బ్రహ్మముడి మే 19 ఎపిసోడ్: రాజ్ చట్నీతో ఇంట్లోవాళ్ల అవస్థలు- రుద్రాణిని తిట్టిన రామ్- బెడిసికొట్టిన ప్లాన్- మోడ్రన్ కావ్య-brahmamudi serial today episode may 19th 2025 raj scolds rudrani kavya in modern dress star maa brahma mudi jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బ్రహ్మముడి మే 19 ఎపిసోడ్: రాజ్ చట్నీతో ఇంట్లోవాళ్ల అవస్థలు- రుద్రాణిని తిట్టిన రామ్- బెడిసికొట్టిన ప్లాన్- మోడ్రన్ కావ్య

బ్రహ్మముడి మే 19 ఎపిసోడ్: రాజ్ చట్నీతో ఇంట్లోవాళ్ల అవస్థలు- రుద్రాణిని తిట్టిన రామ్- బెడిసికొట్టిన ప్లాన్- మోడ్రన్ కావ్య

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ మే 19 ఎపిసోడ్‌లో కావ్య ఛాలెంజ్ చేయడంతో రాజ్ దోశలు వేస్తాడు. టొమాటో కెచప్‌తో చట్నీ చేయడంతో అది తినలేక ఇంట్లోవాళ్లు అవస్థలు పడతారు. కావ్య పెళ్లి ఫొటో చూపించాలని వేసిన రుద్రాణి ప్లాన్ బెడిసికొడుతుంది. దాంతో రుద్రాణిని రామ్ తిడతాడు. కావ్యకు బదులు స్వప్న స్కర్ట్‌లో ఉన్న ఫొటో ఉంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ మే 19వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య పద్ధతి మార్చుకుంటుంది. కావ్యే మారాల్సింది ఉంది. నా మనవడితో పద్ధతిగా నడుచుకో అని ఇందిరాదేవి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కళావతి గారు నా దగ్గర ఎలా నడుచుకుంటారో ఒక ప్రొగ్రెస్ కార్డ్ ఇస్తాను. అందులో పాస్ అయితేనే మీరు కళావతితో మాట్లాడాలి అని రాజ్ అంటాడు.

వచ్చాడండి దత్తపుత్రుడు

వచ్చాడండి దత్తపుత్రుడు. ఎవరి కోసం నా పద్ధతి మార్చుకోను అని కావ్య గట్టిగా చెబుతుంది. ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా నేను వెళ్లిపోతాను అని రాజ్ అంటే.. ఇందిరాదేవి, అపర్ణ ఆపుతారు. ముందు టిఫిన్ వడ్డించమని అపర్ణ అంటుంది. అసలు చేస్తే కదా. చేయాలనిపించలేదు, చేయలేదు అని కావ్య చెబుతుంది. బాబుకు మసాలా దోశ చేయు అని అపర్ణ ఆర్డర్ వేస్తే కావ్య నేను చేయను చేయను అని లెక్క చేయదు.

అయితే, నేను చేస్తాను. ఐదు రకాల దోశలు వేసి మీ మనవరాలితో తినిపిస్తాను అని రాజ్ అంటాడు. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు అని ఇందిరాదేవి అంటుంది. నేను పూర్తిగా హస్పండ్ మెటీరియల్. కానీ, కొంతమందికే నచ్చడం లేదు అని రాజ్ అంటాడు. చెప్పినంత ఈజీ కాదు వంట చేయడం అని కావ్య అంటే.. నా అట్టు నీ నోట్లో పెట్టి నీతోనే వావ్ అనిపిస్తా అని రాజ్ ఛాలెంజ్ చేస్తాడు.

అది కూడా చూస్తాను అని కావ్య కూడా ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత కిచెన్‌లో దోశలు పిండి ఎక్కడుందో, ఎలా వేస్తే వస్తాయో చెప్పండి అని రాజ్ అంటాడు. నేను తనను ఇంప్రెస్ చేస్తాను అన్నాను. చేస్తాను. మీరు హెల్ప్ చేయండి అంతే అని రాజ్ అంటాడు. దానికి బదులు మేము వేస్తాం. నువ్ వేసినట్లు చెప్పు అని ఇందిరాదేవి అంటే.. లవ్‌లో, వార్‌లో చీటింగ్ చేయొద్దు అని రాజ్ అంటాడు.

రాజ్ దోశ కష్టాలు

ఇక సరిపోయింది. దోశలు వేసినట్లే అని అపర్ణ అంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేయకుండానే దోశ వేస్తాడు రాజ్. అపర్ణ స్టవ్ ఆన్ చేయడంతో చేస్తాడు రాజ్. ముందు అపర్ణ ఒక దోశ వేసి చూపిస్తుంది. హో అంతేగా ఇప్పుడు నేను వేస్తాను అని రాజ్ కూడా దోశలు బాగానే వేస్తాడు. దాంతో ఇందిరాదేవి మెచ్చుకుంటుంది. టొమాటో కెచప్‌తో చట్నీ చేస్తాను అని రాజ్ అంటే.. అలా చేయకూడదు. మేము నేర్పిస్తాంగా అని ఇందిరాదేవి అంటుంది.

మీదంతా ఓల్డ్ స్టైల్. నా చట్నీలోనే ఉంది అసలైన మ్యాజిక్. అది తినగానే మీ మనవరాలు థ్రిల్ అవుతుంది అని రాజ్ అంటాడు. బాత్రూమ్‌కు పరుగెత్తకుంటే చాలు అని ఇందిరాదేవి అనుకుంటుంది. టొమాటో కెచప్‌తో రాజ్ చట్నీ చేస్తాడు. ఇంప్రెస్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. దోశలే ఇంకా రాలేదు అని కావ్య అంటుంది. దోశలు కూడా రెడీగా ఉన్నాయని రాజ్ తీసుకొస్తాడు.

టొమాటో కెచప్ చట్నీ గురించి వినగానే నాకు ఆకలిగా లేదని కల్యాణ్ తప్పించుకుందామని చూస్తాడు. రాజ్ అడ్డుకుంటాడు. మీ అన్నయ్య గారు ప్రేమగా చేశారుగా ఎలా తప్పించుకుంటారు అని కావ్య అంటుంది. దాంతో కల్యాణ్ ఆగిపోతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరికి దోశలు, చట్నీ వడ్డిస్తాడు రాజ్. బాబు చట్నీ తినమంటున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు డైరీలో, లాకర్ తాళాలు బీరువాలో ఉన్నాయని సుభాష్ చెబుతాడు.

ఇంట్లోవాళ్ల అవస్థలు

ఇప్పుడెందుకు చెబుతున్నావ్ అని రాజ్ అంటే.. తర్వాత చెప్పలేరని అని కావ్య అంటుంది. తర్వాత అంతా చట్నీ టేస్ట్ చేసి అవస్థలు పడతారు. లొట్టలు వేసుకుని తింటుంటూనే బాగుందని తెలుస్తుందని రాజ్ అంటాడు. బాగుంది, అద్భుతం అని వెటకారంగా అంటారు ఇంట్లోవాళ్లు. తర్వాత ఇక తినింది చాలు. ఆపండి. ఇంకా తింటే ఇటు నుంచి బాత్రూమ్‌కి అటు నుంచి హాస్పిటల్‌కు వెళ్లాలి అని కావ్య అంటుంది.

ఆముదం తాగినప్పుడు కూడా ఫేస్ ఇలా పెట్టరు. మీరు చేసిన చట్నీతో మీరు చేసిన ఒక్క దోశ పూర్తిగా తింటే బాగుందని ఒప్పుకుంటాను అని కావ్య అంటుంది. దాంతో రాజ్ తిని అలాగే షాక్ అయిపోతాడు. అద్భుతంగా ఉందని చాలా కష్టంగా చెబుతాడు రాజ్. తర్వాత అంతా లేచి దోశలు వద్దని వెళ్లిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా వంట చేయడం ఈజీ కాదని కావ్య వెళ్లిపోతుంది.

ఆన్‌లైన్‌లో వంటలను నమ్మొద్దని రాజ్ అనుకుంటాడు. అలా కావ్య ఛాలెంజ్‌లో రాజ్ ఓడిపోతాడు. చాలా అలసిపోయాను, రెస్ట్ తీసుకుందాం అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు కావ్య పెళ్లి ఫొటో చూస్తూ ఈరోజుతో నువ్ ఆడుతున్న డ్రామాలు బయటపడి రాజ్ నిన్ను అసహ్యించుకునేలా చేస్తాను అని కావ్య సింగిల్‌గా ఉన్న ఫొటో మాత్రమే కట్ చేసి బెడ్‌పై కనిపించేలా పెడుతుంది రుద్రాణి.

5 నిమిషాలు రెస్ట్ తీసుకో

మరోవైపు హాల్లో రాజ్ అలసిపోయి నీరసంగా పడిపోతాడు. అపర్ణ, ఇందిరాదేవి వచ్చి అడిగితే.. వేడిగా ఉందని చిరాకు పడుతున్నాను అని రాజ్ అంటాడు. అపర్ణ వచ్చి నీ కోసం ఏసీ ఆన్ చేసి గది అంతా కూల్‌గా ఉంచాను. వెళ్లి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో అని చెబుతుంది. అవునా, థ్యాంక్యూ అని రాజ్ వెళ్లిపోతుంటే.. అపర్ణ, ఇందిరాదేవి ఆపుతారు. ఇది ఇంప్రెస్ చేయాల్సిన టైమ్ అని చెబుతారు.

అపర్ణ, ఇందిరాదేవి మోటివేషన్ ఇస్తారు. ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుని యుద్ధం మొదలుపెడతాను, కేవలం ఐదే ఐదు నిమిషాలు అని రుద్రాణి గదికి వెళ్తాడు రాజ్. వెంటే వెళ్తుంది రుద్రాణి. బెడ్‌పై ఫొటో చూసి రాజ్ కోప్పడుతాడు. ఫొటోను విసిరిగొట్టి కిందకు వెళ్తాడు. అది చూసిన రుద్రాణి ఏమైంది రాజ్. త్వరగా వచ్చేశావ్ అని అడుగుతుంది. రెస్ట్ తీసుకునేలా ఉందా లోపల. బెడ్ మీద ఫొటో ఉంది. చూసి షాక్ అయ్యాను అని రామ్ అంటాడు.

షాక్ అయి సైలెంట్‌గా ఉంటావేంటీ. దానికి కారణం అయినవాళ్లను నిలదీయ్ అని రుద్రాణి అంటుంది. తప్పదా అని రామ్ అంటాడు. తప్పు చేసినవాళ్లను తప్పుపట్టడంలో తప్పు లేదు. వెళ్లు.. వెళ్లి కడిగిపారేయ్ అని రుద్రాణి అంటుంది. మీరింత బలవంత పెడుతుంటే తిట్టక తప్పట్లేదు.. అసలు మీరు మనిషేనా.. అత్తయ్య అయి ఉండి మీ కోడలి ఫొటోను పబ్లిక్‌గా ఎలా పెడతారండి.. ఛీ ఛీ.. కొంచెమైనా సిగ్గుండాలి అని రుద్రాణిని తిట్టేసి వెళ్లిపోతాడు రామ్.

స్వప్న స్కర్ట్ ఫొటో

అలా అడిగిమరి తిట్టించుకుంటుంది రుద్రాణి. రుద్రాణి వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది. ఇదేంటీ, లోపల ఏం చూశాడు అని గదిలోకి వెళ్లి ఫొటో చూస్తుంది రుద్రాణి. కానీ, అది స్వప్న స్కర్ట్ వేసుకున్న ఉన్న ఫొటో. అది చూసి రుద్రాణి షాక్ అవుతుంది. కావ్య ఫొటో పెడితే దీని ఫొటో ఇక్కడికి ఎలా వచ్చింది అని రుద్రాణి అంటుంది. అప్పుడే వచ్చిన స్వప్ననా ఫోన్‌లో ఉన్న ఫొటోలు బెడ్ మీదకు రాజ్ చూసేలా ఎలా వచ్చాయ్. మీ గదిలో ఎవరు పెడతారు అని స్వప్న అంటుంది.

నేనేందుకు పెడతాను అని రుద్రాణి అంటుంది. కాస్తా అయిన సిగ్గు లేకుండా మీ కోడలి ఫొటో ఎవరికి పడితే వారికి చూపిస్తారా అని ఫైర్ అవుతుంది స్వప్న. మరోవైపు కావ్య గదిలోకి పూల బొకే, గిఫ్ట్‌తో రాజ్ వస్తాడు. బ్లాక్ డ్రెస్ చూసి కావ్య చాలా బాగుందని చెబుతుంది. రాజ్ కోసం ఆ డ్రెస్ వేసుకుని మోడ్రన్‌గా కనిపిస్తుంది కావ్య. అది చూసి రాజ్ మురిసిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం