Brahmamudi Today Episode : రుద్రాణికి లెఫ్ట్ రైట్ ఇచ్చేసిన కావ్య.. సపోర్ట్ చేసినట్టే చేసి ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ-brahmamudi today episode brahmamudi serial may 26th episode fight between rudhrani and kavya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Today Episode Brahmamudi Serial May 26th Episode Fight Between Rudhrani And Kavya

Brahmamudi Today Episode : రుద్రాణికి లెఫ్ట్ రైట్ ఇచ్చేసిన కావ్య.. సపోర్ట్ చేసినట్టే చేసి ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ

HT Telugu Desk HT Telugu
May 26, 2023 08:01 AM IST

Brahmamudi Today Episode : రుద్రాణి, అపర్ణ మధ్య గొడవతో ఎపిసోడ్ మెుదలవుతుంది. కనకం వాళ్లను ఎంగెజ్మెంట్ కు పిలవొద్దని అపర్ణ అంటుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి సీరియల్
బ్రహ్మముడి సీరియల్

రాహల్, వెన్నెల నిశ్చితార్థం గురించి ఇంట్లో చర్చ నడుస్తుంది. ఎవరిని పిలవాలనే విషయంపై మాట్లాడుతుంటారు. కనకం ఫ్యామిలీని పిలుస్తానని రుద్రాణి అంటుంది. వాళ్లను పిలవొద్దు అని అపర్ణ గొడవ పెట్టుకుంటుంది. ఈ ఇంటి నుంచి నీ కొడుకే ఆ ఇంటికి వెళ్లాడు., నేల మీద కూర్చొని తిన్నాడని రుద్రాణి అంటుంది. నన్ను రెచ్చగొడుతున్నావా అని అపర్ణ ఫైర్ అవుతుంది. కావాలంటే.. నువ్ చేసే ఫంక్షన్ కు పిలవకని.. నా కొడుకు ఫంక్షన్ కు పిలవొద్దంటే ఎలా అని రుద్రాణి ఫైర్ అవుతుంది. నీకు మెుదటి నుంచి నా కొడుకు రిచ్ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదని అంటుంది. విన్నారా అత్తయ్య.. నేను ప్రతీ దానికి అడ్డుపడుతున్నానట అని అపర్ణ బాధపడుతుంది.

నీ కొడుకు ఫంక్షన్, నా కొడుకు ఫంక్షన్ అని వేరు చేయకు రుద్రాణి అని ధాన్యలక్ష్మి మధ్యలోకి వస్తుంది. ఇది మన ఇంట్లో జరిగే ఫంక్షన్.. అక్కకు ఇష్టం లేనప్పుడు ఎందుకు పిలవడం అంటుంది. వాళ్ల వచ్చినప్పుడు ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉందని తన అభిప్రాయం చెబుతుంది ధాన్యలక్ష్మి. నువ్ చెప్పమ్మా.. అని రుద్రాణి అడుగుతుంది. నువ్ ఈ ఇంటి పెద్ద కొడలను తీసి పక్కన పెట్టాక.. నా పెద్దరికం నేను నిలుపుకోవాలి కదా అని అమ్మ అంటుంది. అయితే.. ఇండైరెక్ట్ గా నువ్ ఒప్పుకున్నట్టేగా.. అని కనకానికి ఫొన్ చేస్తుంది రుద్రాణి.

రేపు మా అబ్బాయి నిశ్చితార్థం రేపు అందరూ తప్పకుండా రావాలని రుద్రాణి అడుగుతుంది. స్వప్నకు కూడా రేపే నిశ్చితార్థం కదా అని మనసులో అనుకుంటుంది కనకం. కానీ బయటకు మాత్రం.. అయ్యో మీరు పిలవడమే మా అదృష్టం అంటుంది. మేమూ రాలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతుంది. మీకు కూడా రాలేని పనులు ఉంటాయా అని రుద్రాణి అంటుంది. అయ్యో కాదండి.. ఇంట్లో పూజ ఉందని కనకం బదులు ఇస్తుంది. వచ్చి పరువు తీసుకునే కంటే.. రాకపోవడమే మంచిదని ధాన్యలక్ష్మి అంటుంది.

సీన్ కట్ చేస్తే.. కల్యాణ్, కావ్య కారులో వస్తూ ఉంటారు. కవిగారు ఇన్నాళ్లు రాహుల్ ఓ రోమియో అనుకున్నాను, సరదాగా అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తాడు అనుకున్నానని కావ్య అంటుంది. కానీ మరీ ఇంతా బ్యాడ్ అని అనుకోలేదని చెబుతుంది. టు బీ ఫ్రంక్ నేను కూడా ఇదంతా ఊహించలేదు వదినా అని కల్యాణ్ బదులిస్తాడు. అమ్మాయిలతో టైం పాస్ చేస్తాడనుకున్నా.. కానీ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు అనుకోలేదని కల్యాణ్ అంటాడు. అక్క ప్రేమించింది కదా అని ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే.. పెళ్లాయ్యాక వంకర బుద్ధి చూపిస్తే ఏం చేయాలని కావ్య అంటోంది. రాహుల్ గురించి అందరికీ తెలిసేలా ప్లాన్ చేయాలని కల్యాణ్ తో చెబుతుంది. కుంబస్థలాన్ని బద్దలు కొట్టాలని అంటుంది.

అయితే ఈ విషయాన్ని మా అన్నయ్య నమ్మడని కల్యాణ్ అంటాడు. మా అన్నయ్య అన్నింటికి ప్రూఫ్స్ ఏంటని అడుగుతాడని చెబుతాడు. శృతి కళ్లలో నిజం ఉందని.. ఆమె అన్ని ప్రూఫ్స్ బయటకు తెస్తుందని కావ్య ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇదంతా నాకు తెలియదు మీ నమ్మకానికి నా జోహర్లు అని కల్యాణ్ అంటాడు.

మరోవైపు ఇంట్లో నగలు చూస్తూ ఉంటారు. ఓ నెక్లెస్ తీసి.. అమ్మా ఇది నాకు కాబోయే కూతురుకు పెడతానని చూపిస్తుంది. ఓ హారాన్ని చూసిన అపర్ణ.. వీటితో పాటు ఇది ఎందుకు వచ్చిందని అడుగుతుంది. వస్తే ఏమైదని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు కదా.. ఎక్స్ క్లూజివ్ కదా అని అపర్ణ అంటుంది. ఇంకా మార్కెట్లోకి రిలీజ్ కూడా చేయలేదని చెబుతుంది. అందరిలా నా కొడుకు పెళ్లి ఎందుకు చేస్తానని రుద్రాణి అంటుంది. అందరిలా నా కొడుకు పెళ్లి ఎందుకు చేస్తానని రుద్రాణి అంటుంది. నీ కొడుకు పెళ్లి పూర్ ఫ్యామిలీతో జరిగిందని దెప్పిపొడుస్తుంది.

ఇదే సమయంలో అక్కడకు వచ్చిన కావ్య.. మీరు ఎవరిని ఏం అంటున్నారు అని రుద్రాణిని ప్రశ్నిస్తుంది. ఇంకోవైపు రాజ్ మెట్ల మీద నుంచి కిందకు దిగుతాడు. ఏం వినలేదా.. నిన్ను చేసుకోవడం వలన, మీ అత్తకు, మీ ఆయనకు పరువు పోయిందని చెబుతున్నానని రుద్రాణి అంటుంది. ఇది విన్న కావ్యకు మండిపోతుంది. నన్ను ఎలా చేసుకున్నారో మరిచిపోయారా.. మా అక్క వెళ్లిపోతే.. నన్ను తొందరపెట్టింది మీరు అని చెబుతుంది. నా నెత్తిన ముసుగేసి పీటల మీద కూర్చొబెట్టింది మీరు.. అంటే మా ఆయన పరువు, మా అత్తగారి పరువు తీసింది ఎవరు మీరే కదా? మీరే కదా నన్ను బలవంతంగా అంటగట్టిందని రుద్రాణి మీదకు ఎదురుదాడి చేస్తుంది. ఇంట్లో వాళ్లందరూ ఇది షాక్ అవుతారు.

హౌ డేర్ యూ.. అని రుద్రాణి లేస్తుంది. నిన్నగాక మెున్న వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది. అమ్మా ఏం మాట్లాడట్లేదేంటి అని అడుగుతుంది. నువ్ మాట్లాడేప్పుడు ఎవరూ ఏం అనలేదు.. ఈ ఇంట్లో మాట్లాడేందుకు వాక్ స్వాతంత్ర్య్ం ఉందని తల్లి చెబుతుంది. నేను ఈ ఇంటి ఆడపడుచునని రుద్రాణి అంటుంది. ఆడపడుచు అంటే పుట్టింటి మంచి కోరుకోవాలని చెబుతుంది కావ్య. పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలని చెబుతుంది. నువ్వెంత, నీ బతుకెంత అని కావ్య పైకి చేయి లేపుతుంది రుద్రాణి.

వెంటనే రుద్రాణి అని అరుస్తుంది అపర్ణ. ఎవరి మీద చేయి ఎత్తుతున్నావని అంటుంది. ఇది దుగ్గిరాల వారి కుటుంబం.. ఎంత ధైర్యం ఉంటే.. ఈ ఇంటి కోడలి మీదే చేయి ఎత్తుతావా అని అడుగుతుంది. నా కొడుక్కి వేయి కోట్ల ఆస్తి ఉన్న సంబంధం వస్తుందని మీరు అందరూ అసూయతో రగిలిపోతున్నారని రుద్రాణి అంటుంది. మీరు అనుకున్నట్టుగా మా అత్తయ్య పెళ్లి చెడగొట్టాలి అనుకుంటే.. ఒక్క క్షణం చాలని అంటుంది కావ్య. ఆ అరుంధతీ గారు మా అత్యయ్య గారి ప్రాణ స్నేహితురాలు అనే సంగతి మరిచిపోయారా అని అడుగుతుంది. మా అత్తయ్యగారు తలుచకుంటే.. మీరు ఈ ఇంట్లో ఉండేవాళ్లా అని అంటుంది. నా భర్తను, మా అత్తయ్యను ఏదైనా అంటే ఊరుకోను అని కావ్య తెగేసి చెబుతుంది.

ఇక అక్కడ నుంచి వెళ్లిపోబోతుంటే.. ఆగు అని కావ్యను అపర్ణ పిలుస్తుంది. చీర, నగలు తీసి.. రాజ్ ని పిలుస్తుంది. మన ఇంటి కోడలికి మన స్థాయి తగ్గట్టుగా ఉండాలి కదా అని అంటుంది అపర్ణ. ఇవి తీసుకెళ్లి ఇవ్వు అని రాజ్ తో చెబుతుంది. రాజ్ ఆశ్చర్యపడుతాడు. రేపు జరగబోయే.. నిశ్చితార్థానికి అందరు బంధువులు వస్తారని, ఈ ఇంటి కోడలు మనస్థాయికి తగ్గట్టుగా ఉండాలని ఇవ్వమని రాజ్ ని ఆదేశిస్తుంది అపర్ణ. రాజ్ వెళ్లి కావ్యకు చీర, నగలు ఇస్తాడు. కావ్య లోలోపల సంతోష పడుతుంది.

ఎందుకు అంతా ఆశ్చర్యపోతున్నావ్ మనవరాలా.. నువ్ ఈ ఇంటి కోడలివి అని మీ అత్తయ్య చెప్పకనే చెప్పిందని ఇంటి పెద్ద అంటుంది. గదిలోకి వెళ్లి చీర, నగలను ప్రేమతో చూసుకుంటుంది కావ్య. ఇదే సమయంలో అపర్ణ గదిలోకి వస్తుంది. చాలా మురిసిపోతున్నావ్ అనుకుంటాను, చీర నగలు ఇచ్చింది నువ్ మాకు సపోర్ట్ చేసినందుకో.. రుద్రాణిని విమర్శించినందుకో కాదు అని అపర్ణ అంటుంది. నువ్ ఈ ఇంటికి అతిథివి మాత్రమేనని కావ్యతో చెబుతుంది. మా ఫ్రెండ్ అరుంధతీ నిన్ను మా ఇంటి పనిమనిషి అనుకుందని చెబుతుంది. రేపు ఆ స్థాయిలో వాళ్లు అంతా వస్తారు, నిన్ను మా కోడలు అని చెప్పకపోయినా.. అరుంధతీ అందరికీ పరిచయం చేస్తుందని అపర్ణ అంటుంది. మా ఖర్మ కొద్దీ పది మది దృష్టిలో నువ్ దుగ్గిరాలవారి కోడలివి అయిపోయావ్ కదా అని అంటుంది అపర్ణ. అందుకే ఇస్తున్నా.. పొంగిపోకు అని చెబుతుంది.

ఈ విషయం అనడంతో కావ్య లోలోపల బాధపడిపోతూ ఉంటుంది. ఇదే సమయంలో వచ్చిన రాజ్.. ఇంచు మించు నా అభిప్రాయం, మా అమ్మ అభిప్రాయం ఒకటేనని రాజ్ అంటాడు. నీ వైపు తప్పులేదని తెలిస్తేనే ఈ ఇంట్లో చోటు అని రాజ్ ఖరాఖండి చెప్పేస్తాడు. మీ వైపు అపనమ్మకం ఉందని, నేను ఈ ఇంటికి అతిథిని కాదని ఏదో ఒకరోజు మీరే నమ్ముతారని కావ్య అంటుంది.

మరోవైపు కనకం ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతాయి. రేపు మంచి ముహూర్తం ఉందని అయ్యగారు చెబుతారు. ఎన్ని సంబందాలు చెడగొట్టినా వీళ్లు నా పెళ్లి చేయకుండా ఉండలేరని స్వప్న మనసులో అనుకుంటుంది. ప్రేమించినవాడు త్యాగం అంటున్నాడు, కన్నవాళ్లు వేరేవాడితో పెళ్లికి బలవంతం చేస్తున్నారని బాధపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలని, దేవుడా ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని అనుకుంటుంది.

రేపు కాకుండా వేరే రోజున ముహూర్తం ఏదైనా ఉందా అని అడుగుతాడు కనకం భర్త. అదేంటండి రేపు దివ్యమైన ముహూర్తమని పంతులుగారు చెబుతున్నారు కదా అని కనకం అంటుంది. రేపటికి రేపు అంటే మరీ తొందరపడుతున్నామని భర్త అంటాడు. ఇంకా ఆలస్యం చేస్తే.. ఏమవుతుందోనని తన భయాన్ని చెబుతుంది కనకం. మరోవైపు వెన్నెల, రాహుల్ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేందుకు అయ్యగారు వస్తారు. నిశ్చితార్థానికి వెన్నెల జాతకంలో ఆటంకాలు లేవని, కానీ రాహుల్ జాతకంలో ఉన్నాయని అయ్యాగారు చెబుతారు. నో రేపే నిశ్చితార్థం జరిగి తీరాల్సిందేనని అపర్ణ అంటుంది. మీరు నన్ను కామెంట్ చేసినట్టుగా.. నేను గ్రహస్థితిని కామెంట్ చేయలేను కదా అని పూజారి అంటాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point