Brahmamudi Today Episode : నీ సంగతి చూస్తా.. రాహుల్​కు కావ్య మాస్ వార్నింగ్-brahmamudi today episode brahmamudi serial may 27th episode kavya warning to rahul ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Today Episode Brahmamudi Serial May 27th Episode Kavya Warning To Rahul

Brahmamudi Today Episode : నీ సంగతి చూస్తా.. రాహుల్​కు కావ్య మాస్ వార్నింగ్

HT Telugu Desk HT Telugu
May 27, 2023 07:01 AM IST

Brahmamudi May 27th Today Episode : వెన్నెల-రాహుల్ నిశ్చితార్థం ముహూర్తం పెట్టేందుకు పూజారి రావడంతో ఈరోజు ఎపిసోడ్ మెుదలవుతుంది. రాహుల్ జాతకంలో దోషం ఉందని పూజారి చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్లోని మరిన్ని విషయాలు మీకోసం..

బ్రహ్మముడి సీరియల్
బ్రహ్మముడి సీరియల్

వెన్నెల-రాహుల్ నిశ్చితార్థ ముహూర్తం పెట్టేందుకు వస్తాడు పూజారి. అయితే రాహుల్ జాతకంలో దోషం ఉందని, పొద్దున పూజలు జరిపించి, సాయంత్రం నిశ్చితార్థం పెట్టుకోమని సలాహా ఇస్తాడు. అంతే కదా.. ఆ పూజలు ఏవో జరిపిస్తాం.. నిశ్చితార్థం మాత్రం ఆగకూడదు.. చాలా మంది జరగకూడదని పండగ చేసుకోవడం నాకు ఇష్టం లేదని రుద్రాణి అందరి ముందే అంటుంది. ఈ విషయం అక్కతో చెబితే నమ్మదు.. ఎలా నమ్మించాలని కావ్య మనసులో అనుకుంటుంది.

ఇదే సమయంలో అరుంధతీకి రుద్రాణి కాల్ చేస్తుంది. పేరు పెట్టి కాకుండా.. వదిన అని పిలవని చెబుతుంది రుద్రాణి. పంతులు పెట్టిన ముహూర్తం గురించి చెబుతుంది. ఇక రాహుల్ మాత్రం సంబరపడిపోతాడు. మంచి సంబంధం కల్యాణ్ కు ఇద్దామంటే.. చెడగొట్టి తన కొడుక్కి చేసుకుంటుందని ధాన్యలక్ష్మి.. భర్తతో అంటుంది. రేపు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందని పూజారి చెప్పగా.. ఆ ముహూర్తమే ఖాయం చేయమని రుద్రాణి అంటుంది.

ఓ వైపు కల్యాణ్ కు అప్పు ఫోన్ చేస్తుంది. కావ్యకు కల్యాణ్ ఫోన్ ఇస్తాడు. స్వప్న నిశ్చితార్థం గురించి అప్పు చెబుతుంది. అమ్మవాళ్లు చూపించిన సంబంధం చేసుకోవడమే అక్కకు మంచిదని కావ్య చెబుతుంది. అదేంటక్క అలా అంటున్నావ్ అని అప్పు అడుగుతుంది. రాహుల్ సంగతి ఏం చేద్దామని ప్రశ్నిస్తుంది. వాడోక లోఫర్ అని, అలాంటి వాడితో అక్క ఎప్పుడు సంతోషంగా ఉండలేదని కావ్య స్పష్టం చేస్తుంది. అమ్మ ఏం చేసినా మన మంచికోసమే చేస్తుందని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కావ్య.

ఇదే సమయంలో అక్కడకు రాహుల్ వస్తాడు. మీ అక్కకు అక్కడ నిశ్చితార్థమా అని అడుగుతాడు. నువ్వేం చేయలేవని చెబుతాడు. ఇక్కడ, అక్కడ నిశ్చితార్థం ఆపలేవని వెటకారంగా అంటాడు రాహుల్. ఎలా ఉంది నా ప్లాన్ అంటాడు. నీ ప్లాన్లో ఇరుక్కుపోడానికి నేను శృతిని కాదని కౌంటర్ ఇస్తుంది కావ్య. దీంతో ఒక్కసారిగా రాహుల్ కు పిడుగుపడినట్టై షాక్ తింటాడు. షర్మిల, రమ్యల్లాగా నీ మాయమాటలు నమ్మను అని చెబుతుంది. నీ అకౌంట్లో చాలా మంది ఉన్నారు కదా.. తీస్తా.. ఒక్కొక్కరిగా అందరి లిస్ట్ బయటకు పెడతా అని అంటుంది. మా అక్కకు చెప్పడానికి కాదు, రాజ్ కు చెప్పడానికి కాదు అంతకు మించి అని వార్నింగ్ ఇస్తుంది కావ్య. అక్కడ మా అక్క నిశ్చితార్థం ఆపకుండా, ఇక్కడ నీ నిశ్చితార్థం ఆపకుండా బాగానే ప్లాన్ చేశావని, గేమ్ నువ్ స్టార్ట్ చేశావ్, విన్నింగ్ స్టార్ట్ నేను కొడతాను అని చెబుతుంది.

నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తానని రాహుల్ ను భయపెట్టిస్తుంది కావ్య. తెలిసో తెలియకో నాతో పెట్టుకున్నావని, నీ సంగతి చూస్తానన్నట్టుగా వార్నింగ్ ఇస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. రాహుల్ పిలిచినా పట్టించుకోదు. ఏం చేస్తుంది ఇప్పుడు.. వెయ్యికోట్ల ఆస్తి అని రాహుల్ తనలో తాను ఆలోచిస్తాడు. సీన్ కట్ చేస్తే.. రాత్రి అవుతుంది. రాజ్ ల్యాప్ ట్యాప్ లో పని చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో మేనేజర్ సిరీష్ అనే వ్యక్తి వస్తాడు. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో వచ్చారేంటి అని రాజ్ అడుగుతాడు. నేనే రమ్మన్నాను అని కావ్య అంటుంది.

కుక్కట్ పల్లి బ్రాంచీకి వెళ్లట్లేదేంటి అని అడుగుతుంది కావ్య. అది రాహుల్ చూసుకుంటున్నాడని రాజ్ బదులిస్తాడు. చూసుకోవట్లేదని కావ్య చెబుతుంది. మేనేజర్ గారు కాల్ చేశారని, ఆ విషయాన్ని మీకే నేరుగా చెప్పమని పిలిపించానని తెలుపుతుంది. కావ్య చెప్పిన విషయమే మేనేజర్ చెబుతాడు. వారం నుంచి ప్రొడక్షన్ ఆగిపోయిందని, మీరు బోనస్ గా వర్కర్స్ కు ఇస్తానని చెప్పిన 30 లక్షలు రాహుల్ తీసుకున్నాడని మేనేజర్ సిరీష్ చెబుతాడు. దీంతో వర్కర్స్ నిరసన తెలుపుతున్నారని చెప్పగా.. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ ప్రశ్నిస్తాడు. ఈ విషయం మీకు తెలుసని రాహుల్ చెప్పాడని మేనేజర్ సమాధానం ఇస్తాడు. అందుకే మీకు ఫోన్ చేయగా కావ్య మేడమ్ నేరుగా ఇంటికి వచ్చి చెప్పమన్నారని తెలిపాడు.

వర్కర్స్ డబ్బు.. రాహుల్ ఎందుకు వాడుకున్నాడని రాజ్ మనసలో అనుకుంటాడు. ఇప్పటికైనా మీ చుట్టూ ఉన్న మనుషులు మీలా లేరని గుర్తించాలని భర్తత కావ్య అంటుంది. మరోవైపు రాహుల్ నిశ్చితార్థం కోసం.. బట్టలు చూస్తూ ఉంటారు. అక్కడకు రాజ్ వస్తాడు. నీకు నచ్చింది ఏదో చూసుకోమని రుద్రాణి చెబుతుంది. నీకు నచ్చిందే నాకు నచ్చుతుందని రాహుల్ అంటాడు. అత్తయ్య లైఫ్ లో చాలా పొగొట్టుకుందని, మెుదటిసారి ఫంక్షన్ కారణంగా సంతోషంగా ఉంది, ఇలాంటి సమయంలో రాహుల్ అసలు రూపం బయటపెట్టి అత్తయ్య మనసు బాధపెట్టడం సరికాదని రాజ్ అనుకుంటాడు. రాహుల్ వంక అలానే చూస్తూ పైకి వెళ్లిపోతాడు.

ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తాడు రాజ్. ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉండగా.. బ్యాగ్రౌండ్లో ఓ చిన్న పాట వస్తుంది. చెయ్యని నేరానికి నిందను మోస్తున్నానని.., నిజం అందరికీ తెలిసే మార్గం చూపించమని కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని కావ్య వేడుకుంటుంది. సీన్ కట్ చేస్తే.. కల్యాణ్ కు శృతి కాల్ చేస్తుంది. రాహుల్ గురించి.. ముఖ్యమైన విషయం కావ్యతో మాట్లాడాలని చెబుతుంది. రాహుల్ నన్ను మోసం చేశాడని నిరూపించేందుకు ఒక ఆధారం ఉందని చెబుతుంది. అదేంటో వివరిస్తుంది. ఈ విషయం గురించి రాహుల్ కు తెలియనివ్వొద్దని శృతితో కావ్య అంటుంది.

మరోవైపు వెన్నెలతో ఫోన్లో మాట్లాడుతాడు రాహుల్. ఫోన్ కట్ చేశాక.. కావ్య ఏం చేసినా.. ఎవరికీ తెలియకుండా అడ్డుకోవాలని మనసులో అనుకుంటాడు. లేకుంటే అందరి దృష్టిలో వెదవను అయిపోతానని, అలా జరగనివ్వనని అంటాడు. ఉదయం అవగానే.. రాజ్ కు కావ్య స్నాక్స్, టీ తీసుకొస్తుంది. రాహుల్ నిశ్చితార్థం హడావుడిలో పడి ఏం తినలేదని గుర్తు చేస్తుంది. హడావుడిలో పడి నువ్ కూడా ఒకటి మరిచిపోయావని రాజ్ అంటాడు. ఈరోజుతో మనం పెట్టుకున్న గడువు ముగుస్తుంది అంతే కదా అని కావ్య అంటుంది. ఒక్కసారి చెప్పాక.. నేను మరిచిపోను అని చెబుతుంది. లోపల ఎన్ని ఉన్నా.. పైకి సంతోషంగా ఉంటానని అంటుంది.

నువ్ ఈ రోజు నిజాన్ని నిరూపించకపోతే.. హోదాను కోల్పోయేందుకు సిద్ధంగా ఉండమని కావ్యకు రాజ్ సవాలు చేస్తాడు. మీరు కూడా రాహుల్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉండమని కావ్య అంటుంది. రాత్రి ఫ్యాక్టరీ విషయంలో రాహుల్ చేసిన తప్పు గురించి తెలుసనే నమ్మకంతో మాట్లాడుతున్నావా అని రాజ్ ప్రశ్నిస్తాడు. నాకు రాహుల్ గురించి పూర్తిగా తెలుసనే నమ్మకంతో మాట్లాడుతున్నానని కావ్య కౌంటర్ ఇస్తుంది. మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసని టిఫిన్, స్నాక్స్ అందిస్తుంది.

మరోవైపు ఎలా నిరూపించబోతున్నారని కల్యాణ్ టెన్షన్ పడుతాడు. ఓ లెటర్ తీసి.. కల్యాణ్ కు ఇస్తుంది కావ్య. మా అక్క స్వప్న నిశ్చితార్థం ముగిశాక.. ఈ లెటర్ ఇవ్వాలని చెబుతుంది. ఇదే సమయంలో శృతి కాల్ చేస్తుంది. తన దగ్గర ఆధారాలు లేవని, అయితే చెప్పిన ప్లేసుకు వెళ్తే.. ఆధారాలు దొరుకుతాయని అంటుంది శృతి. మణికొండ దగ్గరకు రమ్మని చెబుతుంది. ఓ వైపు కల్యాణ్ లెటర్ ఇచ్చేందుకు వెళ్తాడు, మరోవైపు కావ్య ఆధారాల కోసం వెళ్తుంది.

సీన్ కట్ చేస్తే.. స్వప్న నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు జరుగుతాయి. లోపల ఉన్న దాని లోపల ఏం ఉందోనని కనకం బాధపడుతూ ఉంటుంది. అది ఏం చేసుకుంటుందోనని భయంగా ఉందని ఇంట్లో వాళ్లకి చెబుతుంది. అప్పు దగ్గరకు స్వప్న వెళ్లేసరికి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాగా ఏడ్వమని అప్పు వెటకారంగా అంటుంది. నా ప్లేసులో నువ్వుంటే.. నా బాధ ఏంటో నీకు తెలుస్తుందని స్వప్న అంటుంది. నేను నీలా కాదు, లేచి పోతే.. నీలా చేయను అని స్వప్న అంటుంది. లేచిపోయి వచ్చినా.. ఇంట్లో వాళ్లు ఏం అనలేదనే విషయాన్ని అప్పు గుర్తు చేస్తుంది. మీలా పెద బతుకు నేను బతకలేనని స్వప్న అంటుంది. మాది పెద బతుకా? అని అప్పు ప్రశ్నిస్తుంది. రా.. వీధిలోకి తీసుకెళ్తా.. మగ, ఆడ వాళ్లు నిన్ను ఎలా చూస్తారో చూపిస్తాని అంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point