Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో గుడి నుంచి రాజ్, యామిని ఇంటికి వస్తారు. గుడిలో జరిగిందంతా యామిని తల్లిదండ్రులకు రాజ్ చెబుతాడు. అపర్ణ ఆవిడను కలిశానని, ఈరోజు మా అమ్మ పుట్టినరోజుతోపాటు ఆమె బర్త్ డే కూడా అని, అందుకే అన్నదానంతోపాటు కేక్ కూడా కట్ చేయించానని రాజ్ చెబుతాడు.
ఇలాంటి మంచి పనులు చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు అని వైధేహి చెబుతుంది. దాంతో రాజ్ లోపలికి వెళ్లిపోతాడు. అపర్ణ ఎవరు, ఏంటీ కథ అని యామినిని వైధేహి అడుగుతుంది. అపర్ణ అంటే రాజ్ కన్నతల్లి అని యామిని చెబుతుంది. దాంతో యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు.
జరిగిందంతా చెప్పి
రాజ్ కన్నతల్లి ఉంటే నువ్ ఏం చేస్తున్నావ్. రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందా. అసలు వాళ్లిద్దరు ఎలా కలిశారు, ఏమైందని కంగారుగా అడుగుతుంది వైధేహి. నేను అక్కడికి వెళ్లేసరికి అపర్ణతో కేక్ కట్ చేయిస్తున్నారు అని జరిగిందంతా చెబుతుంది యామిని. బావ షర్ట్ వేసుకుని వెళ్లింది కావ్యతో కలిసి అన్నదానం చేయడానికే, అక్కడ అపర్ణ గురించి కావ్య చెప్పే ఉంటుంది అని యామిని అంటుంది.
అందుకే బావ అలా కేక్ కట్ చేయించాడు. నేను కూడా ఊరుకోకుండా రాజ్, నేను పెళ్లి చేసుకోబోతున్నామని వాళ్లకు చెప్పి షాకిచ్చా అని యామిని అంటుంది. దానికి యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఏంటీ వాళ్లకు పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పావా. వాళ్లు కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటే నువ్వింక మరీ అడ్డుకునేలా పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పావా. దాంతో వాళ్లు మరింత జాగ్రత్తపడి నీ నుంచి రాజ్‌ను దూరం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కదా అని యామిని పనికి షాక్ అయి అలా ఎందుకు చేశావని తిడతారు.
నా నుంచి రాజ్‌ను ఎవరు దూరం చేయలేరు. నా నుంచి రాజ్ దూరం కావాలంటే ముందు గతం గుర్తుకు రావాలి. కానీ, ఇప్పుడు బావ నేను క్రియేట్ చేసిన గతంలోనే ఉన్నాడు. ఒకవేళ కావ్య వాళ్లు రాజ్‌కు గతం గుర్తుకు వచ్చే ప్రయత్నం చేస్తే బావకే ప్రమాదం అని తెలుసు. అందుకే అలాంటి పని చేయరు. రాజ్‌కు గతం గుర్తుకు వచ్చేలోపే నేను పెళ్లి చేసుకుని నా వాన్ని చేసుకుంటాను, అప్పుడు ఇంకెవరు మమ్మల్ని విడదీయలేరు అని యామిని అంటుంది.
యామిని మాటలకు తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అయి అలా చూస్తుండిపోతారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రాజ్ చనిపోయాడని మరోసారి రచ్చ చేస్తుంది రుద్రాణి. రాజ్ చనిపోయాడని చాలా బాధపడ్డామని, అందుకే పరామర్శిద్దామని వచ్చామని కొంతమంది దుగ్గిరాల ఇంటికి వస్తారు. వారిని రుద్రాణినే కావాలని అరెంజ్ చేస్తుంది. వారిని అలా రమ్మని పిలిపించి రాజ్ చనిపోయాడని అందరిలో గట్టిగా నమ్మకం కుదర్చే ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తుంది.
రాజ్‌కు ఇంటికి వచ్చిన వాళ్లతో శ్రద్ధాంజలి ఘటించి, తను అనుకున్నది నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది రుద్రాణి. వాళ్లంత రాగానే ఎవరు వీళ్లను ఇంట్లో వాళ్లు అడుగుతారు. మీకు ఆ దేవుడు తీరని లోటు చేశాడు. మీ వారసుడిని తన దగ్గరకు తీసుకువెళ్లాడు అంటూ వచ్చినవాళ్లు ఎమోషనల్ డైలాగ్స్ కొడతారు. దాంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. వీళ్లకెలా తెలిసింది అని ఆలోచిస్తారు.
ఇంతలో రుద్రాణి కలుగజేసుకుని.. రాజ్‌ను తలుచుకుంటూ మనమెంత బాధపడుతున్నామో వీళ్లు కూడా అంతే బాధపడుతున్నారు. అందుకే రాజ్‌కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలని అనుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య తెగ షాక్ అవుతుంది. రాజ్ బ్రతికే ఉన్నాడు, త్వరలోనే ఇంటికి వస్తాడు అని నేను చెప్పాను కదా అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది అపర్ణ. నా కొడుకు గురించి ఇంకొక్కసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ.
దాంతో అంతా షాక్ అవుతారు. అపర్ణను సపోర్ట్ చేస్తూ రాజ్ బతికే ఉన్నాడని గట్టిగా వాదిస్తుంది కావ్య. రాజ్ బతికే ఉన్నాడని అపర్ణ కూడా నమ్ముతున్నట్లు రుద్రాణి ముందు అనవసరంగా నోరు జారుతుంది. దాంతో రుద్రాణికి డౌట్ వస్తుంది. వీళ్లకేదే నిజం తెలిసినట్లుంది. అదేంటో మనం కూడా తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటుంది. తర్వాత రాజ్ ఫొటోను చూస్తూ అపర్ణ తెగ సంబరపడిపోతుంది. అది గమనించిన రుద్రాణి కచ్చితంగా వీళ్లకు ఏదో తెలిసి. ఎలాగైనా నిజం బయటకు రాబట్టాలి అని రుద్రాణి నిశ్చయించుకుంటుంది.
మరోవైపు అపర్ణను కలిసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు రాజ్. కళావతి గారి లాగే అపర్ణను చూస్తే ఏదో తెలిసిన మనిషిలా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుందని అనుకుంటాడు. ఇక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం