కావ్య ఆడుతున్న నాటకాన్ని రెడ్ హ్యాండెడ్‌గా బయటపెడుతుంది యామిని. అపర్ణ, కావ్య మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెడుతుంది. రాజ్‌తో తనకు ఉన్న స్నేహ బంధం కట్ కావడంతో కావ్య కుప్పకూలిపోతుంది. నువ్వు ఏం చేయలేవని, ఏం చేసిన రాజ్ ప్రాణాలకు ప్రమాదమని నీకు బాగా తెలుసు కదా అని కావ్యను రెచ్చగొడుతుంది యామిని.
ఆ ఒక్క కారణంతోనే నువ్వు ప్రాణాలతో బతికిపోతున్నావని యామినితో కోపంగా అంటుంది కావ్య. ఒక్క కారణంతోనే రాజ్‌ను తన సొంతం చేసుకుంటానని యామిని అంటుంది.
తమ పెళ్లి ఎలా జరిగిందో యామినికి చెబుతుంది కావ్య. విధి రాతను నీలాంటివాళ్లు ఎంత మంది వచ్చిన మార్చలేరని అంటుంది. ఎప్పటికైనా రాజ్ నన్నే భార్యగా స్వీకరిస్తారని యామినితో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. రాజ్‌ను సొంతం చేసుకొని చూపిస్తా అంటూ ప్రతిసవాల్ విసురుతుంది యామిని.
తనకు ఉన్న ఒక్క అవకాశం దూరం చేసి యుద్దం ఎలా చేయాలి అని దేవుడిని వేడుకుంటుంది కావ్య. రాజ్‌ను తిరిగి దక్కించుకునేందుకు ఒక్క అవకాశం ఇస్తే మిగిలింది తాను చూసుకుంటానని కావ్య అంటుంది.
రాజ్‌ను కలుస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. రాజ్‌కు కలవడానికి ఎందుకు వచ్చామో చెప్పబోతుంది అపర్ణ. మీరు మాట్లాడొద్దు కోపంగా రాజ్ అంటాడు. మీ మధ్య ఉన్న బంధాన్ని కళావతి ఎందుకు దాచింది...మీరు ఎందుకు నిజం చెప్పలేదు...ఇది మోసం కాదా అని రాజ్ అంటాడు. నా మనవరాలు అబద్ధం చెప్పింది...కానీ మోసం చేయలేదని ఇందిరాదేవి కావ్యకు సపోర్ట్ చేస్తుంది.
రిసార్ట్‌లో పడిపోతే కనీసం హాస్పిటల్‌కు రాలేదు...ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని రాజ్ అంటాడు. డైరెక్ట్‌గా కలవాలని ఇంటికొస్తే నన్ను నానా మాటలు అన్నదని అంటాడు. అసలు నేనేం తప్పు చేశానని అంటాడు. నన్ను కలవడం, మాట్లాడటం ఇష్టంలేకపోతే ఎందుకు పరిచయం పెంచుకోవాలని రాజ్ అంటాడు.
నా చెల్లెలు ఎవరిని కలవడం, మాట్లాడటం తాము చూడలేదని స్వప్న అంటుంది.కానీ మిమ్మల్ని మాత్రం ఎందుకు కలుస్తుందో తెలియడం లేదని స్వప్న అంటుంది. అవన్నీ మీ చెల్లినే అడగండి నాకేం తెలుసు అని రోజ్ కోపంగా బదులిస్తాడు. ఆడపిల్ల మనసును మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అప్పు అంటుంది. మేము ఏది నేరుగా చెప్పలేం. మీరే అర్థం చేసుకోవాలి అని చెబుతుంది.
కావ్య ఫోన్ కోసం నువ్వు ఎలా ఎదురుచూస్తావో...అలాగే కావ్య కూడా నీ ఫోన్ కోసం ఇంట్లో ఎదురుచూస్తుందని అపర్ణ అంటుంది. ఎప్పుడు నీతో మాట్లాడాలని పరితపిస్తుంనది చెబుతుంది. నీ కోసం వంట చేసి ఎందుకు పంపించిందో తెలుసా...నువ్వు తన ఇంటికొస్తేరుచిగా వండ గలను అని చెప్పడానికి అని రాజ్‌తో అంటుంది అపర్ణ. చీర గిఫ్ట్‌గా ఇవ్వడానికి నువ్వు వచ్చిన రోజు మేము కూడా ఇంట్లో ఉన్నామని, కానీ కళావతి మమ్మల్ని నీతో కలవకుండా చేసిందని స్వప్న అంటుంది.
కళావతి నిన్ను ప్రేమిస్తుందని, నీపై ఇష్టంతోనే ఇవన్నీ చేసిందని అంటారు. కళావతి ఇన్ని రోజులు నాతో తిరిగింది అని రాజ్ అనగానే...ఇష్టంతోనే అని ఇందిరాదేవి బదులిస్తుంది. నీపై ప్రేమ ఉంది కాబట్టే నీతో రెస్టారెంట్‌కు వచ్చిందని, నిన్నే భర్తగా చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టే నువ్వు ఇచ్చిన చీర కట్టుకుంటుందని రాజ్‌తో అంటారు దుగ్గిరాల ఫ్యామిలీ.
రెక్ట్‌గా వెళ్లి ఇప్పుడే కావ్యకు ప్రపోజ్ చేస్తానని రాజ్ అంటాడు. అలా చెబితే కావ్య నిన్ను రిజెక్ట్ చేస్తుందని కళ్యాణ్ బదులిస్తాడు. యామినితో పెళ్లికి సిద్ధపడి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే ఎవరూ నమ్మరని అంటాడు. ప్రస్తుతం కావ్యకు నీపై కోపం ఉందని అంటాడు.
నీకు కళావతి కావాలా అని రాజ్‌ను అడుగుతుంది ఇందిరాదేవి. కావాలని రాజ్ బదులిస్తాడు. మరి యామిని అనగానే...తనను పెళ్లిచేసుకోవడం నాకు ఇష్టం లేదని రాజ్ అంటాడు. కళావతి మనసులో ఏముందో తెలుసుకన్న యామినితో పెళ్లిని రిజెక్ట్ చేయాలని అనుకున్నట్లు రాజ్ చెబుతాడు.
కావ్య మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడం ఈజీ కాదని రాజ్‌తో అంటారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. కావ్య మనసుకు దగరయ్యేలా చేయమని సలహా ఇస్తారు. కావ్య ప్రేమను గెలుచుకోవడానికి ఎంత కష్టమైనా పడతానని రాజ్ అంటాడు.
ఇక నుంచి కళావతి తిడితే అని ఇందిరాదేవి అడుగుతుంది...తిట్టించుకుంటా అని రాజ్ బదులిస్తాడు. కావ్య అలిగితే అని అప్పు అడగ్గా...బుజ్జగిస్తా అని రాజ్ బదులిస్తాడు. నాలో ఉన్న ప్రేమికుడు నిద్రలేస్తేఎలా ఉంటుందో చూపిస్తానని రాజ్ అంటాడు.
దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజ్ కోసం రకరకాల వంటలు చేస్తారు అపర్ణ, ధాన్యలక్ష్మి. వారు ప్రేమతో వడ్డించిన వంటలు తినడానికి రాజ్ ఇబ్బందులు పడతాడు. తన ఇంటికొచ్చిన రాజ్‌ను చూసి కావ్య షాకవుతుంది. అపర్ణతో రాజ్ ప్రేమగా మాట్లాడటం చూసి గతం గుర్తొచ్చిందని అనుకుంటుంది.
రాజ్ తిరిగి మళ్లీ ఇంటికిరావడం చూసి రుద్రాణి కూడా షాకవుతుంది. వారి ప్లాన్‌ను చెడగొట్టి రాజ్‌ను అక్కడి నుంచి పంపించేయబోతుంది. రాజ్ ఇంకా ఏం గుర్తురాలేదన్న మాట...ఇంకా మీరు చెప్పేశారు ఏమిటో అని టెన్షన్ పడిపోయానని రుద్రాణి అంటుంది. రాజ్ గురించి చెప్పలేదా అని రాహుల్ కూడా అందరిని ఇరికించేస్తాడు.
రాజ్ అంటే సుభాష్ కొడుకు అని ఇందిరాదేవి కవర్ చేయబోతుంది. రాజ్ ఇప్పుడు ఎక్కడున్నాడని సుభాష్‌ను అడుగుతాడు రాజ్. ఎక్కడో ఏంటి నువ్వే కదా అని ప్రకాశం నోరు జారుతాడు. అంటే సుభాష్ కొడుకు నువ్వు కూర్చొనే ఛైర్‌లోనే కూర్చునే వాడని ప్రకాశం మాటలను కవర్ చేస్తుంది ధాన్యలక్ష్మి.
సుభాష్ కొడుకు ఇక్కడ లేడంటే ఎక్కడో ఉన్నాడని అర్థం అంటూ స్వప్న కన్ఫ్యూజ్ చేస్తుంది. అతడు అడిగిన ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక ఏదోదో మాట్లాడుతాడు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. తన ఫ్యామిలీ మెంబర్స్ ఆడుతున్న అబద్ధాలు చూసి కావ్య కోపం పట్టలేకపోతుంది.
ఎందుకొచ్చారు మా ఇంటికి అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. టిఫిన్ చేయడానికి అని రాజ్ అంటాడు.
టిఫిన్ చేశారు కదా...ఇక బయలుదేరండి అని కావ్య అంటుంది. ఇంటికి వచ్చిన అతిథితో మాట్లాడటం ఇలాగేనా అని ఇందిరాదేవి కావ్యను కసుకుంటుంది. రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందేనని కావ్య పట్టుపడుతుంది. . కళావతి మాటకు గౌరవం ఇచ్చి ఈ రోజు వెళ్లిపోతున్నాను...కానీ మళ్లీ రేపు వస్తానని రాజ్ అంటాడు.
రేపు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోకూడదని ఇందిరాదేవి అంటుంది. రేపటి నుంచి తెల్లార్లు ఇక్కడే ఉంటానని ఇక నుంచి ఇదే నా ఫ్యామిలీ, నా జీవితం అని రాజ్ అంటాడు. చెప్పింది చాలు ఇక నడవండి అని కావ్య కోపంగా అంటుంది. అయినా రాజ్ కదలకపోవడంతో తానే స్వయంగా రాజ్ చేయి పట్టుకొని ఇంటి బయటకు తీసుకొస్తుంది.
మా ఇంటికి రావొద్దని చెప్పారుగా ఎందుకొచ్చారని రాజ్‌ను అడుగుతుంది కావ్య. మీ మనసులో మాట చెప్పమని చాలా సార్లు అడిగాను చెప్పారా అని కావ్యను అడుగుతాడు రాజ్. అది చెప్పాల్సిన అవసరం లేదని కావ్య పెడసరిగా సమాధానమిస్తుంది. ఇక నుంచి మా ఇంటికి రావడానికి వీలులేదని అంటుంది. ఇక నుంచి నా కేరాఫ్ అడ్రెస్ మీ ఇళ్లే. నేను ఫాలో అయ్యేది మిమ్మల్నే అని రాజ్ అంటాడు.
మీరు ఎంత తిరిగిన ప్రయోజనం లేదని కావ్య అంటుంది. రేపటి నుంచి అసలైన కథ మొదలవుతుందని, అప్పటివరకు గుడ్‌బై అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. ఇక నుంచి రాజ్ ఇంటికివస్తాడని, నీకు ఇష్టం లేకపోయినా తప్పదని సీతారామయ్య అంటాడు. తమ ప్లాన్‌ను కావ్యకు చెబుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం