అని ప్రశ్నిస్తాడు సుభాష్.

సైకియార్టిస్ట్‌తో ట్రీట్‌మెంట్

ఆ.. నేనే అన్నయ్య అంటూ పైనుంచి కిందకు దిగుతుంది రుద్రాణి. దాంతో కోపగించుకున్న సుభాష్ నీకు అసలు బుద్ధుందా.. ఇలాంటి పనిచేసి ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా అని ఫైర్ అవుతాడు. పరువు తీస్తున్నది నేను కాదన్నయ్యా.. నీ కోడలు అని కావ్య గురించి మాట్లాడుతుంది. కావ్యకు మతి భ్రమించిందని, ఇప్పటికీ ఈ సైకియార్టిస్ట్‌తో ట్రీట్‌మెంట్ ఇవ్వకుంటే పరిస్థితి చేజారుతుందని, దాంతో దుగ్గిరాల ఇంటి పరువు మొత్తం పోతుందని రుద్రాణి నానా మాటలు అంటుంది.

నువ్వైనా చూశావా

ఇంతలో కావ్య వస్తుంది. సైకియార్టిస్ట్‌ను చూసి, తనకు ట్రీట్‌మెంట్ కోసం రుద్రాణి పిలిచిందని తెలిసి షాక్ అవుతుంది. డాక్టర్‌కు తాను పర్ఫెక్ట్‌గా ఉన్నానని చెప్పి పంపిచేస్తుంది. రుద్రాణిపై ఫైర్ అవుతుంది కావ్య. ఇలాంటివి చేయొద్దని చెప్పానుగా అర్థం కాదా అని అరుస్తుంది కావ్య. దాంతో నా మేనల్లుడిని తీసుకొస్తానని వెళ్లావ్ కదా. తీసుకొచ్చావా. కనీసం నువ్వైనా చూశావా అని రుద్రాణి అడుగుతుంది. చూశాను అని కావ్య సమాధానం చెబుతుంది.

నెల తిరిగేలోపు

మరి మా ముందుకు రాజ్ ఎందుకు రావడం లేదు. చెప్పు ఎప్పుడు వస్తాడో. నాకు టైమ్ కావాలి అని రుద్రాణి గట్టిగా అడుగుతుంది. నెల తిరిగేలోపు ఆయన్ను మీ అందరి ముందు నేను నిలబెడతాను అని కావ్య అంటుంది. దాంతో అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. రుద్రాణి ఆశ్చర్యంతో ఆలోచనలో పడుతుంది.

రాజ్‌ను కాపాడి

అయితే, కావ్య నెల రోజుల గడువు అడుగుతుంది. కానీ, రాజ్‌ గతం మర్చిపోయాడనే నిజాన్ని మాత్రం చెప్పదు. నిజాన్ని దాచి యామిని నుంచి రాజ్‌ను కాపాడి ఇంటికి తీసుకొస్తానని తనకు తానే శపథం చేసుకుంటుంది కావ్య. అక్కడితో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం