బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య పుట్టింట్లో రాత్రి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటుంది. తండ్రి కృష్ణమూర్తి వచ్చి మాట్లాడుతాడు. తాను చేస్తుంది తప్పో కరెక్టో అర్థం కావట్లేదు అని కావ్య అంటుంది. నువ్ నీ బిడ్డకోసం చేస్తున్న యుద్ధం ఇది. ఇందులో తప్పు ఎలా ఉంటుంది అని కృష్ణమూర్తి సపోర్టింగ్‌గా మాట్లాడుతుంది.
నీకు పెళ్లి చేసి పంపించేటప్పుడు మనకన్నా ధనవంతుల ఇంటికి పంపించాను. ఏదైనా అయితే వాళ్లను ఎదిరించే ధైర్యం కూడా నాకు ఉండేది కాదు. అలాంటిది నీ సహనం, ఓర్పుతో వారితోనే దుగ్గిరాల ఇంటి కోడలు అనిపించుకున్నావ్. ఇప్పుడు నీ జీవితంలో మొదలైంది రెండో అధ్యాయం. ఆ ఇంటి కోడలిగా చేస్తున్న పోరాటం కాదు. నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధం అని కృష్ణమూర్తి అంటాడు.
నిన్ను అంతగా ప్రేమించిన మనిషి బిడ్డ ఎందుకు వద్దనుకుంటున్నాడో, ఎందుకిలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు అని కృష్ణమూర్తి అంటాడు. అది తెలుసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇక నావల్ల కాలేదు. అలసిపోయాను. అందుకే ఇక్కడికి వచ్చాను. ఆయన మారుతారో లేదో నాకు తెలియదు. కానీ నాకోసం మాత్రం వస్తారు. ఏదో చిన్న ఆశ అని కావ్య అంటుంది.
నీది ఆశ కాదు. సంకల్పం. ఎప్పటికైనా నెరవేరుతుంది. లేట్ అవుతుంది. పడుకోమ్మా అని కృష్ణమూర్తి వెళ్లిపోతాడు. ఓవైపు రాజ్, మరోవైపు కావ్య మాటలు అనుకుంటారు. గొడవలతో విడిపోతారని తెలుసు కానీ ప్రేమిస్తూ కూడా విడిపోతారా అని కావ్య అంటుంది. మరోవైపు అంతా సోఫాలో కూర్చొంటారు. ఏంటీ అందరూ సోఫా మీటింగ్ పెట్టారు అని రాజ్ అంటాడు.
మేము నిరాహార దీక్ష చేస్తున్నాం అని సుభాష్ అంటే.. ఇందిరాదేవి తేర్పులు తీస్తుంది. మరి ఇదేంటీ అని రాజ్ అంటే.. అవి ఆకలి తేర్పులు అని అపర్ణ చెబుతుంది. ఈ నిరాహార దీక్ష దేనికి అని రాజ్ అంటాడు. కళావతి కోసం అని ధాన్యలక్ష్మీ అంటుంది. కావ్యను నువ్వు తీసుకొచ్చేవరకు మేము తినం అని అంతా అంటారు. అయితే నేను తింటాను అని టిఫిన్ చేయడానికి వెళ్తాడు రాజ్.
వాడిని తినకుండా ఇరిటేట్ చేసి కావ్యను తీసుకొచ్చేలా చేద్దాం అని ప్రకాశం అంటాడు. రాజ్ తింటుంటే అంతా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొంటారు. రాజ్ టిఫిన్ చేస్తుంటే అంతా మాటలతో ఇరిటేట్ చేస్తుంటారు. నేను దీన్ని ఓ షార్ట్ ఫిల్మ్ తీద్దామనుకుంటున్నా. భార్య పుట్టింటికి వెళ్తే బకాసురుడిలా తింటున్న భర్త అని అపర్ణ టైటిల్ చెబుతుంది. మీరు అంటుంది నన్నేగా. అది రానంటే ఏం చేయాలి అని రాజ్ అంటాడు.
ఎలాగైనా తీసుకురావాలి అని ఇందిరాదేవి అంటుంది. అది జరగని పని అని రాజ్ అంటాడు. అంటే ఇలా మిమ్మల్ని నిరాహార దీక్షతో చంపేయాలని చూస్తున్నావా అని ఇందిరాదేవి అంటుంది. ఛీ.. ప్రశాంతంగా టిఫిన్ కూడా తిననివ్వట్లేదు. మీరు ఎన్ని రోజులు తినకుండా ఉంటారో నేను చూస్తా అని రాజ్ వెళ్లిపోతాడు. వాడు ఆకలికి తట్టుకోలేక కావ్యను తీసుకొస్తాడు అని అంతా అనుకుని సంతోషిస్తారు.
అదంతా చూసిన రుద్రాణి మీ సంగతి చెబుతా అని అనుకుంటుంది. మరోవైపు కావ్య దగ్గరికి మీడియా అంతా వెళ్తుంది. అదంతా చూసి కనకం టెన్షన్ పడుతుంది. అబార్షన్, గొడవలు అన్నింటి గురించి కావ్యను మీడియా వరుసగా ప్రశ్నిస్తుంది. అలాంటిదేం లేదు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని కావ్య అంటుంది. మీరు భయపడి అబద్ధం చెబుతున్నారా. ప్రమాదం ఉందని అనుకుంటున్నారా అని మీడియా వారు అడుగుతారు.
మా అమ్మనాన్నను చూడటానికి పుట్టింటికి వచ్చాను. మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. నాకు నా భర్తకు ఎలాంటి గొడవలు లేవు అని కావ్య అంటుంది. కనకం గారు మీరైనా నిజం చెప్పండి అని అడుగుతారు. మా సమస్యల్లో మేమున్నాం. ఇలా పక్కవాళ్ల జీవితాల్లోకి వచ్చి సమస్యలు సృష్టించకండి. కావాలంటే మా అల్లుడి గారిని అడగండి అని కనకం అంటుంది.
కావ్య వెళ్లి డోర్ వేస్తుంది. చూశారుగా. బిడ్డను కాపాడుకునేందుకు కావ్య గారు పుట్టింటికి వచ్చారు. తల్లిదండ్రులు కూతురి బాధను చూడలేక సతమతం అవుతున్నారు. ఆడవాళ్లకు బిడ్డను కనే హక్కు లేదా. మేము కావ్యకు అండగా ఉంటాం. స్వరాజ్ లాంటి మూర్ఖపు భర్త స్వార్థపు ఆలోచనలు మారాలి. కావ్యకు అంతా సపోర్టింగ్‌గా ఉండాలని రకరకాలుగా చెబుతుంది ఓ జర్నలిస్ట్. ఇదంతా టీవీలో చూస్తుంది దుగ్గిరాల కుటుంబం.
టీవీలో న్యూస్ చూసిన తర్వాత రుద్రాణి చప్పట్లు కొడుతుంది. కావ్యను నెత్తిమీద పెట్టుకున్నారు. ఇంటి పరువును రోడ్డు మీద పడేసింది. ఇన్నాళ్లు కాపాడిన పరువును గంగలో కలిపేసింది. ఇప్పుడు రోడ్డు మీదకు వెళ్తే నలుగురికి ఎలా చెప్పాలి. దీనంతటికి కారణం ఎవరు కావ్య. పెద్ద కలరింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి పుట్టింటికి వెళ్లి కావాలనే మీడియాను పిలిపించి ఇంత తతంగం చేసింది అని రుద్రాణి అంటుంది.
పాపం రాజ్‌ను బలి చేసింది. నువ్వు మూర్ఖుడివి అని, తిరుగుబోతువి అని మీడియా అంటున్నారు. అలా చేసింది కావ్య అని రుద్రాణి అంటుంది. రుద్రాణి కోపంగా ఊగిపోతుంది. తర్వాత బిడ్డకోసం రాజ్‌నే వదిలేసేలా ఉంది కావ్య. కాబట్టి రాజ్‌తోనే కావ్యకు విడాకులు ఇచ్చేలా చేయాలి అని ప్లాన్ చేస్తుంది రుద్రాణి.
రాజ్ దగ్గరికి వెళ్లి కావ్యను ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నావా. విడాకులు ఇస్తున్నట్లు రివర్స్ డ్రామా ప్లే చేయు అని రుద్రాణి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్