Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్య వర్సెస్ స్వప్న- ఒక్కొక్కరుగా దూరం- ఓదార్చిన అపర్ణ- నిజం తెలుసుకోనున్న రుద్రాణి!
Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో స్వప్న సీమంతాన్ని కనకంతో అడ్డుకుంటుంది కావ్య. అది గ్రహించిన స్వప్న చెల్లి కావ్యతో తేల్చుకుంటుంది. ఇదంతా నువ్ కావాలనే చేశావ్ కదా అని గొడవ పెట్టుకుంటుంది. అందరి మంచికోసమే ఇలా చేశాను అని కావ్య చెబుతుంది. కావ్యకు స్వప్న ఇచ్చిపడేస్తుంది.
Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో స్వప్నకు రూ. 20 లక్షల బడ్జెట్‌తో సీమంతం చేసి కావ్యను బ్యాడ్ చేయడానికి ప్లాన్ వేస్తుంది రుద్రాణి. 20 లక్షలు ఇస్తే ఒకలా, ఇవ్వకుంటే ధాన్యలక్ష్మీతో తిట్టు తిట్టించేలా రెండు ప్లాన్స్ వేస్తుంది. కానీ, కావ్య మాత్రం రుద్రాణికి ఊహించని షాక్ ఇస్తుంది.

చెక్‌లా కాకుండా
అస్త్రంగా తన తల్లి కనకంను దింపి స్వప్న సీమంతాన్ని పుట్టింట్లో చేసేలా అందరిని ఒప్పిస్తుంది. దాంతో 20 లక్షల చెక్‌ను ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుని తన కళ్లముందే ముక్కలు చేస్తుంది. తర్వాత కనకం రావడం, ప్లాన్ ఫెయిల్ కావడంపై రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటారు. అప్పుడే సీతారామయ్య హాస్పిటల్ బిల్‌ను చెక్ రూపంలో కాకుండా క్యాష్ ఇచ్చి కట్టారు అని తనకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు రుద్రాణితో చెబుతాడు రాహుల్.
దాంతో ఆశ్చర్యపోయిన రుద్రాణి అనుమానిస్తుంది. ఆస్తి వచ్చినప్పటినుంచి కావ్య చేస్తున్న పనులన్నింటిని గుర్తు చేసుకుంటుంది. కంపెనీ పరంగా ఏదో జరిగింది. అందుకే కావ్య ఇంత స్ట్రిక్ట్‌గా రూల్స్ వేస్తుంది. అలాగే, సీతారామయ్య బిల్ ముందుగా కట్టలేకపోయారు. తర్వాత ఏదోలా మ్యానేజ్ చేసి కట్టి ఉంటారు అని రుద్రాణి ఊహిస్తుంది. ఇక అనుమానంతో కావ్య, కంపెనీపై ఓ కన్నేసి ఉంచుతుంది రుద్రాణి. రాహుల్ కూడా తన సైడ్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతాడు.
స్వప్న అనుమానం
మరోవైపు తన అత్త గ్రాండ్‌గా సీమంతం చేయిస్తానని చెప్పడం, అందుకు కావ్యను ఒప్పించడం, కావ్య ఒప్పుకోవడం, ఆ తర్వాతే తల్లి కనకం ఇంటికి రావడం, ఆచారం, సాంప్రదాయం అంటూ పుట్టింట్లో సీమంతం చేయించాలని చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకున్న స్వప్న ఆలోచనలో పడుతుంది. దీనంతటకి కారణం తన చెల్లి కావ్యే అని, తల్లి కనకం వచ్చి అలా మాట్లాడేలా చేసింది తనే అని అనుమానిస్తుంది స్వప్న. అందుకే వెంటనే వెళ్లి కావ్యతోనే తేల్చుకోవాలుకుంటుంది.
వంటింట్లో కావ్య కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి స్వప్న రావడంతో కాఫీ కావాలా అని అడుగుతుంది కావ్య. సమాధానం కావాలి అని స్వప్న అంటుంది. దేని గురించి అని కావ్య అడుగుతుంది. నా సీమంతం గురించి. అమ్మకు ఆ ఆలోచన వచ్చేలా చేసింది నువ్వే అని నాకు తెలుసు అని స్వప్న కోపంగా అంటుంది. దానికి అది తెలుసుకున్న దానికి ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసుకోలేక పోతున్నావా అక్క అని కావ్య అంటుంది.
నీకు నచ్చినట్లుగా కాదు
సొంత అక్క కూడా సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదని తెలుస్తోంది అని స్వప్న అంటుంది. నేను ఏం చేసినా మన మంచికోసం, ఈ కుటుంబం మేలు కోసమే చేస్తాను అని కావ్య ఎమోషనల్‌గా అంటుంది. మేలు కోరడం అంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం. ఇలాగా నీకు నచ్చినట్లు అందరూ బతకాలని కోరుకోవడం కాదు అని స్వప్న బాధగా, కోపంగా అంటుంది. ఇంకా తనను ఎంతో నమ్మానని, కానీ, ఆస్తి రాగానే పూర్తిగా మారిపోయావని కావ్యను నానా మాటలు అని స్వప్న వెళ్లిపోతుంది.
దాంతో కావ్యకు స్వప్న పూర్తిగా రివర్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, కావ్యను స్వప్న మాటలు అని వెళ్లిపోవడం అక్కడే ఉన్న అపర్ణ చూస్తుంది. అపర్ణను చూసిన కావ్య షాక్ అవుతుంది. దాంతో కావ్యతో మాట్లాడుతుంది అపర్ణ. ఏంటమ్మా ఇది, ఇదంతా ఎందుకు చేస్తున్నావో కారణం ఉందని తెలుస్తోంది. కానీ, ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పు అని అపర్ణ అంటుంది. చెప్పాల్సిన సమయంలోనే చెబుతాను అని కావ్య అంటుంది.
ఏడ్చేసిన కావ్య
కానీ, ఇలాగే చేస్తూ పోతే ఇంట్లోవాళ్లంతా నీకు వ్యతిరేకం అవుతారు. నిన్ను అభిమానించే ప్రకాశం కూడా ఈపాటికి నువ్వంటే అయిష్టం చూపిస్తున్నాడు. ఎప్పుడు సపోర్ట్ చేసే మీ అక్క కూడా నీకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది అని అపర్ణ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. దాంతో అపర్ణను హత్తుకుని కావ్య ఏడుస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్