బ్రహ్మముడి అక్టోబర్ 13 ఎపిసోడ్: ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్- బెడిసికొట్టిన రాజ్ ఐడియా- మీడియాకు ఎక్కిన కావ్య అబార్షన్ గొడవ-brahmamudi serial today episode october 13th 2025 raj plan failed to bring kavya star maa brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి అక్టోబర్ 13 ఎపిసోడ్: ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్- బెడిసికొట్టిన రాజ్ ఐడియా- మీడియాకు ఎక్కిన కావ్య అబార్షన్ గొడవ

బ్రహ్మముడి అక్టోబర్ 13 ఎపిసోడ్: ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్- బెడిసికొట్టిన రాజ్ ఐడియా- మీడియాకు ఎక్కిన కావ్య అబార్షన్ గొడవ

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్‌లో ఇందిరాదేవి, అపర్ణకు ఇదంతా నాటకం కాదని కావ్య చెప్పడంతో షాక్ అవుతారు. కనకంకు అబార్షన్ గురించి నిజం చెబుతుంది అపర్ణ. ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్ అని, అపర్ణ తినట్లేదని కావ్యకు కాల్ చేసి చెబుతాడు రాజ్. కానీ, అప్పటికే కావ్య దగ్గర అపర్ణ, ఇందిరాదేవి భోజనం చేస్తుంటారు.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 13 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్నకు కనకం కాల్ చేస్తే రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. కావ్యకు, రాజ్‌కు గొడవ ఏంటీ అని కనకం అంటుంది. నన్ను అడుగుతున్నావేంటీ. మీ ఇంటికి తప్పు చేసి వచ్చిన కూతురిని అడుగు అని రుద్రాణి అంటుంది. నా కూతురు తప్పు చేయదు అని కనకం అంటుంది. అంటే రాజ్ తప్పు చేశాడని అంటున్నావా అని రుద్రాణి అంటుంది.

ఫోన్ ముట్టుకోవద్దు

నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని కాల్ కట్ చేస్తుంది కనకం. రుద్రాణి మాట్లాడింది విన్న స్వప్న తిడుతుంది. ఇంకోసారి తన ఫోన్ ముట్టుకోవద్దుంటుంది. మరోవైపు కావ్య పుట్టింటికి ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. కావ్య ఇంటికి ఎందుకు వచ్చింది, అల్లుడి గారిని ఎందుకు తిట్టి పంపించేసింది అని కనకం అడుగుతుంది. నీకు చెప్పలేదా అయితే మాకు చెప్పలేదు అని ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు.

తర్వాత కావ్య దగ్గరికి వెళ్లి నువ్వు సూపరే, కంగ్రాచ్యులేషన్స్ అని అపర్ణ అంటుంది. దేనికి అని కావ్య అడిగితే.. నువ్వు వేసిన ప్లాన్‌కు నా మనవడి గుండె జారిపోయింది అని ఇందిరాదేవి అంటుంది. ఆ లెటర్ చదివిన నేనే షాక్ అయ్యా. పాపం నువ్వు నాటకం ఆడుతున్నావని తెలియక నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావాని తెగ టెన్షన్ పడుతున్నాడు వెధవ అని అపర్ణ అంటుంది.

ఇది నాటకం కాదు. నిజంగానే నేను ఆ ఇంటి నుంచి వచ్చేశాను అని కావ్య చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఉన్నపలంగా ఇక్కడికి వచ్చేంత కష్టం నీకేం వచ్చిందే అని ఇందిరాదేవి అంటుంది. కష్టం కాదు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. అప్పు అలా అవ్వకూడదు. ఆ గొడవలను ఇక్కడికి తీసుకురావద్దు అని కావ్య అంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని కనకం అంటుంది.

ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు

అర్థం కాకపోడానికి ఏముంది కనకం. రాజ్ దీన్ని అబార్షన్ చేయించుకోమంటున్నాడు. ఈ బిడ్డ వద్దంటున్నాడు. ఇదేమో బిడ్డ కావాలంటుంది. ఇన్నిరోజులు విడాకుల నాటకం ఆడింది. ఇది కూడా ఇలాగే అనుకున్నా. కానీ, ఇది ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు అని అపర్ణ నిజం చెబుతుంది. కావ్యే కాదు కడుపు తీయించడానికి మేము కూడా ఒప్పుకోం. అల్లుడిని నిలదీద్దాం పదా అని కనకం అంటుంది.

ఏంటీ చెప్పేది మాకే ఇన్ని చేసిన చెప్పట్లేదు. నీకేం చెబుతాడు అని ఇందిరాదేవి అంటుంది. అమ్మా.. గొడవలు ఇంతటితో చాలు. కానీ, ఏదో రోజు ఆయనే వచ్చి తీసుకెళ్తారని నమ్మకం నాకుంది అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. కనకం ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందా అని ఇందిరాదేవి అంటుంది. మీ మనవడికి అబార్షన్ కావాలి మీకు అన్నం కావాలి. బాగా పెడతాను అని కనకం అంటుంది.

గొడవలు గొడవలే ఆకలి ఆకలే. అన్నం వడ్డించు పదా అని ఇందిరాదేవి తీసుకెళ్తుంది. మరోవైపు కావ్యను ఇంటికి ఎలా తీసుకురావాలా అని రాజ్ ఆలోచిస్తాడు. కళావతికి అమ్మన్న, నానమ్మ అన్న చాలా ఇష్టం. వాళ్లకు హెల్త్ బాలేదని చెబితే వచ్చేస్తుంది అని ఐడియా వేస్తాడు రాజ్. కావ్యకు కాల్ చేస్తాడు రాజ్. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణకు భోజనం వడ్డిస్తారు కావ్య, కనకం.

రాజ్ డ్రామా

రాజ్ కాల్ చేస్తే కావ్య లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏడుస్తున్నట్లు పెద్ద డ్రామా చేస్తాడు రాజ్. ఏదైనా సమస్య అని కావ్య అంటే.. రెండు సమస్యలు అంటాడు రాజ్. నువ్వు వెళ్లిపోయావన్న బెంగతో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోవట్లేదు అని రాజ్ అంటాడు. దానికి కనకం అపర్ణ సైగలు చేసుకుంటూ కామెడీ చేస్తారు. అమ్మమ్మకు చెప్పొచ్చుగా అని కావ్య అంటే.. అసలు నానమ్మ ఉంటేగా అని రాజ్ అంటాడు.

అత్తయ్య నేనైనా తినట్లేదు అన్నాడు. మిమ్మల్ని అయితే ఏకంగా పైకే పంపించాడు అని అపర్ణ అంటుంది. నువ్ సడెన్‌గా వెళ్లిపోవడంతో నానమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చింది. నిన్ను చూడాలని కలవరిస్తూ గంటలు లెక్కపెడుతుంది. నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయ్ అని రాజ్ అంటాడు. దానికి ఇంటికెందుకు వీడియో కాల్ చేస్తే సరిపోతుందిగా అని చేస్తుంది కావ్య.

రాజ్ ఏడ్చినట్లు మొహం పెట్టి డ్రామా చేస్తాడు. నానమ్మ తన గదిలో వెంటిలేటర్‌పైన ఉందని రాజ్ అంటే.. ఆ వెంటిలేటర్ మా ఇంటికి వచ్చిందని ఇందిరాదేవి, అపర్ణను చూపిస్తుంది కావ్య. దాంతో షాక్ అయిన రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఇదంతా కామెడీగా సాగుతుంది. కానీ, రాజ్ ఐడియా మాత్రం బెడిసికొడుతుంది.

మీడియాకు చెప్పి

మరోవైపు రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటారు. కావ్య మీద రాజ్ కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని ఇంకాస్తా పెంచి శాశ్వతంగా వారిద్దరు విడిపోయేలా చేస్తే ఆ ఆస్తి మనకే. కావ్య చేత మన పరువు రోడ్డున పడేలా చేస్తే మిగతాది రాజే చూసుకుంటాడు. మనం పోయేలా చేసి దానికి కారణం కావ్య అని చూపించాలి. అందుకు మీడియా ఉందిగా. ఈరోజు గొడవలు గడప దాటితే. కావ్యను మీడియా అడిగే ప్రశ్నలకు మాట జారుతుంది. దాంతో పరువు పోతుంది అని రుద్రాణి అంటుంది.

దాంతో మీడియా రచ్చ రచ్చ చేస్తారు. ఇంటి పరువును రచ్చకు ఈడుస్తారు అని రాహుల్ అంటాడు. ఇంటి పరువు పోడానికి కారణం కావ్యే అని దూరంగా ఉంటాడు. నీకు తెలిసినవాళ్లకు చెప్పు. రెచ్చగొట్టేలా చేయాలి అని రుద్రాణి అంటుంది. రేపు తెల్లారేసరికి దుగ్గిరాల ఇంటి పరువు టీవీల్లో స్క్రోల్ అవుతుంది అని రాహుల్ అంటాడు. మరోవైపు కావ్యను ఓదారుస్తాడు కృష్ణమూర్తి.

కావ్య ఇంటికి మీడియా వచ్చి ప్రశ్నలు అడుగుతారు. మీ గొడవలకు కారణం బిడ్డేనా అని యాంకర్ అడిగితే కావ్య కోపంగా చూస్తుంది. అదంతా టీవీలో వస్తుంది. కావ్యే కావాలని చేస్తుందని రుద్రాణి చెబుతుంది. అపర్ణ కోపంతో ఊగిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం