బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంకోసారి ఇంట్లో గొడవలు జరిగితే తాను వెళ్లిపోతానని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో బాగా ఆలోచించిన కావ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతుంది. ఆ విషయం తెలిసి అంతా రాజ్‌ను తిడతారు. కానీ, రుద్రాణి మాత్రం ధాన్యలక్ష్మీని నిందిస్తుంది. మరోవైపు రాజ్‌దే తప్పని అప్పు అంటుంది.
కావ్య బాధపడుతూ వెళ్లిపోతుంది. ఏది జరగాలని కోరుకున్నానో కరెక్ట్‌గా అదే జరిగింది. ధాన్యలక్ష్మీకి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేసింది. రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అని రుద్రాణి అనుకుంటుంది. అప్పుకు కల్యాణ్ జ్యూస్ తీసుకెళ్తాడు. కావ్యను ధాన్యలక్ష్మీ అన్న మాటల గురించి కోపంగా అడుగుతుంది అప్పు.
కావ్యను అంటదేంటీ. బిడ్డను తీసేసుకోమంటే ఏ తల్లి అయినా అలాగే చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నిజం చెప్పకుండా తప్పు చేస్తుంది బావగారు. ఆయన చేసినదానికి మా అక్కను అంటదేంటీ అని అప్పు అంటుంది. ఇందులో నిజానికి తప్పు నీది. నువ్వు కరెక్ట్ టైమ్‌కి ఫుడ్ తీసుకుని ఉంటే అమ్మ అలా చేసేదా. ఒకరకంగా ఈ గొడవ జరగడానికి కారణం నువ్వే అని కల్యాణ్ అంటాడు.
కరెక్టే ఏడుస్తూ ఉంటే లాభం లేదు. ఏం జరిగినా సరే అక్కకు నిజం చెప్పేస్తాను అని అప్పు వెళ్లబోతుంటే కల్యాణ్ ఆపుతాడు. ఒకరకంగా అన్నయ్య నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. వదినకు తెలియకుండా అన్నయ్య అబార్షన్ చేయిస్తే సమస్య తీరిపోతుంది. అప్పటివరకు నువ్వు ధైర్యంగా ఉండు అని కల్యాణ్ అంటాడు. మనమంతా ఉండగా వదినకు ఏం జరగదు. కానీ, నువ్వు ఈ జ్యూస్ తాగలేదని తెలిస్తే మళ్లీ వదిననే అమ్మ అంటుందని కల్యాణ్ అంటాడు.
ఏంటీ బ్లాక్ మెయిలా అని అప్పు అంటే.. సరే నీ ఇష్టం అని కల్యాణ్ వెళ్లిపోతుంటే ఆగు అని జ్యూస్ తాగుతుంది అప్పు. రాత్రి ఒంటరిగా కూర్చుని జరిగిందంతా తల్చుకుంటూ బాధపడుతుంది కావ్య. బెడ్‌రూమ్‌కు కావ్య వెళ్తుంది. రాజ్ పడుకుని ఉంటాడు. ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసిపెట్టి కావ్య రాత్రి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం పని మనిషి కావ్య రూమ్ ఊడుస్తుంది.
కిందపడిన లెటర్ హాల్లో పడుతుంది. ఆ లెటర్ అపర్ణ చదువుతుంది. ఇలాంటి రోజు వస్తుందనికోలేదు. రోజు రోజు గొడవలు వస్తున్నాయి. దానికి కారణం ఒకరకంగా మనిద్దరమే. మనిద్దరం ఒక నిర్ణయానికి రావాలి. మీరు చెప్పినదానికి నేను, నేను చెప్పినదానికి మీరు ఇద్దరం సిద్ధంగా లేము. నేను తప్పుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే కనిపిస్తుంది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. నా కడుపులో బిడ్డను కాపాడుకోడానికి ఇదే మంచిదనిపిస్తుంది అని లెటర్‌లో కావ్య రాసింది చదివి అపర్ణ షాక్ అవుతుంది.
ఏంటది అంటూ ఇందిరాదేవి వచ్చి చదువుతుంది. ఏంటీ కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయిందా అని అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. రుద్రాణి లెటర్ తీసుకుని చదువుతుంది. రాజ్ అంటూ అపర్ణ గట్టిగా అరుస్తుంది. నిద్రలోనుంచి రాజ్ లేచి వస్తాడు. నువ్వు చేసిన నిర్వాకం వల్ల కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. కేవలం కారణం నువ్వే అని అపర్ణ నిందిస్తుంది.
ఈరోజు తను ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నువ్వు ఎంత బాధపెట్టి ఉంటావో అర్థమైందా అని ఇందిరాదేవి తిడుతుంది. రాజ్ ఒక్కడే చేసినట్లు అంటారేంటీ. ధాన్యలక్ష్మీ అన్న మాటలకు కూడా హర్ట్ అయి వెళ్లి ఉండొచ్చుగా అని రుద్రాణి అంటుంది. నేను వెళ్తానన్న కానీ కావ్యను వెళ్లిపో అనలేదుగా అని ధాన్యం అంటుంది. నీ గొడవకు అదే అర్థం వస్తుంది అని ఇందిరాదేవి అంటుంది.
కావ్య చెప్పినట్లు రాజ్ విని ఉండుంటే వెళ్లాల్లిన అవసరం వచ్చేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ధాన్యం చెప్పింది నిజమే. వీడే విని ఉంటే ఇలా జరిగేదా అని అపర్ణ అంటే.. నా మాట విని ఉంటే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేదా అని రాజ్ అంటాడు. పళ్లు రాలగొడతాను అని అపర్ణ తిడుతుంది. గొడవ పడి లాభం లేదు. కావ్యకు మొండితనం ఎక్కువ. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అని రుద్రాణి ఇంకా భయపెడుతుంది.
ఒకవేళ అదే జరిగితే రాజ్ మాత్రమే కాదు మన కుటుంబం అంతా జైలుకు వెళ్లాల్సిందే అని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణిని సుభాష్ తిడతాడు. రాజ్ కారణం చెబితే కావ్య ఉండేదేమో అని రుద్రాణి అంటుంది. చివరికి నువ్వు సాధించేది ఏంటీ ఒంటరితనం తప్పా అని ప్రకాశం అంటాడు. నిజం చెప్పిన జరిగేది అదే బాబాయ్ అని రాజ్ అనుకుంటాడు.
కావ్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రుద్రాణి అంటుంది. దాంతో చెల్లి రుద్రాణిని తిట్టిన సుభాష్ పుట్టింటికి వెళ్లి ఉంటుంది. కనకంకు కాల్ చేయమని అపర్ణకు చెబుతాడు. మరోవైపు పుట్టింటికి కావ్య లగేజ్‌తో వెళ్లిపోతుంది. ఏంటే ఒక్కదానివే వచ్చావ్. అల్లుడు గారు ఎక్కడా అని కనకం అడుగుతుంది. నాకు ఏ తోడు అవసరం లేదు. అడ్డమైన ప్రశ్నలు ఆపి టిఫిన్ చేయు అని కావ్య అంటుంది.
ఇంట్లో ఏమైనా మాట మాట అనుకున్నారా అని కనకం అడిగితే.. తల్లిపై కోప్పడి అరుస్తుంది కావ్య. రాజ్ వచ్చి అత్తింటికి రమ్మని అడిగితే.. నిర్ణయమైనా మార్చుకోండి, కారణమైన చెప్పండి అని కావ్య తెగేసి చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్