బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కళావతిని ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నావంటూ చాలా రకాల డ్రెస్సులు మారుస్తూ ఉంటాడు రామ్. ఒకటి ఫిక్స్ అయి రేపు ఇదే డ్రెస్ వేసుకుని వెళ్లాలి అని రామ్ అనుకుంటాడు. ఇంతలో అపర్ణ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి హాయ్ అమ్మా అని రామ్ అంటాడు.
దానికి సంతోషించిన అపర్ణ మమ్మీ, డమ్మీ అని పిలవకుండా అమ్మ అన్నావ్ అని అపర్ణ అంటుంది. మీరు సంతోషిస్తానంటే రోజు వందసార్లు పిలుస్తాను అని రామ్ అంటాడు. మరి రేపటికి ఏం ప్రిపేర్ అయ్యావ్ అని కాల్ చేశాను అని అపర్ణ అంటుంది. మంచి డ్రెస్ సెలెక్ట్ చేశా ఇంప్రెస్ చేయడానికి అని రామ్‌గా మారిన రాజ్ అంటాడు. ఏడ్చినట్లే ఉందే. నువ్ ఆల్రెడీ కళావతికి నచ్చేశావ్ కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు. తన మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావాలి అని అపర్ణ అంటుంది.
అవును కదా అని రాజ్ అంటాడు. ఏ పువ్వో, గిఫ్టో ఇచ్చి ఇంప్రెస్ చేయమని అపర్ణ అంటుంది. రేపు మంచి గిఫ్ట్ తీసుకొచ్చి కళావతిని ఇంప్రెస్ చేస్తా. మీరు నా వెంట ఉంటే సాధించేస్తా. ఇప్పుడు నాకు చాలా పనిపెట్టారు. రేపు ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించుకోవాలి అని కాల్ కట్ చేస్తాడు రాజ్. వీడు గతం మర్చిపోయాక నా మాట వింటున్నాడు. ఇదేదో ముందే చేస్తే ఈపాటికీ నాకు మనవడో, మనవరాలో పుట్టేవాళ్లు అని అపర్ణ అనుకుంటుంది.
మరోవైపు ధాన్యలక్ష్మీ కోపంతో రగిలిపోతుంటే ప్రకాశం బుక్ చదువుకుంటాడు. మీ ముద్దుల కోడలు పోలీస్ జాబ్ అంటూ తిరుగుతుంది. మీ అబ్బాయిని చూసుకోవట్లేదు. తనకు పోలీస్ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది. నాకు మాత్రం పిల్లలను ఎత్తుకోవాలని ఆశ ఉండదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇన్నాళ్లు ఇంట్లోకి వద్దని గొడవ, ఇప్పుడు పిల్లలు లేరని గొడవ. వాళ్లకు ప్లాన్స్ ఉంటాయి కదా. ఏదో రోజు కంటారు లే అని ప్రకాశం అంటాడు.
దాంతో కల్యాణ్ తినకుండా ఎదురుచూడటం, అప్పు తినకుండా వెళ్లడం చెప్పి దానికేంటీ అంత పొగరు. దాన్ని దారిలో పెడతాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏదోటి తగలడు అని ప్రకాశం అంటాడు. మరోవవైపు రెడ్ రోజ్‌లను రాజ్ ఫోన్‌లో ఆర్డర్ ఇస్తుంటాడు. ఇంతలో వచ్చిన యామిని ఇంత స్టైలిష్‌గా ఎక్కడికి రెడీ అయ్యావ్ బావ. రేపు రిలేటివ్స్ కలవడానికి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావా అని అడుగుతుంది.
నాకు వేరే మీటింగ్ ఉంది. అఫిషియల్ మీటింగ్ ఉంది. ఒక ఇంపార్టెన్స్ వ్యక్తిని కలవాలి అని రాజ్ అంటాడు. ఎవరా మనిషి. నీకు చెప్పాలని లేకుంటే చెప్పకు. నేనేం ఇబ్బంది పెట్టను అని యామిని అంటుంది. లేదు యామిని ఏదో ఒక రోజు తప్పకుండా ఈ విషయం నీ దగ్గర డిస్కస్ చేయాలి. ఆ టైమ్ వచ్చినప్పుడు నీకు తప్పకుండా చెబుతాను. నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకున్నాకా నీకు చెబుతాను అని రాజ్ అంటాడు.
సరే బావ రేపు నువ్ వస్తున్నావని రిలేటివ్స్‌కు చెప్పాను అని యామిని అంటుంది. లేదు యామిని, రేపు చాలా ఇంపార్టెంట్ అని. రేపు మాత్రం నీకు టైమ్ ఇవ్వలేను అని రాజ్ అని వెళ్లిపోతాడు. నాకు తెలుసు బావ. నువ్ కలవాలనుకుంటుంది ఆ కళావతినే అని. నువ్వు రోజు రోజుకు నాకు దూరం అవ్వడానికే ప్రయత్నిస్తున్నావని తెలుసు. నీ వైపు నుంచి నేను ఏం చేయలేను. కానీ, ఆ కావ్యకు పుట్టించిన భయంతో మీ ఇద్దరిని పూర్తిగా విడగొడతాను అని యామిని అనుకుంటుంది.
మరోవైపు అప్పు ఫ్రెష్ అయి వస్తుంది. తనకోసం భోజనం తీసుకొచ్చిన కల్యాణ్ వెళ్లి వెనుక నుంచి హగ్ చేసుకుని ఏంటీ అలసిపోయావా. ఆకలి వేయట్లేదా అని అడుగుతాడు. వారం రోజుల నుంచి ఓ క్రైమ్ కేసు సాల్వ్ అవ్వట్లేదు అని అప్పు అంటే.. న స్ట్రెస్‌ను నేను తీర్చనా అని రొమాంటిక్‌గా అంటాడు కల్యాణ్. నువ్ ఎలా తీరుస్తావో నాకు తెలుసు అని ఆపుతుంది అప్పు.
వెనుక నుంచి ఎందుకు వచ్చి పట్టుకున్నావ్. నీ వెధవ వేశాలు నాకు తెలుసులే అని అప్పు అంటుంది. ఫస్ట్ నైట్ నీ అంతట నువ్వు అడగంది లేనిది అని చెప్పింది నేను అని కల్యాణ్ అంటాడు. ఇద్దరు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను వచ్చింది నీకు తినిపించడానికి. రేపు అయిన శక్తి వస్తుంది కదా అని అన్నం ముద్ద తినిపించబోతాడు కల్యాణ్.
అసలు నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందిరా. నన్ను భరించడం మా అమ్మ వాళ్ల వల్లే కాలేదు అని ప్రేమగా అడుగుతుంది. సారీ కూచి డ్యూటీ డ్యూటీ అంటూ నిన్ను పట్టించుకోవట్లేదుగా అని అప్పు అంటుంది. అంతకుముందు బాగానే పట్టించుకున్నావుగా. ఇప్పుడు నేను పట్టించుకుంటాను అని అప్పుకు అన్నం తినిపిస్తాడు కల్యాణ్. మరోవైపు రుద్రాణికి యామిని కాల్ చేస్తుంది.
దుగ్గిరాల ఇంట్లో ఏం జరుగుతుంది. కావ్య ఏం ప్లాన్ చేస్తుంది అని యామిని అడుగుతుంది. మీ వెనుక చాలా జరుగుతోంది అని రుద్రాణి అంటే.. అదే తెలియట్లేదు అని యామిని అంటుంది. నీ బొంద. నీ ఫ్లాష్‌బ్యాక్ విని నువ్ పెద్ద సైకో విలన్ అనుకున్నా. కానీ, నువ్ నాకంటే కామెడీగా ఉన్నావ్. ఈసారి ప్లాన్ చేసింది కావ్య కాదు. రాజ్ వాళ్ల అమ్మ. అని ఇంట్లోవాళ్లు ప్లాన్ చేసింది చెబుతుంది రుద్రాణి.
కావ్య చేతే ప్రేమిస్తున్నట్లు చేస్తాను అని మంగమ్మ శపథం చేసి కావ్య చుట్టూ తిరుగుతున్నాడు అని రుద్రాణి అంటుంది. దాన్ని ఎలాగైనా ఆపాలి అని యామిని అంటుంది. దానికోసం నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. రేపు రాజ్ ఇంటికి రావడం కంటే ముందు కావ్యకు ఇంపార్టెంట్ పని ఉన్నట్లుగా ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. రాత్రి వరకు రాదు. అక్కడికి రాజ్ కూడా వెళ్లలేడు అని రుద్రాణి అంటుంది.
దాంతో మా బావ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని యామిని అంటుంది. దాంతో తిరిగి రాజ్ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని రుద్రాణి అంటే.. ఆస్తి మీకు వచ్చేలా చేస్తాను అని యామిని అంటుంది. మరోవైపు స్వప్న గురక పెడుతుంది. అది వినలేక రాహుల్ అల్లాడిపోతాడు. చాలా రోజుల నుంచి నీ రవ్వల నెక్లెస్ కొట్టేయాలని చూస్తున్నాను. ఇవాళ లాకర్‌లో పెట్టావ్. అందుకే నువ్ పడుకునే వరకు నేను నిద్రపోయినట్లు నటించా అని రాహుల్ అనుకుంటాడు.
మెల్లిగా లాకర్ కీస్ తీసుకుని లాకర్ ఓపెన్ చేసి రవ్వల నెక్లెస్ తీసుకుంటాడు. లాకర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి వెనుకాలే స్వప్న ఉంటుంది. స్వప్నను చూసి షాక్ అవుతాడు రాహుల్. నువ్ ఒక్కసారైన ఆడదానిలా ప్రవర్తించావా. అసలు నువ్ నా అత్త అని చెప్పుకోడానికే నాకు సిగ్గుగా ఉంది. ఆస్తి ఆస్తి అని చూస్తావ్. కోడలి గురించి పట్టించుకున్నావా అని కళ్లు తెరిచి నిద్రలోనే మాట్లాడుతుంది స్వప్న.
ఓ.. దీనికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందా. కలవరిస్తుంది. నిద్రలో కూడా మా అమ్మను తిట్టాలా అని రాహుల్ అంటాడు. తిట్టాలా కొట్టాలా అని రాహుల్‌ను ఎడాపెడా వాయిస్తుంది. తర్వాత ఆడదాని గొంతుతో మారుతాను అని రాహుల్ అంటాడు. దాంతో మరింత కొట్టి స్వప్న వెళ్లిపోతుంది. కొడితే కొట్టింది కానీ, రవ్వల నెక్లెస్ దొరికింది అని రాహుల్ అనుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం అప్పు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అప్పుకి ముద్దులు పెట్టొచ్చు కదా అని హింట్ ఇస్తాడు. అలాంటివి కుదరదని అప్పు అంటే.. అసలు అమ్మాయిలా మాట్లాడుతున్నావా, 60 ఏళ్ల ముసలిదానిలా మాట్లాడుతున్నావ్. మీల్స్ ఎలాగు లేవు కనీసం టిఫిన్స్ కూడా లేవా అని కల్యాణ్ అంటాడు. అస్సలు లేవు. కావాలంటే మంచినీళ్లు ఇస్తాను అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి వెళ్తుంది అప్పు.
తర్వాత ఇంట్లో చెప్పి అప్పు వెళ్తూ కల్యాణ్‌కు కన్నుకొడుతుంది అప్పు. తర్వాత అప్పు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ ఆపుతుంది. కాసేపటికి కావ్య ఆఫీస్‌కు వెళ్తాను ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెబుతుంది. అది కంప్లీట్ చేశామని సుభాష్ చెబుతాడు. దాంతో కావ్య ఇంట్లోనే ఉంటుంది. అది చూసిన రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయిందనుకుంటుంది. కావ్య ఇంట్లోనే ఉంటుందని యామినికి చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్