Brahmamudi Today Episode : నిశ్చితార్థంలో కళ్లు తిరిగి పడిన స్వప్న.. గర్భవతి అని చెప్పిన డాక్టర్-brahmamudi today episode brahmamudi serial may 29th episode kavya and shruti in danger ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Today Episode Brahmamudi Serial May 29th Episode Kavya And Shruti In Danger

Brahmamudi Today Episode : నిశ్చితార్థంలో కళ్లు తిరిగి పడిన స్వప్న.. గర్భవతి అని చెప్పిన డాక్టర్

HT Telugu Desk HT Telugu
May 29, 2023 08:01 AM IST

Brahmamudi Serial Today Episode : రాహుల్-వెన్నెల నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. సమయం దగ్గర పడుతుంది. రాజ్ ను కావ్య బయటకు రమ్మని అడగడంతో ఎపిసోడ్ మెుదలవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్

రాహుల్-వెన్నెల నిశ్చితార్థానికి టైమ్ దగ్గరపడుతుంది. ఇంటికి వచ్చిన వారు రాజ్ తో మాట్లాడుతూ.. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతావ్ అని అడుగుతారు. ఇదే సమయంలో కావ్య వచ్చి.. రాజ్ ని పక్కకు తీసుకెళ్లి.. బయటకు వెళ్లాలి అంటుంది. ఇంట్లో బోలెడు పనులు ఉన్నాయని సీరియస్ గా రాజ్ చెబుతాడు. ఫంక్షన్ ఉందని.. రావడం కుదరదని నువ్వే వెళ్లమని చెబుతాడు రాజ్. ఫంక్షన్స్ లో చెప్పా పెట్టకుండా.. వెళ్లడం నీకు మీ అక్కకు అలవాటా అని అడుగుతాడు రాజ్. రాజ్ ఫోన్ అడుగుతుంది కావ్య.. కానీ రాజ్ నా ఫోన్ ఎందుకు అని ప్రశ్నిస్తాడు. దుగ్గిరాల వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నానని, దానికి ఎలాంటి భంగం కలిగించొద్దని రాజ్ అంటాడు. నా వల్ల మీ గుర్తింపుకు ఎలాంటి ఇబ్బంది రాదని కావ్య చెబుతుంది.

ఇప్పుడు మీ ఫోన్ ఇస్తారా ఇవ్వరా అని కావ్య రాజ్ ని అడుగుతుంది. ఆ కళ్లేంటి బాబు.. అంతున్నాయి అని అంటాడు రాజ్. చూడండి ఈరోజే నాకు ఆఖరి రోజు అని మీరే చెప్పారు.. వస్తే నాతో రండి.. లేదంటే మీ ఫోన్ ఇవ్వండి.. అది కూడా కుదరకపోతే.. మీ అమ్మగారితో చెప్పి.. నా ఫోన్ ఇప్పించండి అని గట్టిగా చెబుతుంది కావ్య. ఫోన్ ఇస్తారా.. లేకుంటే మీ భార్యగా ఒప్పుకుంటారా అని కౌంటర్ వేయగా.. వెంటనే ఫోన్ ఇస్తాడు రాజ్. ఇక అక్కడ నుంచి కావ్య వెళ్లిపోతుంది.

మరోవైపు కనకం ఇంట్లో స్వప్న నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతాయి. వచ్చిన వారు.. కనకం నువ్ గట్టిదానివే అంటారు. కూతురిని దుగ్గిరాల వారి ఇంటికి ఇస్తానని ఇచ్చావని, ఇప్పుడు లేచిపోయి వచ్చినదానికి పెళ్లి చేస్తున్నావని అంటారు. నువ్ తలచుకుంటే ఏదైనా చేస్తావని చెబుతారు. కనకం అక్క... ఈ అబ్బాయికైనా.. మన స్వప్న లేచిపోయిన సంగతి చెప్పారా అని చెప్పారా? మరో వ్యక్తి ప్రశ్నిస్తుంది. పెళ్లి కొడుకుకు అన్ని తెలుసులే అని కనకం సమాధానం చెబుతుంది. ఇలా అడిగేసరికి ఇంట్లోవాళ్లు వచ్చిన వాళ్లకి ఇంట్లో వాళ్లు వెటకారంగా కౌంటర్ ఇస్తారు. ఇరుగుపొరుగు వాళ్లు ఎలా ఉండాలో తెలియక.. అన్నామని క్షమించమని వచ్చిన వారు అంటారు.

సీన్ కట్ చేస్తే.. ఈ ఒక్కరోజులో అన్ని విషయాలు బయట పెట్టాలని వెళ్తూ ఉంటుంది కావ్య. రాజ్ కి రాహుల్ గురించి అన్ని తెలిసేలా చేయాలనుకుంటుంది. కావ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న విషయం రాహుల్ గమనిస్తాడు. ఈవిడ గారు.. ఒంటరిగా బయల్దేరిందంటే.. కచ్చితంగా మనకు గోతులు తీయడానికేనని, మనమే ఈమెకు గోతులు తిద్దామని అనుకుంటాడు రాహుల్. వెంటనే సలీమ్ అనే రౌడీకి కాల్ చేసి.. కావ్యను ఫాలో అవ్వమని ఆదేశిస్తాడు. ఆమె ఏం చేస్తుందో ప్రతీ కదలిక నాకు తెలియాలని చెబుతాడు. నా నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తానంటే ముందుగా బలి అయ్యేది మీ అక్క చెళ్లెల్లేనని అని అనుకుంటాడు రాహుల్.

మరోవైపు స్వప్న అమ్మ చెప్పినట్టు నా బతుకు ఇంతేనా అనుకుంటుంది స్వప్న. కావ్య ఆ ఇంట్లో మహారాణిలా బతికితే.. నేను అరుణ్ ని చేసుకుని.. మిడిల్ క్లాస్ కష్టాలను అనుభవించాల్సిందేనా అని బాధపడుతుంది. నేను ఎవరికీ అన్యాయం చేయలలేదని.. ఒక్క అవకాశం ఇవ్వమని దేవుడిని వేడుకుంటుంది.

సీన్ కట్ చేస్తే.. రుద్రాణి వచ్చి నిశ్చితార్థం డెకరేషన్ చూసి బాగుంది అనుకుంటుంది. అదే సమయంలో ఇంట్లో వాళ్లు కిందకు వస్తారు. ఇది ఏమైనా బస్తీలో జరిగే ఫంక్షనా.. వెయ్యి కోట్ల ఆస్తిపరురాలైనా.. అరుంధతీతో వియ్యం అందుకునే సమయం ఇంత లేట్ వస్తారా అని క్లాస్ పీకుతుంది. మా వదినలు ఇద్దరూ రెడీ అయ్యేదాని మీద చూపించే శ్రద్ధ జరగబోయే కార్యక్రమం మీ చూపిస్తే బాగుండేది అంటుంది రుద్రాణి. అన్నలిద్దరు ఉన్నారు.. ఇప్పుడే గెస్టులు వచ్చినట్టుగా వచ్చారు. అమ్మనాన్నలు ఇద్దరు పెద్దరికాన్ని పెట్టలో పెట్టుకున్నారని కామెంట్స్ చేస్తుంది. రాజ్, కల్యాణ్ ఇటువైపు వస్తే.. ఎక్కడ పని చెప్తామోనని తప్పించుకుని తిరుగుతున్నారు అంటుంది రుద్రాణి.

మీ ఇంటి కోడలు అయితే.. ఇటువైపై రాలేదని అని వెటకారంగా రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి బాగా హడావుడి పడుతుంది చిట్టి అంటూ ఇంటి పెద్దమనిషి అంటాడు. అవునండి తన జీవితంలో మెుట్టమెుదటిసారిగా చేస్తున్న కార్యక్రమం కదా అలానే ఉంటుందిలే అనుకుంటారు. మేం ఇద్దరం ఇంటి కోడళ్లమని.. అలంకారం చేసుకోకుంటే ఎలా అని అపర్ణ సమాధానమిస్తుంది. పైగా బస్తీలో ఉండేవాళ్లతో సంబంధం కలుపుకుంటున్నావా.. వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న వాళ్లతో కదా అని ధాన్యలక్ష్మి వెటకారం చేస్తుంది. అన్నలిద్దరమూ ఇప్పుడే వచ్చినా.. ఎప్పుడో ఏర్పాట్లు చేశామని అన్నయ్యలు అంటారు.

ఇంత మందిని పేరు పేరునా.. విమర్శించి బాగా అలసిపోయావ్ అత్తా.. అంటాడు రాజ్. అందరూ అన్ని పనులు చేస్తేనే.. చేసేందుకు ఏం మిగలక ఇలా ఆరోపణలు చేస్తున్నావని అంటాడు. మీ అందరి కడుపులో ఎంత ఉందో ఇప్పుడే బయటపడిందని రుద్రాణి అంటుంది. పర్వాలేదులే.. మీ అమ్మ అసూయ పడే స్థాయిలో నా కొడుకు పెళ్లి చేస్తానని చెబుతుంది. ఇదే సమయంలో కారు హార్న్ మెుగుతుంది. వచ్చిన వారిని రిసీవ్ చేసుకుందాం రండి అని రుద్రాణి పిలుస్తుంది. కానీ ఎవరూ కదలరు.

నీకు వెయ్యి కోట్లు కనిపిస్తున్నాయి, నాకు నా స్నేహితురాలు కనిపిస్తుంది వాళ్లే వస్తారులే రుద్రాణి అని అపర్ణ అంటుంది. నువ్వేం గాబార పడకు అని చెబుతారు. మరోవైపు ఇదే మయంలో అరుంధతీ, వెన్నెల వస్తారు. వచ్చి నేరుగా అపర్ణ దగ్గరకు వెళ్తారు. ఇది చూసిన రుద్రాణికి ముఖం మాడిపోతుంది. అపర్ణ.. నా కూతురు నీ ఇంట్లో అడుగుపెడితే.. నా కంటే బాగా చూసుకుంటావని ఆశతో ఈ సంబంధం ఒప్పుకున్నానని అరుంధతీ అంటుంది. ఈ పెళ్లికి ఒప్పుకునేందుకు నువ్వే కారణం అంటుంది. రాజ్ కు పెళ్లి కాకుంటే.. అతడికి ఇచ్చేవాడినని చెబుతుంది. ఏం పర్వాలేదు నీ కూతురిని నా కూతురిలా చూసుకుంటానని అపర్ణ చెబుతుంది. అందరూ వెన్నెలను పొగుడుతారు.

నా గదిలో రెడీ అవ్వమని రుద్రాణి చెబుతుంది. మా అపర్ణ గది అయితే మాకు కంఫర్ట్ గా ఉంటుందని అరుంధతీ, వెన్నెల వెళ్తారు. పెళ్లి చెడగొట్టినా.. చెడగొడతారని రుద్రాణి తన కుమార్తెను పంపిస్తుంది. మరోవైపు ఆటోలో వెళ్లి శృతిని కలుస్తుంది కావ్య. ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇంకోవైపు సలీమ్ ఫాలో అవుతూ ఉంటాడు. కావ్య, శృతిని కలిసిన విషయాన్ని చెబుతాడు. ఈ విషయం తెలిసి రాహుల్ షాక్ అవుతాడు. ఇద్దరినీ ఫాలో అవ్వమని చెబుతాడు. వాళ్లిద్దరు మా ఇంటికి రావొద్దని వార్నింగ్ ఇస్తాడు. అవసరమైతే కిడ్నాప్ చేయమని ఆదేశిస్తాడు రాహుల్.

ఇదే సమయంలో రాజ్ వచ్చి.. పూజకు టైమ్ అవుతుందని రాహుల్ ను రమ్మని పిలుస్తాడు. కనకం ఇంటికి వెళ్లిన కల్యాణ్ .. ఇంత హడావుడిలో ఇంట్లోకి వెళ్లడం కరెక్ట్ కాదని.. అప్పుకే కాల్ చేసి బయటకు రమ్మని పిలుస్తాడు. వదినా స్వప్నకు ఈ లెటర్ ఇవ్వమని ఇస్తాడు. ఇంకోవైపు కావ్య, శృతిని కారులో సలీమ్ ఫాలో చేస్తాడు. కారు తీసుకొచ్చి ఆటో ముందు ఆపుతాడు. ఇది చూసి షాక్ అవుతారు. ఎవర్రా మీరు బండి అడ్డుపెట్టారని ఆటో డ్రైవర్ ప్రశ్నించగా సలీమ్ బెదిరిస్తాడు. వెంటనే కావ్య, శృతి అక్కడ నుంచి పరిగెత్తుతారు. రౌడీలు వాళ్లని పట్టుకుంటారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు.

మరోవైపు కనకం ఇంట్లో స్వప్న నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నావ్.. మరి కావ్యను పిలవలేదా అని చుట్టుపక్కల వాళ్లు కనకాన్ని ప్రశ్నిస్తారు. కావ్య కనకం కూతురు కాదే.. దుగ్గిరాల వారి కోడలు. తీరిక ఉండొద్దా.. అని అమ్మలక్కలు మాట్లాడుకుంటారు. గదిలో ఉన్న స్వప్న అందరూ దాన్ని పొగిడేవారే అనుకుంటుంది. వచ్చే ఎపిసోడ్ లో స్వప్న కళ్లు తిరిగి పడిపోతుంది. డాక్టర్ వచ్చి ఆమె ప్రెగ్నెంట్ అని చెబుతాడు. అందరూ షాక్ అవుతారు. మరోవైపు రాహుల్-వెన్నెల నిశ్చితార్థం తాంబూలాలు మార్చుకుంటారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.