Brahmamudi Today Episode : రాహుల్ గురించి ఆధారాలు సేకరించిన కావ్య.. నిశ్చితార్థం వద్దకు వచ్చిన స్వప్న-brahmamudi today episode brahmamudi serial may 31st episode swapna at rahul engagement ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Today Episode Brahmamudi Serial May 31st Episode Swapna At Rahul Engagement

Brahmamudi Today Episode : రాహుల్ గురించి ఆధారాలు సేకరించిన కావ్య.. నిశ్చితార్థం వద్దకు వచ్చిన స్వప్న

HT Telugu Desk HT Telugu
May 31, 2023 07:24 AM IST

Brahmamudi Today Episode : రాహుల్ గురించి నిజాలు బయటపెట్టేందుకు కావ్య, శృతి ఆధారాలు సేకరించే పనిలే పడతారు. మరోవైపు రాహుల్, వెన్నెల నిశ్చితార్థం దగ్గర హడావుడి ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా ఉంది.

బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్
బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్

ఆధారాలు సేకరించేందుకు కావ్య, శృతి హోటల్ దగ్గరకు వెళ్తారు. ఎలాగోలా లోపలకు వెళ్తారు. అక్కడకు వెళ్లగానే.. మేనేజర్ తో శృతి మాట్లాడుతుంది. నన్ను గుర్తుపట్టారా రాహుల్ తో వచ్చాను అని అడుగుతుంది శృతి. రాహుల్ సర్ తో చాలా మంది వస్తారు.. అని మేనేజర్ అంటాడు. నన్ను గుర్తుపట్టకపోయినా పర్లేదులే.. రాహుల్ గుర్తు ఉన్నాడు కదా అని శృతి అంటుంది. తనే మా ఇద్దరినీ ఇక్కడకు పంపించాడని చెప్పింది. అవునా రాహుల్ నాకు చెప్పలేదే.. అని మేనేజర్ అంటాడు. అవును రాహులే పంపాడు అని కావ్య కూడా అంటుంది.

ఏదో రాహుల్ కు నాపై ఉన్న నమ్మకం అలాంటిందని మేనేజర్ అంటాడు. ఆయన మా స్పెషల్ కస్టమర్ అని చెబుతాడు. రాహుల్ ఇక్కడకు రెగ్యూలర్ గా వస్తుంటాడా అని కావ్య అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ మేనేజర్ మాత్రం చెప్పడు. మా హోటల్ రూల్స్ కు విరుద్ధం అంటాడు. ఒక్కసారిగా వెళ్లి.. మేనేజర్ చెంప మీద కొడుతుంది కావ్య. దీంతో షాక్ అవుతాడు మేనేజర్. ఎందుకు కొట్టారు మేడమ్ అని అడుగుతాడు.

ఆ రోజు నిజం దాచినందుకు, ఈరోజు నిజం చెప్పనందుకు అని కావ్య అంటుంది. తన ముఖానికి వేసుకున్న మాస్క్ తీయగానే మేనేజర్ షాక్ అవుతాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు కొట్టానని ప్రశ్నిస్తుంది. తను ఎవరో తెలుసా.. సైబర్ సిటీ పోలీస్ ఆఫీసర్ అని శృతి వైపు చూపించి అంటుంది. రాహుల్ గురించి చెప్పమని అడుగుతారు. వారానికో అమ్మాయిని తీసుకుని రాహుల్ వస్తాడని మేనేజర్ చెబుతాడు. వాళ్లకి కావాల్సినవి నేనే చూసుకుంటానని అంటాడు. ఆయన నాకు ఎంతో కొంత మనీ ఇస్తాడని చెబుతాడు. అంతకు మించి ఏం తెలియదని చెబుతాడు.

అయితే సీసీ టీవీ ఫుటేజీ కావాలని కావ్య అడగ్గా.. రాహుల్ సార్ వచ్చి 5 వేలు జేబులో పెట్టి మెుత్తం సీసీ టీవీ ఫుటేజీ డిలీట్ చేయించాడని మేనేజర్ చెబుతాడు. దీంతో కావ్య మరోసారి చెంపపై కొడుతుంది. ఉన్న ఒక్క ప్రూఫ్ ని లేకుండా చేశావ్ కదారా అని కావ్య ఫైర్ అవుతుంది.

మరోవైపు కల్యాణ్, అప్పు కలిసి స్వప్నను తీసుకెళ్లేందుకు వస్తారు. మా అక్క రాదేమోనని అప్పు అనగా.. రాహుల్ ఎంగెజ్మెంట్ విషయం తెలుసని వస్తుందని కల్యాణ్ అంటాడు. నిశ్చితార్థం కోసం గదిలోకి వెళ్లి కనకం స్వప్నను తీసుకొస్తుంది. ఇదే సమయంలో స్వప్న కళ్లు తిరిగిపడిపోతుంది. ఇంట్లోకి కల్యాణ్, అప్పు కూడా వస్తారు. ఏమైందోనని కనకం కంగారు పడిపోతుంది. పెళ్లి కొడుకు డాక్టరే కదా వచ్చి చూడండి బాబు అని పిలుస్తారు. ఆమెను పరీక్షించిన పెళ్లికొడుకు.. నాన్న వెళ్దాం పదా అని అంటాడు. స్వప్న ప్రెగ్నెంట్ అని కుండబద్దలు కొడుతాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.

ఇంకోవైపు రాహుల్-వెన్నెల నిశ్చితార్థం దగ్గర హడావుడి ఉంటుంది. అరుంధతీ గారు.. ఈరోజే లగ్నపత్రిక రాసుకుందామని రుద్రాణి అంటుంది. మంచి ముహూర్తాలు ఉన్నాయో లేదో అని అరుంధతీ అంటుంది. ముందైతే నిశ్చితార్థం కానివ్వు అని అపర్ణ అంటుంది. ఏం వదినా.. అన్ని నీ కొడుక్కు జరిగినట్టే జరుగుతాయా ఏంటి అని రుద్రాణి ఫైర్ అవుతుంది. తొందరపడి.. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా.. రాజ్ కు ఓ అనామకురాలిని కట్టపెట్టావ్ అని అంటుంది. ఇప్పుడు అరుంధతీ నీ ఫ్రెండే కదా ఏం అభ్యంతరం అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. పంతులుగారు.. ఇవాళే లగ్న పత్రిక రాయండని చెబుతుంది.

ఇక్కడ ఎవరూ ముసుగేసి మాయలు చేసే మాయమారి మనుషులు లేరులే రుద్రాణి అని అపర్ణ కౌంటర్ ఇస్తుంది. ఇంట్లో పెద్దలు రుద్రాణికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. పంతులు కూడా.. ముందు నిశ్చితార్థం జరగనివ్వండి అని అంటాడు. మీ తరఫున తాంబూలం ఎవరు తీసుకుంటారు అని పంతులు ప్రశ్నిస్తాడు. నేనే అందుకుంటానని రుద్రాణి అంటుంది. దంపతులు తీసుకోవాలని పూజారి చెబుతాడు. ఇదే సమయంలో నా తరఫున అపర్ణ, సుబాష్ తాంబూలం అందుకుంటారని అరుంధతీ అంటుంది. మీ తరఫున ఎవరు అందుకుంటారని రుద్రాణిని ప్రశ్నిస్తుంది. నా తరఫున మా అమ్మనాన్న తీసుకుంటారని పిలుస్తుంది రుద్రాణి. తాంబూలం మార్చుకుంటారు. నిశ్చితార్థం అవుతుంది.

సీన్ కట్ చేస్తే.. హోటల్ నుంచి కావ్య, శృతి బయటకు వస్తారు. భగవంతుడా నువ్వే ఏదో ఒక దారి చూపించాలని కావ్య మనసులో కోరుకుంటుంది. హోటల్ కు ఎదురుగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీని చూస్తుంది కావ్య. అయితే అది వేరే వారి ఇల్లు. కానీ అతడు ఎందుకు ఇస్తాడని.., శృతి ప్రశ్నిస్తుంది. వెళ్లి అడుగుదాం పదా అని కావ్య అంటుంది. ఇటీవలే ఒక దొంగతనం జరిగిందని సీసీ టీవీ ఫుటేజీ అడుగుదామని అనుకుంటారు. వాచ్ మెన్ దగ్గరకు వెళ్లి.. పోలీసుల్లా నటిస్తారు కావ్య, శృతి. కాసేపు వాచ్ మెన్ తో మాట్లాడి.. ఫుటేజీ చూపించమని అడుగుతారు. అయితే వాచ్ మెన్ ఓనర్ కు కాల్ చేసి.. ఫుటేజీ చూపించమని అడుగుతున్న విషయాన్ని చెబుతాడు. ఓనర్ కూడా చూపించమని అంటాడు.

శృతి, కావ్య వెళ్లి.. సీసీ టీవీ ఫుటేజీ చూస్తారు. అందులో వేరే వ్యక్తితో రాహుల్ వెళ్లడం చూసి షాక్ అవుతారు. ఎన్నాళ్లుకు దొరికావ్ రాహుల్ అని.. కావ్య మనసులో అనుకుంటుంది. ఫుటేజీ కలెక్ట్ చేసుకోమని శృతి అంటుంది. నాకు జరిగిన అన్యాయమే మీ అక్కకు జరిగిందని తెలిసి.. ఆ రాహుల్ వల్ల ఇంకే అమ్మాయి జీవితం నాశనం కాకూడదని మీకు సాయం చేశానని కావ్యతో శృతి అంటుంది. వాడికి మీరు తగిన బుద్ధి చెబుతారని నాకు నమ్మకం ఉంది. అయితే వాడు ఎంత నీచుడో తెలిసి.. వాడికి ఎదురు వెళ్లే ధైర్యం నేను చేయలేనని శృతి అంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటానని కావ్య అంటుంది.

సీసీ టీవీ ఫుటేజీ మెుత్తం ఫోన్లో ఎక్కించుకుంటుంది కావ్య. వాచ్ మెన్ కు థాంక్స్ చెప్పి అక్కడ నుంచి బయల్దేరుతారు. మరోవైపు స్వప్న చేసిన పనికి ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు. ఏం చేయాలే ఇప్పుడు అని కనకం బాధపడుతుంది. చావాలా? చంపాలా? అంటుంది. కళ్లలో పెట్టుకుని పెంచితే ఇలా చేశావని ఏడుస్తుంది. గొప్పగా బతకాలని ఆశలు పెంచుకున్నాని అంటుంది. నీ కూతురు లేచిపోయి తిరిగి వచ్చిందా అన్నవాళ్లు.. నీ కూతురు కడుపుతో తిరిగి వచ్చిందా అని అడుగుతారని బోరున ఏడుస్తుంది కనకం. వాళ్లకు జవాబు చెప్పాల్సిన పనిలేదని, కానీ నా ఇంటికి సమాధానం చెప్పాలని అంటుంది. నా భర్తకు సమాధానం చెప్పాలని పేర్కొంటుంది. నా పెంపకం ఇంత నీచంగా ఉందని నా భర్త నిలదీయలేక మౌనంగా ఉన్నారని బాధపడుతుంది. నేను ఏం సమాధానం చెప్పాలని కనకం బాధపడుతూనే ఉంటుంది.

కల్యాణ్ మధ్యలోకి వచ్చి.. జరిగింది నష్టమే.. మీరు పెంచుకున్న నమ్మకం ముక్కలైందని నిజమే అంటాడు. ఇప్పుడు మీ చేతుల్లో ఏమీ లేదు.. అలా అని స్వప్న రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. స్వప్నను ఇంతగా మోసం చేసిన వాడు సంతోషంగా ఉన్నాడని కల్యాణ్ అంటాడు. వాడి నిజస్వరూపం బయటపెట్టేందుకు కావ్య వదిన బయల్దేరిందని తెలుపుతాడు. వదిన గట్టిగా తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని, స్వప్నను అక్కడకే తీసుకెళ్తామంటుంది. కల్యాణ్ మాటలకు అప్పు కూడా మద్దతు ఇస్తుంది. దాని కష్టం ఊరికే పోదు.. ఏడ తప్పు జరిగిందో అడిగే తీసుకెళ్లి న్యాయం చేయమని అడుగుతాం అంటుంది.

కల్యాణ్, అప్పు, స్వప్న కలిసి.. రాహుల్ నిశ్చితార్థం జరిగే ప్రదేశానికి బయల్దేరుతారు. ఈ ఘటనతో పాపం కనకం కుప్పకూలిపోతుంది. నిశ్చితార్థం ప్రదేశానికి వస్తారు. ఇదే సమయంలో కాబోయే భార్య వెన్నెల గురించి చెప్పాలని రాహుల్ అంటాడు. అందర్నీ సెలెంట్ గా ఉండమని చెబుతాడు. నేను నీకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇప్పటి వరకూ నా జీవితంలో ఏ ఒక్క అమ్మాయివైపు కన్నెత్తి చూడలేదని అంటాడు రాహుల్. అప్పుడే స్వప్న వస్తుంది. నా జీవితంలో నేను తలెత్తి చూసిన ఏకైక అమ్మయివి నువ్వేనని వెన్నెలతో అంటాడు. రస్కెల్.. సాల్ట్ బిస్కెట్ కు స్వీట్ కోటింగ్ ఇస్తున్నాడని తన కొడుకు గురించి మురిసిపోతుంది రుద్రాణి. నా అదృష్టం ఏంటంటే.. నాకు నచ్చిన మెుట్ట మెుదటి అమ్మాయికి నేను నచ్చడమని రాహుల్ అంటాడు. వెన్నెలను చేసుకుంటే.. నా లైఫ్ అంతా వెన్నెలే.. పట్ట పగలు కూడా వెన్నెలే అని చెబుతూ ఉంటాడు రాహుల్. ఇవాళ మా ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుందంటే.. నేను నమ్మలేకపోతున్నాని వెన్నెలను పడేసే ప్రయత్నం చేస్తాడు. వెన్నెలకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point