బ్రహ్మముడి ప్రోమో: అబార్షన్ నిజం తెలుసుకున్న కనకం- కావ్యను మెచ్చుకున్న అపర్ణ, ఇందిరాదేవి- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన కావ్య-brahmamudi today episode promo aparna reveals kavya abortion to kanakam star maa serial brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి ప్రోమో: అబార్షన్ నిజం తెలుసుకున్న కనకం- కావ్యను మెచ్చుకున్న అపర్ణ, ఇందిరాదేవి- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన కావ్య

బ్రహ్మముడి ప్రోమో: అబార్షన్ నిజం తెలుసుకున్న కనకం- కావ్యను మెచ్చుకున్న అపర్ణ, ఇందిరాదేవి- పెద్ద ట్విస్ట్ ఇచ్చిన కావ్య

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్య పుట్టింటికి రావడం గురించి స్వప్నకు కాల్ చేస్తుంది కనకం. ఆ కాల్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. కనకం, రుద్రాణి ఇద్దరు వెటకారంగా మాట్లాడుకుంటారు. కావ్య దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి వెళ్తారు. నాటకం బాగా ఆడావని, రాజ్ బాగా టెన్షన్ పడుతున్నాడని కావ్యను మెచ్చుకుంటారు.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో అత్తింటికి వెళ్లి రాజ్ భార్య కావ్యను ఇంటికి రమ్మంటాడు. మీరు తీసుకున్న నిర్ణయమైన మార్చుకోండి, లేదా దానికి గల కారణం ఏంటో అయిన చెప్పండి అని కావ్య డిమాండ్ చేస్తుంది. అందులో ఏది ఒప్పుకోని రాజ్ కావ్యను తీసుకెళ్లకుండానే ఇంటికి వెళ్లిపోతాడు.

స్వప్నకు కనకం కాల్

రాజ్‌తో దురుసుగా మాట్లాడిన కావ్యను కనకం మందలిస్తుంది. అల్లుడితో ఏంటే అలా మాట్లాడతావ్. అసలు ఏం జరిగిందని అడుగుతుంది. కానీ, కావ్య ఏం చెప్పదు. ఏం జరిగిందో తెలుసుకుందామని అప్పుకు కనకం కాల్ చేస్తే పడుకుని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో స్వప్నకు కాల్ చేస్తుంది రుద్రాణి. కానీ, స్వప్న ఉండదు.

అక్కడ రుద్రాణి ఉంటుంది. కనకం ఫోన్ చేయడం చూసి రుద్రాణినే లిఫ్ట్ చేస్తుంది. కూతురు పుట్టింటికి రావడంతో ఏం జరిగిందో తెలుసుకుందామని కాల్ చేస్తుందని రుద్రాణి అనుకుంటుంది. రుద్రాణి, కనకం ఇద్దరు ఒకరికొకరు వెటకారంగా మాట్లాడుకుంటారు. కావ్య ఎందుకు ఇంటికి వచ్చిందో రుద్రాణిని అడగాలా వద్దా అని ఆలోచిస్తుంది.

తెలుసుకోడానికి ఏముంది

స్వప్న లేదా అని కనకం అడిగితే బాత్రూమ్‌లోకి వెళ్లిందని రుద్రాణి చెబుతుంది. సరే ఉంటానని కనకం అంటే ఏంటీ కావ్య ఇంటికి వచ్చింది ఏం తెలుసుకోకుకండా కాల్ కట్ చేస్తున్నావ్ అని రుద్రాణి అంటుంది. నా కూతురు నా ఇంటికి వస్తే దాంట్లో తెలుసుకోడానికి ఏముంది అని కనకం కాల్ కట్ చేస్తుంది. ఇదేంటీ ఈ కనకం ఏంటో అర్థం కాదు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే పెట్టేసింది అని రుద్రాణి అనుకుంటుంది.

మరోవైపు కావ్య పుట్టింటికి ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు వెళ్తారు. కనకం చూసి సంతోషిస్తుంది. ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తుంది. కావ్య చూసి సైలెంట్‌గా ఉంటుంది. ఇద్దరు కావ్యను మెచ్చుకుంటారు. రాజ్‌ను బాగా ఇరకాటంలో పెట్టావ్. అటు ధాన్యలక్ష్మీని, ఇటు రాజ్‌ను ఇద్దరిని బాగా మ్యానేజ్ చేశావ్ అని అపర్ణ అంటుంది. నాకేం అర్థం కావడం లేదు అని కావ్య అంటుంది.

విడాకుల నాటకం లాగే

రాజ్ కారణం చెప్పడానికి విడాకుల నాటకం ఆడినట్లే ఈ సారి ఆ ఇద్దరిని మ్యానేజ్ చేయడానికి ఇలా పుట్టింటి నాటకం ఆడావుగా అని అపర్ణ అంటుంది. అది విన్న కనకం షాక్ అవుతుంది. విడాకుల నాటకం ఏంటీ అని భయపడుతూ అడుగుతుంది. అదో పెద్ద కథలే కనకం అని ఇందిరాదేవి ఆపుతుంది.

నీ నాటకానికి హండ్రెడ్‌ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తున్నాను నేను. వాడికి నీది నాటకం అని తెలియక నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చేశావని తెగ టెన్షన్ పడిపోతున్నాడు అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య సైలెంట్‌గా ఉంటుంది. నాటకంలో ఆరితేరావే మనవరాలా. పరిస్థితికి తగినట్లు నాటకం ఆడి అందరిని బోల్తా కొట్టించావ్ అని కావ్యను ఇందిరాదేవి మెచ్చుకుంటుంది.

కావ్య పెద్ద ట్విస్ట్

ఇది నాటకం కాదు అమ్మమ్మ. నిజమే అని కావ్య చెబుతుంది. దాంతో ఇందిరాదేవి, అపర్ణ షాక్ అవుతారు. నేను నిజంగానే ఆ ఇంటి నుంచి వచ్చేశాను అని కావ్య అంటుంది. దాంతో మరింత షాక్ అవుతారు అపర్ణ, ఇందిరాదేవి. తను అత్తిల్లు వదిలి నిజంగానే వచ్చినట్లు చెప్పి అపర్ణ, ఇందిరాదేవిలకు పెద్ద ట్విస్ట్ ఇస్తుంది కావ్య. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది. మాకేం అర్థం కావట్లేదు అని కనకం అయోమయంగా అంటుంది.

ఇందులో అర్థం కాకపోడానికి ఏముంది కనకం. వాడు దీన్ని అబార్షన్ చేయించుకోమంటున్నాడు అని అపర్ణ నిజం చెబుతుంది. దాంతో కనకం, కృష్ణమూర్తి ఇద్దరు షాక్ అవుతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం