బ్రహ్మముడి అక్టోబర్ 6 ఎపిసోడ్: రాజ్‌ను గెంటేసిన కావ్య- ప్రకాశం బలి- అప్పు మనసుకు గాయం- రుద్రాణికి కావ్య రివర్స్ పంచ్-brahmamudi serial today episode october 6th 2025 kavya hurts appu dhanyalakshmi angry star maa brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి అక్టోబర్ 6 ఎపిసోడ్: రాజ్‌ను గెంటేసిన కావ్య- ప్రకాశం బలి- అప్పు మనసుకు గాయం- రుద్రాణికి కావ్య రివర్స్ పంచ్

బ్రహ్మముడి అక్టోబర్ 6 ఎపిసోడ్: రాజ్‌ను గెంటేసిన కావ్య- ప్రకాశం బలి- అప్పు మనసుకు గాయం- రుద్రాణికి కావ్య రివర్స్ పంచ్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 6 ఎపిసోడ్‌లో కావ్య దగ్గరికి వచ్చిన అప్పు విడాకుల గురించి మాట్లాడుతుంది. కావ్య అన్న మాటలు రుద్రాణి వింటుంది. అది ధాన్యలక్ష్మీకి చెబుతుంది. దాంతో కావ్యను ధాన్యలక్ష్మీ తిడుతుంది. అప్పు దగ్గరికి వెళ్లిన కల్యాణ్ నచ్చజెప్పి అన్నం తినిపిస్తాడు. రాజ్‌ను కావ్య గెంటేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 6 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య దగ్గరికి అప్పు వచ్చి విడాకుల గురించి మాట్లాడుతుంది. ఇంతకాలం బావ కోసమే బతికిన నువ్వు ఇప్పుడు ఎందుకు బావనే వద్దంటున్నావ్. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావ్. ఇది వంద శాతం కరెక్ట్ కాదు అని అప్పు అంటుంది. మరి మీ బావ అబార్షన్ చేసుకోమనడం కరెక్టా. నా బిడ్డను చంపేయాలని చూశారు. అది కరెక్టా అని రివర్స్‌లో అడుగుతుంది కావ్య.

నువ్వేం చేస్తావో చెప్పు

ప్రతిసారి నన్ను బిడ్డను చంపుకో అంటుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు కడుపుతోనే ఉన్నావ్‌గా. నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు. కవిగారు వచ్చి నీ బిడ్డ ప్రాణాన్ని చిదిమేయమంటావా అంటే చంపుకుంటావా చెప్పు అని కావ్య బాధగా అడుగుతుంది. పేగు బంధాన్ని తెంపులేక, తాళి బంధాన్ని తెంపుకుంటున్నాను. ఆయన ఇందుకు ఎలా చేస్తున్నారో చెప్పేవరకు నా నిర్ణయం మార్చుకోను అని కావ్య వెళ్లిపోతుంది.

ఇదంతా పైనుంచి రుద్రాణి చూస్తుంది. మరోవైపు రాజ్‌ను సీతారామయ్య పిలిస్తే మనవడు వచ్చి మాట్లాడుతాడు. నువ్వు చేస్తున్న పనివల్ల అంతా బాధపడుతున్నారు. దీనివల్ల ఏం సాధించాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు. నువ్వు బిడ్డను కాదనుకోవడం వల్ల నలుగురిలో పరువు పోతుంది. నలుగురికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కావ్య గురించి ఆలోచించు. ఎందుకు తనతో కన్నీళ్లు పెట్టిస్తున్నావ్. కావ్యతో విడాకులు ఇస్తా అనే పరిస్థితి తీసుకొచ్చావ్. ఎందుకు అని సీతారామయ్య అంటాడు.

కారణం ఏంటో చెప్పురా నేను మాట్లాడతా అని సీతారామయ్య అంటే రాజ్ చెప్పడు. సరే నీ కారణం నీ దగ్గరే ఉంచుకో. కానీ, కావ్యకు నువ్వు విడాకులు ఇస్తే మాత్రం చాలా కోల్పోతావ్ అని సీతారామయ్య అంటాడు. మరోవైపు అప్పును భోజనం చేయమనడానికి వచ్చి ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఆకలి వేయట్లేదని అప్పు చెబుతుంది. మీ అక్క గురించి ఆలోచించి తినడం మానేస్తావా. కడుపులో బిడ్డను నెగ్లెక్ట్ చేస్తావా చెప్పు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అప్పు మనసుకు గాయం

కాసేపు ఆగి తింటాను అని అప్పు చెప్పేసరికి ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. అక్క జీవితం అలా అయిపోతుంటే నాకు ఆకలి ఎలా వస్తుంది. అన్నం ఎలా సహిస్తుందని అప్పు అనుకుంటుంది. మరోవైపు అంతా భోజనానికి కూర్చుంటారు. అప్పు గురించి ధాన్యంను అడిగితే.. ఆకలి లేదు. తర్వాత తింటానన్నది అని ధాన్యలక్ష్మీ చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మీని ఎలాగైనా తీసుకురావాలి కదా అని తిడుతుంది ఇందిరాదేవి.

అప్పు మనసు బాధగా ఉంది. అందుకే తినను అంది. అప్పు మనసుకు గాయం చేసింది కావ్య. స్వయంగా నేనే విన్నాను. అక్క విడాకులు ఇస్తానని చెప్పేసరికి తట్టుకోలేక నచ్చజెబుతామని ఆశపడి మాట్లాడింది. కానీ, ఈ అక్క తిట్టిన తిట్టు తిట్టకుండా పంపించింది అని రుద్రాణి చెబుతుంది. కావ్య అలా తిట్టదు అంటూ కావ్యను అడుగుతుంది అపర్ణ. దానికి అవును అత్తయ్య కోపంలో తిట్టాను అని కావ్య అంటుంది.

నీకు తిట్టడానికి నా కోడలే దొరికిందా. ఇప్పటికీ నీ కారణంగా గొడవలకు అప్పు కుమిలిపోతుంది. రెండు రోజుల నుంచి ఇచ్చిన జ్యూస్ తాగట్లేదు. నీ వల్ల అని ఇప్పుడు అర్థమైంది. మీకంటే రాజ్ బిడ్డ వద్దంటున్నాడు. అలా అని నా కోడలికి కూడా ఏదైనా ప్రాబ్లమ్ రావాలని చూస్తున్నావా. అప్పు ఏడుస్తూ అలా ఆకలితో ఉంటే ఎలా అని ధాన్యలక్ష్మీ చెడామడా తిడుతుంది.

రుద్రాణిపై కావ్య ఫైర్

భర్త గురించి పట్టించుకోనిది చెల్లి కడుపు గురించి ఏం పట్టించుకుంటుంది. భర్త అంటే భార్య తగ్గి ఉండాలి కానీ ఇలా విడాకులు ఇస్తానంటారా అని రుద్రాణి అంటుంది. మీరు సలహాలు ఇవ్వడం అవసరం లేదు. అయినా పాటించేవాళ్లు చెబితే మంచిది అని రివర్స్ పంచ్ ఇస్తుంది కావ్య. కల్యాణ్‌తో అప్పుకు భోజనం తీసుకెళ్లమని చెప్పి వెళ్తుంది కావ్య. దాంతో అప్పు కోసం కల్యాణ్ భోజనం తీసుకెళ్తాడు.

అక్క సమస్య గురించి ఎవరికి తెలియదు. రోజు రోజు అక్క పరిస్థితి ఎక్కడ క్రిటికల్‌గా అవుతుందేమో అని భయంగా ఉంది. బావగారు కారణం చెబితే గానీ విడాకులు తీసే నిర్ణయం మానుకోను అంటుంది. బావనేమో కారణం చెప్పట్లేదు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్పా ఏం చేయలేకపోతున్నాను అని అప్పు అంటుంది. నీకోసం కాకపోయిన మన బిడ్డ కోసం అయినా తెనాలిగా అని అప్పుకు అన్నం తినిపిస్తాడు కల్యాణ్.

అపర్ణ, ఇందిరాదేవి దగ్గరికి కావ్య వచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్నా నాటకంతో ఇంట్లో ఇంకా ఎన్ని గొడవలు అవుతాయో అని భయంగా ఉందని అపర్ణ అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఆకలేస్తుంది. అన్నం పెట్టమని అడుగుతాడు. నువ్వు కారణం చెప్పనప్పుడు నేననేందుకు పెడతాను. పెట్టను అని అపర్ణ అంటుంది. నానమ్మను అడుగుతాడు. ఇందిరాదేవి కూడా పెట్టనంటుంది.

రాజ్‌ను గెంటేసిన కావ్య

తర్వాత బెడ్ రూమ్‌లో నుంచి రాజ్‌ను కావ్య బయటకు గెంటేస్తుంది. ఇకనుంచి మీ పడక గది హాల్లోనే అని కావ్య అంటుంది. రాజ్ హాల్లోకి వెళ్తాడు. అక్కడికి ప్రకాశం, సుభాష్ వస్తారు. నువ్వు చేసిన పనికి మీ పిన్ని కూడా గెంటేసింది. నువ్ చేసిన పనికి మిమ్మల్ని బలి చేస్తున్నావేంట్రా అని ప్రకాశం అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం