బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 845వ ఎపిసోడ్ కూడా రాజ్, కావ్య చుట్టే తిరిగింది. అతని నుంచి నిజం రాబట్టడం కోసం కావ్య సహా ఇంట్లో వాళ్లందరూ టార్చర్ పెడతారు. అయినా రాజ్ మాత్రం నోరు విప్పడు. అటు అప్పును అడ్డం పెట్టుకొని ఇంట్లో కొత్త చిచ్చు పెడుతుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ రాజ్ తో కావ్య, అపర్ణ, ఇందిరాదేవి ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. రాజ్ తినడానికి కూర్చున్న ఎవరూ వడ్డించరు. ఆ ముగ్గురూ హాల్లోనే ఉన్నా అతన్ని పట్టించుకోరు. తనకు వడ్డించమని అతడు అందరినీ బతిమాలుతాడు.
కానీ ఎవరూ వినరు. దీంతో రాజ్ తానే వడ్డించుకొని తింటాడు. పొలమారినట్లు నటించినా కూడా ఆ ముగ్గురూ ఏమీ పట్టనట్లు ఉంటారు. నాన్నమ్మను పిలిచినా.. నీ పెళ్లాంని పిలుచుకో అంటుంది. ఆ తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తిన్న తర్వాత కూడా రాజ్ కష్టాలు కంటిన్యూ అవుతాయి. పడుకోవడానికి రూమ్ లోకి వెళ్లిన రాజ్ ను కావ్య గెంటేస్తుంది. తన బిడ్డ అవసరం లేనప్పుడు తాను ఎందుకు.. తన పక్కన పడుకోవద్దని ఆర్డర్ వేస్తుంది. ఓ దిండు, దుప్పటి ఇచ్చి బయట సోఫాలో పడుకోవాలని చెబుతుంది.
అక్కడ పడుకుంటే అందరూ చూస్తారని రాజ్ అంటాడు. అందరికీ తెలిసే ఇది జరుగుతుంది కదా.. తెలిస్తే తెలియని.. బిడ్డను ఎందుకు వద్దంటున్నారో చెబితేనే ఇక్కడ పడుకోనిస్తానని కావ్య తెగేసి చెబుతుంది. దీంతో గుడ్ నైట్ అని చెప్పి రాజ్ బయటకు వెళ్లిపోతాడు.
అటు రాజ్ హాల్లో పడుకోవడం పైనుంచి అపర్ణ చూస్తుంది. రాజ్, కావ్య మధ్య మరీ ఇంత దూరం పెరగడం సరికాదు.. వీడి నుంచి ఎలాగైనా నిజం రాబట్టాలని అనుకుంటుంది. రూమ్ లోకి వెళ్లి ముసుగు తన్ని పడుకున్న సుభాష్ ను లేపుతుంది. అచ్చూ కావ్యలాగే సుభాష్ ను హాల్లోకి వెళ్లి పడుకోమని చెబుతుంది. వాడు తప్పు చేశాడు కాబట్టి కావ్య బయటకు పంపింది.. తనను ఎందుకు పంపిస్తున్నావని సుభాష్ అడుగుతాడు. వాడిని కనడమే మీరు చేసిన తప్పు అని అపర్ణ చెబుతుంది.
అటు హాల్లో దోమలు, ఈగలను రాజ్ తనను డిస్టర్బ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. తనకూ కాస్త చోటివ్వమని అడుగుతూ సుభాష్ కూడా అక్కడికి వస్తాడు. దీంతో నువ్వెందుకు బయటకు వచ్చావని రాజ్ అడుగుతాడు. నువ్వు చేస్తున్న తప్పుకు తనకూ శిక్ష పడిందని సుభాష్ అంటాడు. అటు ప్రకాశం కూడా దిండు, దుప్పటితో హాల్లోకి వస్తాడు. బాబాయ్ నువ్వు కూడానా అని రాజ్ అంటాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు.. కానీ మన ఇంట్లో రివర్స్ అవుతోందని ప్రకాశం బాధపడతాడు.
సుభాష్, ప్రకాశం కలిసి రాజ్ ను నిలదీస్తారు. ఆ నిజమేంటో చెప్పేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది కదా అని ప్రకాశం అంటే.. తాను నిజం చెప్పనని రాజ్ తెగేసి చెబుతాడు. ఇంతకుముందు దుగ్గిరాల ఇల్లు అంటే కేరాఫ్ హ్యాపీనెస్ లా ఉండేది.. ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోతోందని ప్రకాశం బాధపడతాడు. దీంతో సుభాష్ రాజ్ కు క్లాస్ పీకుతాడు.
తనలాగే పెళ్లయిన పాతికేళ్లకు ఇలా హాల్లో పడుకుంటే అంతా బాగున్నట్లు కానీ రెండేళ్లకే ఇలా వస్తే.. ఆ బంధం తెగినట్లు అని రాజ్ కు చెబుతాడు. అటు ప్రకాశం కూడా తనదైన స్టైల్లో.. నూనెలో వేస్తాం అప్పడం, నువ్విలా బయటకు వస్తే మొదలెడతాం చెప్పడం అని అంటాడు. అయినా రాజ్ మాత్రం నిజం చెప్పడు.
ఉదయాన్నే బాత్రూమ్ లో హ్యాపీగా పాటలు పాడుతూ స్నానం చేస్తుంటాడు రాజ్. అది చూసిన కావ్య తనకు నిజం చెప్పకుండా ఇలా హ్యాపీగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తావా చెబుతా నీ పని అంటూ నీళ్లు ఆపేయడానికి వెళ్తుంది. ఇంతలో ఇందిరాదేవి రావడంతో ఆమెకు ఆ ప్లాన్ చెబుతుంది.
తాను ఆ పని చేస్తానని ఇందిర వెళ్తుంది. ఇటు నీళ్లు ఆగిపోవడం, ముఖానికి సబ్బు ఉండటంతో రాజ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ నిజమేంటో చెబితే నిమిషంలో నీళ్లు వస్తాయని కావ్య అంటుంది. తాను టవల్ తో అయినా తుడిచేసుకుంటాను తప్ప నిజం చెప్పనని రాజ్ తెగేసి చెబుతాడు.
అటు అప్పూ బాధపడుతూ ఉంటుంది. ఆమెను చూసిన రుద్రాణి ఈ పొట్టిది ఇలా ఉండటానికి కావ్యనే కారణమని ధాన్యలక్ష్మికి చెబితే ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా అనుకొని వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి అక్కడికి తీసుకొస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీ, సరదాగా ఉండాలి.. కానీ ఆ కావ్య, రాజ్ వల్ల నీ కోడలు ఇలా బాధపడుతూ ఉందని ధాన్యాన్ని రెచ్చగొడుతుంది.
అటు రాజ్ ను కావ్య మరోసారి అందరి ముందూ నిలదీసినా నిజం చెప్పనని అంటాడు. కావాలంటే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని కావ్యతో కాస్త గట్టిగానే చెబుతాడు. అప్పుడే అప్పూ కళ్లు తిరిగి పడిపోతుంది. ఆమె దగ్గరికి కావ్య వెళ్లగానే అప్పును ముట్టుకోకు.. ఇదంతా నీవల్లే అంటూ ధాన్యలక్ష్మి రచ్చ మొదలుపెడుతుంది. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం