Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యను ఇంట్లోనే చంపేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్- కరెంట్ షాక్ కొట్టేలా స్కెచ్!-brahmamudi serial today episode rahul plans to kill kavya with current shock at home rudrani agreed star maa brahma mudi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యను ఇంట్లోనే చంపేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్- కరెంట్ షాక్ కొట్టేలా స్కెచ్!

Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యను ఇంట్లోనే చంపేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్- కరెంట్ షాక్ కొట్టేలా స్కెచ్!

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో అందరి నోళ్లు మూయిస్తుందని కావ్యను ఏం చేయాలని ఆలోచిస్తుంది రుద్రాణి. ఈ లోకం నుంచే పంపించేలా చేస్తాను అని కావ్యను చంపేందుకు ప్లాన్ చేస్తాడు రాహుల్. తడి బట్టలు ఆరేస్తున్న కావ్యకు కరెంట్ షాక్ కొట్టేలా రెడీ చేసి పెడతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్

Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్‌ తాజా ఎపిసోడ్‌‌లో నందగోపాల్ హత్యపై కావ్య, రాజ్ పడుతుంటారు. మనకు నంద గోపాల్ చస్తే వంద కోట్ల నష్టం వస్తుంది. అదే నంద గోపాల్ బతికి ఉంటే ఎవరికి నష్టం, ఆ అవసరం ఎవరికీ ఉంది. నంద గోపాల్ బతికి ఉండటం ఎవరికి ఇష్టంలేదో అనే కోణంలో ఆలోచించాలి అని కావ్య అంటుంది.

రాజ్‌కు భలె చెక్ పెట్టావ్

నువ్ చెప్పింది కరెక్టే. ఈ కోణంలో నేను కూడా ఆలోచించలేకపోయాను అని రాజ్ అంటాడు. మరోవైపు చెస్ ఆడుతూ సంబరపడిపోతారు అనామిక, సామంత్. ఆ నంద గోపాల్‌ను చంపేసి రాజ్‌కు భలే చెక్ పెట్టావ్ అని సామంత్ అంటాడు. మరి నన్ను అవమానించినవాళ్లకు తెలియాలి కదా ఈ అనామిక తలుచుకుంటే ఏం చేస్తుందో అని అనామిక అంటుంది.

పూటకో గొడవ చేస్తూ

ఇప్పుడు ఆ నందాగాడు చచ్చిపోయాడు కాబట్టి చచ్చినట్లు వంద కోట్లు బ్యాంక్‌కు కట్టాలి. అందుకోసం మరింత అప్పులు చేస్తారు. మరోవైపు రుద్రాణి ఆస్తి అంటూ పూటకో గొడవ సృష్టిస్తుంది. దాంతో ఆ దుగ్గిరాల కుటుంబ పరువు రోడ్డు పడుతుంది. అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుందని అనామిక అంటుంది. దాంతో ఆ రాజ్ కంపెనీ మనకు వచ్చేస్తుంది. అప్పుడు మనమే నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంటాం అని సామంత్ అంటాడు.

అందరి నోళ్లు మూయించింది

మరోవైపు ఇంట్లో పనులు చేస్తుంటుంది కావ్య. వాషింగ్ మెషిన్‌లో ఉన్న బట్టలన్నీ బయటకు తీస్తుంటే టీ తాగుతున్న రుద్రాణి అలాగే చూస్తుంటుంది. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి గెస్ట్ హౌజ్ తాకట్టు పెట్టడంపై నిలదీయిస్తే.. అందరి నోళ్లు మూయించింది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి అందరిని ఆపుతుంది. ఇలా అయితే ఆస్తి ఎప్పుడు వచ్చేది అని రుద్రాణి రాహుల్‌తో అంటుంది.

కావ్యను వదిలించుకోవాలి

ప్రకాశం అన్యయ్యను మనవైపుకు తెచ్చుకోమ్మని ధాన్యలక్ష్మీకి చెప్పాను. ప్రకాశం అన్నయ్యను తను కూడా తన దారిలోకి తెచ్చుకుంటాను అని ధాన్యలక్ష్మీ చెప్పింది. అలా అయితే, మనకు మరింత బలం వచ్చినట్లే. ధాన్యలక్మీ, ప్రకాశం అన్నయ్యను అడ్డు పెట్టుకుని కావ్యను వదిలించుకుని మన ఆస్తి మనకు వచ్చేలా చేసుకోవాలి అని రుద్రాణి అంటుంది.

కావ్యను లోకంలోనే లేకుండా చేస్తాను

ధాన్యలక్ష్మీ ఆంటీని రెచ్చగొడితే కావ్య అంతకన్న రెచ్చిపోతుంది. కాబట్టి, ఆ రెచ్చగొట్టే ప్రాసెస్‌ను ఆపేయ్. నా దగ్గర ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అని రాహుల్ చెబుతాడు. ఏంట్రా అది అని రుద్రాణి అడుగుతుంది. కావ్యను ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అని రాహుల్ చెబుతాడు. దానికి ముందు ఆశ్చర్యపోయినా రుద్రాణి ఆలోచిస్తుంది. కావ్య చనిపోవడం వల్ల వచ్చే లాభాలు, అనుమానుల గురించి అడుగుతుంది రుద్రాణి.

కరెంట్ షాక్ కొట్టేలా రాహుల్ స్కెచ్

ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదవశాత్తు చనిపోయినట్లు క్రియేట్ చేస్తే ఎవరికీ డౌట్ రాదు. అది నేను చూసుకుంటాను అని రాహుల్ అంటాడు. దాంతో రుద్రాణి ఒప్పుకుంటుంది. కావ్యను చంపడానికి ప్లాన్ చేస్తుంటాడు రాహుల్. కరెంట్ షాక్ కొట్టి కావ్య చనిపోయేలా స్కెచ్ వేస్తాడు రాహుల్. వెళ్లి బట్టలు ఆరేసే సిల్వర్ తీగకు కరెంట్ షాక్ కొట్టేలా కరెంట్ వైర్స్ ఆనించి పెడతాడు. ఆ వైర్స్ ఉన్న ప్లగ్‌ను స్విచ్ బోర్డ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేసి ఉంచుతాడు.

తడి బట్టలు ఆరేసేందుకు

అప్పుడే బయటకు కావ్య బట్టలు ఆరేయడానికి వస్తుంది. అది గోడ పక్కను చాటుగా ఉండి చూస్తూ సంతోషిస్తాడు రాహుల్. కావ్య బకెట్ నుంచి తడి బట్టలు తీసి దులుపుతుంటుంది. తర్వాత దండెంపై బట్టలు ఆరేసేందుకు చూస్తుంటుంది కావ్య. కళావతి ఎక్కడ బట్టలు ఆరేసి కరెంట్ షాక్ కొట్టి చనిపోతుందో అని సంతోషంగా ఎదురుచూస్తుంటాడు రాహుల్. అక్కడితో లేటెస్ట్ బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంబంధిత కథనం