బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌ను కావ్య పంపించేస్తుంది. తర్వాత ఇంట్లోవాళ్ల దగ్గరికి వెళ్లి కావ్య నిలదీస్తుంది. ఎందుకు ఆయనకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. రిసార్టులో ఏం జరిగిందే మర్చిపోయారా అని కావ్య గట్టిగా అంటుంది. అందుకే జాగ్రత్త తీసుకుంటున్నాం. అలాంటిది జరగకుండా నీకు దగ్గర చేస్తున్నాం అని అపర్ణ అంటుంది.
అయ్యో అత్తయ్య.. ఆయన నాకు దగ్గర అవ్వడమే అసలు సమస్య అని కావ్య అంటుంది. అది సమస్య కాదు వాడికి గతం గుర్తుకు రాక ప్రస్తుతంలో బతకలేక నరకం అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు యామినిని వద్దనుకుని వదిలేశాడు. ఇప్పుడు అవి గుర్తులేక యామినిని ఇష్టం లేక నీకు దగ్గరవుతున్నాడు అని ఇందిరాదేవి అంటుంది. ఏం చేసిన ఆయనకు గతం గుర్తుకు రాకపోతే అని కావ్య అడుగుతుంది.
ఏముంది ఇంతకుముందు కావ్యగా వాడితో ఉన్నావ్. రేపటి నుంచి కళావతిగా కొత్త జీవితం మొదలుపెడతావ్. మళ్లీ పెళ్లి చేసుకుంటావ్. పిల్లలను కంటావ్. ఏదైనా వాడు సంతోషంగా ఉండటం కావాలి అని అపర్ణ అంటుంది. అది చాలా కష్టం అని కావ్య అంటుంది. అందుకేగా ఇంట్లోవాళ్లందరం కలిసి చేస్తున్నాం అని ఇందిరాదేవి అంటుంది. నాకు ఇది నచ్చట్లేదు. నేను దీనికి ఒప్పుకోను అని కావ్య వెళ్లిపోతుంది.
భర్తకు ఏమైనా అవుతుందోమే అని దాని భయం. గతం గుర్తుకు వస్తే ఇవన్నీ మర్చిపోతుంది. మనం మాత్రం రాజ్‌కు సపోర్ట్ చేద్దామని ఇందిరాదేవి అంటుంది. మనం చేస్తాం కానీ, రుద్రాణి చేయదుగా అని ప్రకాశం అంటాడు. మీరు మీరు గూడు పుటానీ చేస్తూ నన్ను చూస్తారేంటీ. మీరు ఏమైనా చేసుకోండి అని రుద్రాణి అంటుంది. మేము అందరి మంచి కోసం చేస్తాం. నువ్వు ముంచే పనులు చేయకు అని ఇందిరాదేవి అంటుంది.
ఆ యామినిని తీసుకొచ్చి పెళ్లి పత్రికలు పంచితే మొత్తానికి బంధం తెగిపోతుందనుకుంటే ఇంట్లోవాళ్లంతా ఒక్కటై కావ్యకి సహాయం చేస్తున్నారేంట్రా. రాజ్‌కు గతం గుర్తుకురావడానికి ముందే యామినితో పెళ్లి అయిపోతే.. అప్పుడేం చేస్తారు వీళ్లు అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. యామిని ఇంటికి రాజ్ చాలా సంతోషంగా వస్తుంటాడు. చాలా హ్యాపీగా స్పెషల్‌గా కనిపిస్తున్నావ్ అని యామిని అడుగుతుంది.
ఉదయమే ఎక్కడికి వెళ్లావ్. జాగింగ్‌కు వెళ్లలేదని చూస్తే తెలిసిపోతుంది అని యామిని అంటుంది. వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామనుకున్నాకదా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్‌లో పంచడానికి వెళ్లాను అని రామ్‌గా ఉన్న రాజ్ అబద్ధం చెబుతాడు. అవునా.. నేను ఇది నమ్మలేకపోతున్నాను అని యామిని సంతోషంగా ఆశ్చర్యపోతుంది.
సారీ యామిని నేను చెప్పే అబద్ధం విని చాలా సంతోషపడుతున్నావ్. నేను లైఫ్‌లాంగ్ హ్యాపీగా ఉండాలంటే కళావతి గారి మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి. ఆ నిజం ఇప్పుడే చెప్పలేను. కళావతి గారి మనసులో నేనున్నాని తెలిసిన రోజు నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదన్నే విషయాన్ని ఓపెన్‌గా చెబుతాను అని రామ్ మనసులో అనుకుంటాడు.
నీ అంతట నువ్వే కార్డ్స్ పంచుతున్నావంటే నాకు ఇంకా ఏం కావాలి. ఈ విషయాన్ని మమ్మీ డాడీతో షేర్ చేసుకోవాలి అని సంతోషంగా వెళ్లిపోతుంది యామిని. రామ్ చెప్పింది చెప్పి యామిని తెగ సంబరపడుతుంది. నేను అడగకుండానే తనంతంటే తాను కార్డ్స్ పంచాడట. ఇది నాకు చాలా పెద్ద విషయం. నా మొదటి అడుగుపడింది. ఇక పెళ్లి పనులు చకాచకా జరుగుతాయి. ముందు ఈ విషయం నా శత్రువుకు చెప్పాలి అని యామిని వెళ్లిపోతుంది.
కావ్యకు యామిని కాల్ చేసి ఎలా ఉన్నావ్ అడుగుతుంది. ఇకనుంచి ప్రతి క్షణం హ్యాపీగా ఉండబోతున్నాను. నాకు కాబోయే శ్రీవారు నీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా అని పెళ్లి పత్రికలు స్వయంగా పంచుతున్నాడు అని యామిని చెబుతుంది. ఏంటీ గుండెల్లో బాంబ్ పడిందా. ఇలాంటివి చాలా పడుతుంటాయ్. తట్టుకోడానికి సిద్ధంగా ఉండు అని యామిని అంటుంది.
నేను ఒక బాంబ్ పేలుస్తాను. అది తట్టుకోడానికి నువ్ సిద్ధంగా ఉండు. మీ ఇంటికి హుషారుగా వచ్చిన మా ఆయన.. అప్పటికీ ఇప్పటికీ మా ఆయనే. పొద్దు పొద్దున్నే ఆయన వచ్చింది ఎక్కడికో తెలుసా. మా ఇంటికే. నేను దూరం పెడుతున్నాను అని తెలిసి నాకంటే ముందు నా ఫ్యామిలీని బుట్టలు వేసుకోడవం మొదలుపెట్టారు. ఇక మా వాళ్లు తిరిగొచ్చిన బిడ్డకు మర్యాదలు చేస్తూ సంతోషంతో మురిసిపోయారు అని కావ్య చెబుతుంది.
దాంతో యామినికి పెద్ద షాక్ తగులుతుంది. ఇప్పుడు చెప్పు నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడినట్లా రెడ్ సిగ్నల్ పడినట్లా. నీతో చెప్పిన పెళ్లి పత్రికలు ఏ ఏట్లో ముంచాడో అది తెలుసుకో ముందు. పెట్టేయ్ ఫోన్ అని కాల్ కట్ చేస్తుంది కావ్య. దాంతో యామిని షాక్ అవుతుంది. నా దారిలోకి వచ్చినట్లు చేస్తూ తన దారి క్లియర్ చేసుకుంటాడా. నన్ను ఇంత మోసం చేస్తాడా అని యామిని అనుకుంటుంది.
మరోవైపు కావ్యను పిలిచి రాజ్ రావడం నీకు నచ్చలేదని అర్థమైంది. కానీ, అది నీకు ఇబ్బంది కలిగిన రాజ్ ఇంటికి వస్తూనే ఉంటాడు అని సీతారామయ్య చెబుతాడు. ఇప్పటికే ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడాను. మళ్లీ అలా చేయలేను అని కావ్య అంటుంది. ఆలస్యం చేస్తే వాడు మనకు శాశ్వతంగా దూరమవుతాడు అని ఇందిరాదేవి అంటుంది. ఇంకోసారి అలాంటి అపశృుతులు కలగకుండా వాడికి గతం గుర్తు చేస్తే సరిపోతుంది అని సీతారామయ్య అంటాడు.న
నేను ఆయనకు దగ్గరిగా ఉండటమే ఆయనకు ప్రమాదం అని రాజ్ అంటాడు. అది మేము చూసుకుంటాం. కానీ, నువ్ ఒకటి చేయాలి. రేపటి నుంచి వాడు ఎంత ప్రేమ చూపించిన నువ్ దూరం ఉండాలి. అప్పుడే నీకోసం ఇంకా ప్రయత్నిస్తాడు. వాడి గురించి వాడు తెలుసుకుంటాడు అని సీతారామయ్య సలహా ఇస్తాడు. దయచేసి ఇలాంటి పరీక్ష నాకు పెట్టకండి అని కావ్య అంటే.. ఇదొక్కటే మార్గం అమ్మా. నువ్వొక్కదానివే మాకు ఆశ అని సీతారామయ్య అంటాడు.
మా ఆశల మీద నీళ్లు జల్లకు. వాడి గతాన్ని వాడే తెలుసుకునేలా ప్రయత్నిద్దాం. నువ్ మాత్రం మౌనంగా చూస్తూ ఉండు. ఇదొక్కటే నీ నుంచి ఆశించేది అని అపర్ణ చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రాత్రి కల్యాణ్ ఏదో రాసుకుంటుంటే ధాన్యలక్ష్మీ వచ్చి సాయంత్రం నుంచి రాసుకుంటున్నావ్. అప్పుడు ఆకలి లేదన్నావ్ అని అడుగుతుంది. అప్పుడు లేదు ఇప్పుడు చాలా ఆకలిగా ఉందని కల్యాణ్ అంటాడు.
మరి తినొచ్చు కదరా అని ధాన్యలక్ష్మీ అంటే.. తను రావాలి కదా. అప్పు రావాలి కదా అని కల్యాణ్ అంటాడు. తనకోసం ఎందుకు వెయిట్ చేయడం అని ధాన్యం అడిగితే.. నువ్ చిన్నప్పుడు నాన్నకోసం ఎందుకు వెయిట్ చేసేదానివి అని అడుగుతాడు కల్యాణ్. అప్పు కోసం భార్యలా మారి కల్యాణ్ ఎదురుచూశాడని భర్త గురించి భార్య ఎదురచూడొచ్చు. కానీ, ఏ మొగుడు నీలా చూడడు. భార్యకు సపోర్ట్ చేయడం సిగ్గుగా లేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నాన్న నీకు సపోర్ట్ చేసేవాడు. అది కూడా తప్పేనా అని కల్యాణ్ అంటాడు. అప్పుడే తల్లిని తప్పుపట్టడం నేర్చుకున్నావా. తల్లి కన్న పెళ్లమే బెల్లం అయిపోయిందా అని కల్యాణ్‌ను అంటుంది. ఇంతలో అప్పు వస్తే ఇంత లేట్ ఏంటీ.. అర్ధరాత్రి వరకు ఉండటం ఏంటీ అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. నాకు లేట్ అవుతుందని చెప్పిందమ్మా అని చెప్పిన కల్యాణ్ అప్పు ఫ్రెష్ అయి రా కలిసి తిందాం అని అంటాడు.
చాలా టైడ్ అయ్యాను. ఫ్రెష్ అయి పడుకుంటాను అని అప్పు అంటుంది. టైడ్ అయినట్లు చెబుతుందిగా అని కల్యాణ్ అంటాడు. గుడ్ నైట్ అత్తయ్య అని అప్పు అంటే.. ఏం గుడ్డు జరిగింది. నా కొడుకును ఆకలితో మాడుస్తున్నావ్. వెళ్లు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అప్పు వెళ్లిపోతుంది. కనీసం ఇప్పుడైనా వడ్డించనా అని ధాన్యలక్ష్మీ అంటే తర్వాత తింటాను అని కల్యాణ్ అంటాడు.
నేను వడ్డించే హక్కు కూడా కోల్పోయానా అని ధాన్యం అంటే.. ప్రతిదానికి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తావ్. సరే వడ్డించు అని కల్యాణ్ అంటాడు. ఇంతల అడుక్కున్నాక ఏం అవసరం లేదు అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు కృష్ణుడుతో మొరపెట్టుకుంటుంది కావ్య. ఆయనకు ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను అని వెళ్లిపోతుంది కావ్య.
మరోవైపు రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ కళావతి గారిని ఇంప్రెస్ చేయడానికి అని మారుస్తుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్